Rishabh Pant: ఫ్రస్టేషన్లో రిషబ్ పంత్.. హెల్మెట్‌ను నేలకేసి కొట్టి.. వీడియో వైరల్!

Rishabh Pant: ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో భారత్‌కు ఐదు టెస్టుల సిరీస్‌లో రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ తీవ్రంగా ఆవేశానికి గురయ్యారు. షాట్ భారీగా వెళ్తాది అనుకుంటే.. అది కాస్త తగ్గి రివర్స్ అయి రిషబ్ పంత్ పెవిలియన్ చేరాడు. ఇంగ్లాండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్ వేయగా.. రిషబ్ పంత్ ఔట్ అయ్యాడు. దీంతో ఔట్ అయిన రిషబ్ పంత్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన తర్వాత తన హెల్మెట్‌ను నేలకేసి కొట్టాడు. షాట్ కొట్టాల్సి ఉండగా అది కాస్త రివర్స్ అయి పెవిలియన్ చేరడంతో రిషబ్ పంత్ ఫస్ట్రేషన్‌కు గురయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో హెల్మెట్‌ను కొట్టేసిన ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
Pant holes out to Zak Crawley at long-on!
"Cheerio, cheerio, cheerio" shouts The Hollies 👋
🇮🇳 2️⃣0️⃣8️⃣-4️⃣ pic.twitter.com/qM8ZoX8ZwI
— England Cricket (@englandcricket) July 2, 2025
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రస్తుతం ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో పంత్ వికెట్ పోవడంతో ప్రేక్షకులు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఈ మ్యాచ్‌లో పంత్ దూకుడిగా ఆడాడు. కానీ బషీర్ వేసిన బంతికి ఔట్ అయ్యాడు. భారీ షాట్ ఇద్దామని అనుకునున్నాడు. కానీ బంతి లాంగ్-ఆన్‌లో ఫీల్డర్ జాక్ క్రాలీ చేతిలో పడిపోవడంతో ఇక రిషబ్ పంత్ పెవిలియన్ చేరాడు. రిషబ్ పంత్ ఔటైన తర్వాత తీవ్ర నిరాశకు గురయ్యాడు. దీంతో హెల్మెట్ అలా నేలకేసి కొట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సాధారణంగా రిషబ్ పంత్ కాస్త ఆవేశం ఎక్కువ. ఇలా ఒక్కసారిగా ఔట్ కావడంతో కాస్త నిరాశ చెందాడు. ప్రతీ సారి కూడా ఇలా ఏదో ఒక అవుతుందని హర్ట్ అయినట్లు తెలుస్తోంది.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) July 2, 2025
ఇంగ్లాండ్‌తో మొదటి టెస్టులో రిషబ్ పంత్ అదరగొట్టాడు. సెంచరీలతో చెలరేగిపోయాడు. ఆ మ్యాచ్‌లో సెంచరీ చేసినా కూడా భారత్ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో కీలక సమయంలో పంత్ వికెట్ కోల్పోవడంతో భారత జట్టుతో పాటు ఫ్యాన్స్ కూడా కాస్త నిరాశ చెందుతున్నారు. మరి రిషబ్ పంత్ వికెట్ వల్ల ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. గత మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఒకేసారి రెండు సెంచరీలు చేశాడు. దీనిపై ప్రశంసలు కూడా వచ్చాయి. రిషబ్ పంత్ ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు చేయడం వల్ల భారత జట్టు గెలుస్తుందని భావించారు. కానీ జట్టు గెలవలేదు. మొదటి మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్‌లో అదరగొట్టినా, బౌలింగ్‌లో ఇంగ్లాండ్ బౌలర్లను ఢీకొట్టలేకపోయింది. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏం చేస్తుందో చూడాలి.
ఇది కూడా చూడండి:Pavan kalyan: పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసులు.. పోలీసులు ఎందుకు నమోదు చేశారంటే?
-
Dhruv Jurel: ఇండియాకు ధ్రువ్ జురెల్ ఉంటే గెలుపు ఖాయమా
-
Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ
-
Shikhar Dhawan: భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ.. ధావన్ ఏమన్నాడంటే
-
Mohamed Muizzu Praises India: భారత్ పై మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ప్రశంసలు
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే.. లేకుంటే సిరీస్ ఖేల్ ఖతం
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్