Kubera Movie: కుబేర మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో.. చేసి ఉంటే వేరేలా ఉండేదిగా!

Kubera Movie: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ , నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘ కుబేర’ జూన్ 20వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. శేఖర్ కమ్ముల స్టోరీ, స్క్రీన్ ప్లే, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ యాక్టింగ్ అయితే అదిరిపోయాయి. నాగార్జున, రష్మిక కూడా వారి యాక్టింగ్‌తో పిచ్చేక్కించేశారు. తమిళం, హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ కొత్త స్టోరీతో వచ్చింది. బిచ్చగాడి పాత్రలో ధనుష్ అయితే సూపర్‌గా యాక్టింగ్ చేశాడు. ధనుష్ కెరీర్‌లో ఈ సినిమా ఒక ఎత్తు. సినిమాను డైరెక్టర్ బాగా తీయడంతో పాటు ధనుష్ అయితే బాగా యాక్ట్ చేశాడని అందరూ మెచ్చుకున్నారు. ధనవంతుడిని బిచ్చగాడికి మధ్య జరిగేదే ఈ సినిమా స్టోరీ. ధనుష్ హిట్ లిస్ట్‌లో మరో బెస్ట్ సినిమా చేరింది. అయితే ఇంత హిట్ సాధించిన కుబేర సినిమా ధనుష్ చేయాల్సింది కాదట. వేరే స్టార్ హీరోకు డైరెక్టర్ స్టోరీ వినిపించగా.. రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఎందుకు కుబేర సినిమాను రిజక్ట్ చేశాడో ఈ స్టోరీలో చూద్దాం.
కుబేరలో ధనుష్ పాత్రను ముందుగా టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండను తీసుకోవాలని అనుకున్నారట. విజయ్‌కి శేఖర్ కమ్మల స్టోరీ చెప్పారు. కానీ బిచ్చగాడి పాత్రలో నటించడం తనకి రాదని అందుకే రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి పాత్రలు తనకి అసలు సెట్ కావని విజయ్ తిరస్కరించినట్లు సమాచారం. అయితే ఈ సినిమా విజయ్ చేసి ఉంటే తన కెరీర్‌కు ప్లస్ అయి ఉండేది. ఎందుకంటే కుబేర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సినిమా స్టోరీతో పాటు ఇందులో నటన అన్ని కూడా బాగున్నాయి. అసలు విజయ్‌కు కొన్నేళ్ల నుంచి హిట్ లేదు. ఈ సినిమా చేసి ఉంటే తన ఖాతాలో ఒక మంచి హిట్ పడేది. కుబేర మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్ సాధించడంతో పాటు కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది. నాగార్జునకు మంచి హిట్ ఇచ్చింది. వరుస హిట్‌లు సాధిస్తున్న రష్మికా కు ఈ సినిమా ప్లస్ అయ్యిందనే చెప్పవచ్చు. కుబేర్ స్టోరీ కొత్తగా ఉందని, శేఖర్ కమ్ముల స్టోరీని బాగా రాశారని అంటున్నారు. ఫస్టాప్ అసలు ఎక్కడ కూడా బోర్ కొట్టదని చెబుతున్నారు. సెకాండాఫ్‌లో కొన్ని చోట్ల కాస్త లాగ్ సీన్లు ఉన్నాయని అంటున్నారు. అయితే సినిమా జోనర్ అంతా కూడా కొత్తగా, డిఫరెంట్‌గా ఉందని ట్విట్టర్‌లో పోస్టులు చేస్తున్నారు. మొత్తం మీద కుబేర సినిమా అదిరిపోయింది. ఈ సినిమాకు పక్కాగా ధనుష్‌కు అవార్డు వస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also read : International Yoga day: డైలీ 20 నిమిషాలు యోగా చేస్తే.. మీ లైఫ్‌కి మీరే రాజు ఇక!
-
Rashmika : స్టార్ హీరోల లక్కీ హీరోయిన్ రష్మిక.. అల్లు అర్జున్‌తో నాలుగోసారి!
-
Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
-
Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు
-
Rashmika : మరో వివాదంలో చిక్కుకున్న రష్మిక మందన్నా.. ఇంతకీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో ?
-
Kubera : ఒకచోట హిట్.. ఇంకోచోట ఫ్లాప్.. ‘కుబేర’ కలెక్షన్లపై అంతుచిక్కని మిస్టరీ!
-
Rashmika : ‘మైసా’ పోస్టర్‌తో బయటపడిన విజయ్, రష్మిక బంధం