UIDAI New App: ఆధార్ వినియోగదారులకు అదిరిపోయే వార్త.. త్వరలోనే సరికొత్త యాప్

UIDAI New App: దేశంలో పౌరులను గుర్తించడానికి ఆధార్ తప్పనిసరి. అసలు ఆధార్ కార్డు లేకపోతే దేశంలో ఏ పని కూడా జరగదు. రైలు టికెట్ నుంచి ప్రతీ దానికి కూడా ఆధార్ ఉండాల్సిందే. అయితే ఎప్పటికప్పుడు కొందరు ఈ ఆధార్‌ను అప్డేట్ చేసుకుంటారు. ఎందుకంటే పేరు, చిరునామా, ఫొటో ఇలా ఏదో ఒకటి మార్చాల్సి వస్తుంది. ప్రస్తుతం దేశంలో 95% కంటే ఎక్కువ మంది పౌరులకు ఆధార్ కార్డులు ఉన్నాయి. ఏదైనా సమస్య వస్తే వెంటనే ఆధార్ సెంటర్ లేకపోతే UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లి అప్లై చేసుకోవాలి. అయితే దీనివల్ల చాలా మంది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు UIDAI ఒక యాప్‌ను త్వరలోనే తీసుకురానుంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు కొన్ని నిమిషాల్లోనే వారి సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఇకపై ఆధార్ ఎలాంటి జిరాక్స్‌లు కూడా లేకుండా క్యూఆర్ కోడ్ రూపంలో ఉపయోగించేలా UIDAI ప్లాన్ చేస్తోంది. దీనివల్ల డేటా కూడా సురక్షితం అవుతుంది. సైబర్ క్రైమ్‌లు వంటి వాటికి కూడా ఉపయోగించడానికి వీలు కుదరదు.
ఇదిలా ఉండగా ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి UIDAI వచ్చే ఏడాది జూన్ 14వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. అయితే ఉచితంగా ఆధార్ అప్‌డేట్ అనేది myAadhaar పోర్టల్ ద్వారా మాత్రమే అవుతుంది. అయితే UIDAI ద్వారా మీరు మీ ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత రుసుము చెల్లిస్తేనే ఆధార్ అప్‌డేట్ ఉంటుందని UIDAI తెలిపింది. కాబట్టి ఇప్పుడే ఫ్రీగా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోండి. ఆధార్ పొందినప్పటి నుంచి 10 సంవత్సరాలు పూర్తయిన కూడా కొందరు అప్డేట్ చేసుకోలేదు. అలాంటి వారు వెంటనే అప్డేట్ చేసుకోవాలని UIDAI తెలిపింది.
మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. లేకపోతే ఏ పని కూడా జరగదు. బ్యాంకింగ్, మొబైల్ నంబర్ పోర్టబిలిటీ, ఆన్‌లైన్ సేవలు సక్రమంగా పూర్తవుతాయి. దేనికైనా ఆధార్ లేకపోతే కుదరదు. పనులు అన్ని కూడా మధ్యలోనే ఆగిపోతాయి. ఆధార్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడం కూడా ఈజీ. myAadhaar పోర్టల్‌లోకి వెళ్లి అప్‌డేట్ చేసుకోవాలి. https://myaadhaar.uidai.gov.in/ పోర్టల్‌కి వెళ్లి myAadhaar ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలోకి వెళ్లాలి అక్కడ My Aadhaar అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత Update Your Aadhaarపై క్లిక్ చేస్తే అవుతుంది. మీరు మార్చాలని అనుకున్నవి మార్చి అప్‌డేట్ చేస్తే మీకు 12 అంకెల ఆధార్ నంబర్, కాప్చా కోడ్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత ‘Send OTP’పై క్లిక్ చేయండి. ఇలా చేస్తే మీరు ఆధార్‌లో ఏదైనా అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఇది కూడా చూడండి: Samantha : వామ్మో.. ఫోటోగ్రాఫర్ల పై విరుచుకుపడ్డ సమంత.. ఇంత కోపం ఎన్నడూ చూడలేదు