Bigg Boss Season 9: బిగ్ బాస్‌లోకి వెళ్లాలని అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి

Bigg Boss Season 9: బిగ్ బాస్ కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుండటంతో స్టార్ మా ఇటీవల ఒక ప్రొమోను విడుదల చేసింది. ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లు పూర్తి కావడంతో త్వరలో తొమ్మిదో సీజన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే స్టార్ మా తొమ్మిదవ సీజన్‌కి సంబంధించి ఒక ప్రోమో వీడియో రిలీజ్ చేశారు. ఇందులో కూడా ఈసారి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ ప్రొమోలో ఆటలో అలుపు వచ్చినంత ఈజీగా గెలుపు రాదు.. ఆ విజయం రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు. కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలని అంటారు.. ఈ సారి బిగ్ బాస్ చదరంగం కాదు పెద్ద రణరంగమే అని నాగార్జున ప్రొమోలో అంటారు. ఈ సారి బిగ్ బాస్ లోగో కూడా మారింది. కన్నులో మొత్తం వజ్రాలు ఉన్నాయి. మిగతా సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ మరింత రసవత్తరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బిగ్ బాస్‌కి సామాన్యులు కూడా వెళ్లాలని కోరుకుంటారు. అలాంటి వారికి ఇదే మంచి అవకాశం. ఈసారి బిగ్ బాస్‌లోకి సామాన్యులు కూడా వెళ్లే విధంగా ప్లాన్ చేసింది. మరి ఈ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఏం చేయాలో పూర్తి స్టోరీ ఇందులో తెలుసుకుందాం.
Bigg Boss entry is open to everyone for season 9.
Try your luck!!#BiggBossTelugu9 pic.twitter.com/BZJXegllk8— TeluguBigg (@TeluguBigg) June 28, 2025
www.bb9.jiostar.com అనే వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత బిగ్ బాస్9 హౌస్‌లోకి ఎందుకు వెళ్లాలని అనుకుంటున్నారో ఒక రీజన్ చెబుతూ వీడియో అప్‌లోడ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మీ రీజన్ సరైనది అనిపిస్తే వారు బిగ్ బాస్ సీజన్ 9లో మీరు కూడా హౌస్ మేట్ అయ్యే అవకాశాన్ని ఇస్తారు. మీరు కూడా ఈ బిగ్ బాస్ షోకి వెళ్లాలని అనుకుంటే వెంటనే మూడు నిమిషాల విడిది ఉన్న వీడియోను కారణంతో అప్‌లోడ్ చేయండి. ఇదిలా ఉండగా ఈ సారి బిగ్ బాస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్, సీరియల్ ఫేమ్ కావ్య, దీపికా, డేబ్జానీ, సోషల్ మీడియా ఇన్ఫ్లూయేన్సర్లు, సినిమా యాక్టర్లు, డ్యాన్సర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కంటెస్టంట్లు ఎవరనే విషయం ఇంకా క్లారిటీ లేదు. ఈసారి బిగ్ బాస్‌కి హోస్ట్ కూడా మారనున్నట్లు వార్తలు వచ్చాయి. నాగార్జున కాకుండా బాలకృష్ణ హోస్టుగా అతని స్థానంలో వ్యవహరిస్తారు. లేకపోతే విజయ్ దేవరకొండ వస్తారని వార్తలు వచ్చాయి. ఎందుకంటే నాగార్జునతో పెట్టుకున్న బాండ్ పూర్తి అయ్యిందని, ఇక రారని టాక్ వినిపించింది. కానీ ఈ సీజన్‌లో కూడా నాగార్జున కనిపించారు. బిగ్ బాస్ మొదటి సీజన్‌కి నాగార్జున, రెండో సీజన్‌కి నాని, మూడో సీజన్ నుంచి ఇప్పటి వరకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే గత సీజన్‌లో నిఖిల్ విన్నర్ అయ్యారు. మధ్యలో రీఎంట్రీ ఇచ్చిన గౌతమ్ కృష్ణ రన్నర్ గా నిలిచాడు. మరి ఈ సీజన్ ఎలా ఉంటుందో? ఎవరు విజయం సాధిస్తారో చూడాలి?
ఇది కూాడా చూడండి: Kamal Haasan : సినిమా కష్టాలు, వివాదాల మధ్య కమల్ హాసన్‌కు ఆస్కార్ గౌరవం!
-
Rishabh Pant: ఫ్రస్టేషన్‌లో రిషబ్ పంత్.. హెల్మెట్‌ను నేలకేసి కొట్టి.. వీడియో వైరల్!
-
Kubera : ఒకచోట హిట్.. ఇంకోచోట ఫ్లాప్.. ‘కుబేర’ కలెక్షన్లపై అంతుచిక్కని మిస్టరీ!
-
Bigg Boss Season 9 Promo: వచ్చేసిన ‘బిగ్ బాస్ 9’ ప్రోమో.. ఆఫీషియల్ వీడియో ఇదిగో!
-
Kubera: 100 కోట్ల క్లబ్‌లోకి కుబేర.. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?
-
Dhanush: చిరంజీవిని చూడగానే ధనుష్ చేసిన పని వైరల్.. ఊహించని ఘటనకు అంతా షాక్
-
Kubera Movie: కుబేర మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో.. చేసి ఉంటే వేరేలా ఉండేదిగా!