Rashmika : రష్మిక పై ప్రశంసల వర్షం కురిపించిన నాగార్జున, సల్మాన్, శేఖర్ కమ్ముల.. ఎందుకంటే ?

Rashmika : సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘కుబేర’ (Kubera) చిత్రం రిలీజ్ డేట్ దగ్గరపడుతుంది. ఈ సినిమా జూన్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో ధనుష్, నాగార్జున వంటి స్టార్ హీరోలు నటించారు. నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో వారీసు సినిమా తర్వాత రష్మిక చేస్తున్న సినిమా కావడంతో అక్కడ అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. సినిమా ట్రైలర్ చూసిన వారికి ఇది డబ్బు, ధనవంతుల నేపథ్యంలో సాగే కథ అని స్పష్టమవుతోంది. అయితే, ‘కుబేర’ సినిమా విడుదల కాకముందే సినిమాలో రష్మిక నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ములతో పాటు, గతంలో నాగార్జున, సల్మాన్ ఖాన్ కూడా రష్మిక టాలెంట్‌ను మెచ్చుకున్నారు.
‘కుబేర’ చిత్రంలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్లు ట్రైలర్లో కనిపించింది. రష్మిక పాత్రకు కూడా సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తోంది. రష్మిక నటనను చూసి దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా ముగ్ధులయ్యారట. ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయంపై మాట్లాడుతూ.. “రష్మిక ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. అది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె నేచురల్ గానే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసింది” అని ప్రశంసించారు. ఈ చిత్రంలో రష్మికది డి-గ్లామ్ పాత్ర కావడం విశేషం.
Read Also:UIDAI New App: ఆధార్ వినియోగదారులకు అదిరిపోయే వార్త.. త్వరలోనే సరికొత్త యాప్
రష్మిక గురించి శేఖర్ కమ్ముల మాత్రమే కాదు, గతంలో నాగార్జున, సల్మాన్ ఖాన్ కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ‘కుబేర’ ఈవెంట్లో మాట్లాడిన నాగార్జున, “నిజంగా రష్మిక చాలా టాలెంటెడ్. గత మూడు సంవత్సరాలుగా ఆమె అద్భుతంగా వర్క్ చేస్తుంది. ఆమె 3వేల కోట్ల హీరోయిన్” అని రష్మికను కొనియాడారు. రష్మిక నటించిన అనేక సినిమాలురూ.500 కోట్ల కలెక్షన్లను మించి రాబట్టాయి. అందుకే నాగార్జున ఈ కామెంట్ చేశారు. ప్రస్తుతం దేశమంతా గుర్తింపు పొందిన ‘పాన్-ఇండియా’హీరోయిన్ గా రష్మిక ఓ వెలుగు వెలుగుతోంది.
సల్మాన్ ఖాన్ కూడా రష్మిక పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘సికందర్’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ‘పుష్ప 2’ చిత్రం షూటింగ్ కూడా జరుగుతోంది. రష్మిక ఈ రెండు పెద్ద ప్రాజెక్టులను ఏకకాలంలో మేనేజ్డ్ బ్యాలెన్స్ చేసింది. ఉదయం ‘సికందర్’ షూటింగ్లో పాల్గొంటే, రాత్రి ‘పుష్ప 2’ షూటింగ్లో పాల్గొనేది. ఆమెకున్న ఈ అంకితభావం సల్మాన్ ఖాన్‌ను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. రష్మిక కెరీర్లో ‘కుబేర’ సినిమా ఇంకెలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
Read Also:Voter ID Card : ఓటర్లకు గుడ్ న్యూస్.. 15 రోజుల్లోనే ఇంటికే ఓటర్ ఐడీ కార్డు!
-
Rashmika : స్టార్ హీరోల లక్కీ హీరోయిన్ రష్మిక.. అల్లు అర్జున్‌తో నాలుగోసారి!
-
Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
-
Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు
-
Rashmika : మరో వివాదంలో చిక్కుకున్న రష్మిక మందన్నా.. ఇంతకీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో ?
-
Kubera : ఒకచోట హిట్.. ఇంకోచోట ఫ్లాప్.. ‘కుబేర’ కలెక్షన్లపై అంతుచిక్కని మిస్టరీ!
-
Rashmika : ‘మైసా’ పోస్టర్‌తో బయటపడిన విజయ్, రష్మిక బంధం