Bigg Boss Season 9 Promo: వచ్చేసిన ‘బిగ్ బాస్ 9’ ప్రోమో.. ఆఫీషియల్ వీడియో ఇదిగో!

Bigg Boss Season 9: బిగ్ బాస్ కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ బిగ్ బాస్‌కి సంబంధించిన ఒక వీడియో ప్రొమోను స్టార్ మా తాజాగా విడుదల చేసింది. ఇప్పటి వరకు తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తి అయ్యాయి. త్వరలోనే తొమ్మిదో సీజన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే స్టార్ మా తొమ్మిదవ సీజన్‌కి సంబంధించి ఒక ప్రోమో వీడియో రిలీజ్ చేశారు. ఇందులో కూడా ఈసారి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ ప్రొమోలో ఆటలో అలుపు వచ్చినంత ఈజీగా గెలుపు రాదు.. ఆ విజయం రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు. కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలని అంటారు.. ఈ సారి బిగ్ బాస్ చదరంగం కాదు పెద్ద రణరంగమే అని నాగార్జున ప్రొమోలో అంటారు. ఈ సారి బిగ్ బాస్ లోగో కూడా మారింది. కన్నులో మొత్తం వజ్రాలు ఉన్నాయి. మిగతా సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ మరింత రసవత్తరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. నాగార్జున ఈసారి మరో కొత్త లుక్‌లో ప్రోమోలో కనిపించారు. ఈ సీజన్ భారీ స్థాయిలో, రసవత్తరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
Read Also:Railway Track Car Driving: తప్ప తాగి రైల్వే ట్రాక్ ఎక్కిన యువతి.. కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు!
బిగ్ బాస్ 9 సీజన్‌లో వచ్చే కంటెస్టట్లు ఎవరనే విషయం ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా సార్లు పేర్లు వచ్చాయి. కానీ ఎవరెవరనే విషయాలు ఇంకా పూర్తిగా స్టార్ మా కూడా వెల్లడించలేదు. ఈ సారి బిగ్ బాస్‌లో బుల్లితెర నటీనటులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారు. కంటెస్టంట్లు ఎవరనే విషయం ఇంకా క్లారిటీ లేదు. ఈసారి బిగ్ బాస్‌కి హోస్ట్ కూడా మారనున్నట్లు వార్తలు వచ్చాయి. నాగార్జున కాకుండా బాలకృష్ణ హోస్టుగా అతని స్థానంలో వ్యవహరిస్తారు. లేకపోతే విజయ్ దేవరకొండ వస్తారని వార్తలు వచ్చాయి. ఎందుకంటే నాగార్జునతో పెట్టుకున్న బాండ్ పూర్తి అయ్యిందని, ఇక రారని టాక్ వినిపించింది. కానీ ఈ సీజన్‌లో కూడా నాగార్జున కనిపించారు. బిగ్ బాస్ మొదటి సీజన్‌కి నాగార్జున, రెండో సీజన్‌కి నాని, మూడో సీజన్ నుంచి ఇప్పటి వరకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే గత సీజన్‌లో నిఖిల్ విన్నర్ అయ్యారు. మధ్యలో రీఎంట్రీ ఇచ్చిన గౌతమ్ కృష్ణ రన్నర్ గా నిలిచాడు. అయితే ప్రతీ సీజన్‌లో కొందరు నటులు, డ్యాన్సర్లు, సింగర్లు ఇలా అందరూ ఉంటారు. మరి ఈ సీజన్‌లో ఎవరెవరు ఉంటున్నారో చూడాలి. ప్రొమో తాజాగా రిలీజ్ కాగా.. వచ్చే నెల పూర్తికి అన్ని వివరాలు కూడా బయటకు వచ్చేస్తాయని టాక్ వినిపిస్తోంది. మరి ఈ సీజన్ ఎలా ఉంటుంది? కంటెస్టెంట్లు ఎలా ఉంటారో? చూడాలి.
-
Toll Charges For Bikes: బైక్‌లకు టోల్ ట్యాక్స్.. కేంద్రం ఏం చెప్పిందంటే?
-
Kubera: 100 కోట్ల క్లబ్‌లోకి కుబేర.. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?
-
Dhanush: చిరంజీవిని చూడగానే ధనుష్ చేసిన పని వైరల్.. ఊహించని ఘటనకు అంతా షాక్
-
Kubera Movie: కుబేర మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో.. చేసి ఉంటే వేరేలా ఉండేదిగా!
-
Kubera Full movie review: కుబేర ఫుల్ మూవీ రివ్యూ
-
Rashmika : రష్మిక పై ప్రశంసల వర్షం కురిపించిన నాగార్జున, సల్మాన్, శేఖర్ కమ్ముల.. ఎందుకంటే ?