Rashmika : ‘మైసా’ పోస్టర్‌తో బయటపడిన విజయ్, రష్మిక బంధం

Rashmika : టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న మధ్య ఎంత స్నేహం ఉందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చాలా సంవత్సరాలుగా వాళ్ళు కలిసి తిరుగుతున్నారు. సినీ రంగంలో అయినా, వ్యక్తిగత జీవితంలో అయినా ఒకరికొకరు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. అయితే, తమ ఇద్దరి రిలేషన్‌షిప్ గురించి మాత్రం వాళ్ళు ఇప్పటివరకు బయటపెట్టలేదు. కానీ, వాళ్ళ ప్రవర్తనను చూస్తే మాత్రం అన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. ఇప్పుడు రష్మిక మందన్న ఇంకో పెద్ద క్లూ ఇచ్చింది.
తాజాగా రష్మిక మందన్న కొత్త సినిమా ‘మైసా’ అనౌన్స్ అయింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రష్మిక చాలా డిఫరెంట్‌గా, సీరియస్ రోల్‌లో కనిపిస్తోంది. ఇది పూర్తిగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి, రష్మిక అభిమానుల్లో చాలా ఆసక్తి పెరిగింది. చాలా మంది సెలబ్రిటీలు రష్మికకు అభినందనలు తెలిపారు.
Read Also:Bigg Boss Season 9: బిగ్ బాస్‌లోకి వెళ్లాలని అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి
ఈ పోస్టర్‌ను చూసిన విజయ్ దేవరకొండ కూడా ఊరుకోలేకపోయాడు. తన సోషల్ మీడియాలో ‘మైసా’ పోస్టర్‌ను షేర్ చేసుకుని, “ఇది అదిరిపోతుంది!” అని రాశాడు. దానికి రష్మిక మందన్న ఇచ్చిన రిప్లై ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. రష్మిక విజయ్‌కి రిప్లై ఇస్తూ.. “విజు, దీంతో నీకు గర్వం కలిగేలా చేస్తానని హామీ ఇస్తున్నాను” అని రాసింది.
విజయ్ దేవరకొండను రష్మిక మందన్న ముద్దుగా ‘విజు’ అని పిలుస్తుంది. ఇది వాళ్ళిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి ఇంకో ఆధారం. చాలాసార్లు వీళ్ళు కలిసి బయట తిరుగుతూ కెమెరాలకు చిక్కారు. విజయ్ దేవరకొండ ఇంట్లోనే రష్మిక మందన్న పండుగలు కూడా జరుపుకుంది. అయినా కూడా, వీళ్ళు ఇప్పటివరకు తమ ప్రేమను పబ్లిక్‌గా ఒప్పుకోలేదు.
Read Also:Kamal Haasan : సినిమా కష్టాలు, వివాదాల మధ్య కమల్ హాసన్‌కు ఆస్కార్ గౌరవం!
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మొదటిసారి కలిసి ‘గీత గోవిందం’ సినిమాలో నటించారు. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో, వాళ్ళిద్దరి మధ్య స్నేహం మరింత పెరిగింది. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో కూడా జోడీగా కనిపించారు. ఆ సినిమా తర్వాత వాళ్ళ బంధం మరింత గట్టిపడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వాళ్ళిద్దరి మధ్య బంధం కొనసాగుతూనే ఉంది. మొత్తానికి, ‘మైసా’ సినిమా పోస్టర్, దానికి విజయ్ ఇచ్చిన కామెంట్, రష్మిక ఇచ్చిన రిప్లై.. ఇవన్నీ చూస్తుంటే, వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.
-
Kubera Movie : ‘కుబేర’కు రూ.100 కోట్లు వచ్చినా, ధనుష్‌కు షాకే!
-
TollyWood : టాలీవుడ్ లో కొత్త రూల్.. అవి వాడే ఆర్టిస్టులపై లైఫ్ టైం బ్యాన్
-
Rashmika Mandanna: భయపెట్టిన నేషనల్ క్రష్ రష్మిక.. ఫ్యాన్స్ నెవర్ బిఫోర్ లుక్‌లో కొత్త ప్రాజెక్ట్!
-
Kubera: 100 కోట్ల క్లబ్‌లోకి కుబేర.. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?
-
Dhanush: చిరంజీవిని చూడగానే ధనుష్ చేసిన పని వైరల్.. ఊహించని ఘటనకు అంతా షాక్
-
Vijay Deverakonda : రాజుకున్న ‘రెట్రో’ వివాదం.. విజయ్ దేవరకొండ పై కేసు నమోదు