Kubera : ఒకచోట హిట్.. ఇంకోచోట ఫ్లాప్.. ‘కుబేర’ కలెక్షన్లపై అంతుచిక్కని మిస్టరీ!

Kubera : ప్రస్తుతం సినీ వర్గాల్లో ఒకటే చర్చ నడుస్తోంది. అదే ‘కుబేర’ సినిమా గురించి. ఈ మధ్యే రిలీజ్ అయిన ఈ సినిమాలో హీరో ధనుష్ నటించారు. శేఖర్ కమ్ముల దీన్ని డైరెక్ట్ చేశారు. సినిమాకు కలెక్షన్లు బాగానే వస్తున్నాయ్. కానీ, ఒక రాష్ట్రంలో సినిమా హిట్టయితే.. ఇంకో రాష్ట్రంలో ఫ్లాప్ అయ్యిందట. ఇది ధనుష్ అభిమానులకు కూడా పెద్ద షాక్ ఇచ్చింది.
‘కుబేర’ సినిమా తెలుగు టెక్నీషియన్స్, చాలా భాషల నుంచి ప్రముఖ నటీనటులు కలిసి తీసిన సినిమా కుబేర. ఇందులో తమిళ నటుడు ధనుష్, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటించారు. ఈ సినిమాపై ఫ్యాన్స్‌కు భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను సినిమా నిలబెట్టుకుంది అనే చెప్పాలి. సినిమా భారతదేశంలో రూ.100 కోట్లు కలెక్షన్లకు దగ్గర్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అయితే ఇప్పటికే 100కోట్ల మార్క్ దాటింది.
Read Also:Mirror: ఇంట్లో ఇక్కడ అద్దం పెడితే.. ఇళ్లంతా డబ్బు మయం
‘కుబేర’ సినిమా శనివారం రూ.4.2 కోట్లు, ఆదివారం రూ.4.50 కోట్లు వసూలు చేసింది. దీంతో సినిమా మొత్తం వసూళ్లు రూ.80 కోట్లకు చేరుకున్నాయి. మొదటి వారంలో ఈ సినిమా రూ.69 కోట్లు వసూలు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే ఏకంగా రూ.48 కోట్లు వచ్చాయి. తమిళనాడు నుంచి రూ.18 కోట్లు వచ్చాయి.
కానీ, రెండో వారం నుంచే తమిళనాడులో కలెక్షన్లు అమాంతం తగ్గిపోయాయి. రెండో వారంలో శుక్రవారం కేవలం రూ.30 లక్షలు, శనివారం రూ.63 లక్షలు ఆదివారం కూడా ఇదే స్థాయిలో వసూలు చేసింది. దీంతో తమిళనాడులో సినిమా వసూళ్లు పూర్తిగా తగ్గిపోయి, అట్టడుగు స్థాయికి చేరాయి. సాధారణంగా ఒక సినిమాలో హీరో సొంతరాష్ట్రంలో అదిరిపోయే హిట్టు కొడుతుంటాడు. ఆ తరువాత ఇతర రాష్ట్రాల్లో కూడా అదే ఉత్సాహంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తుంటుంది. కానీ, ‘కుబేర’ విషయంలో ఇది పూర్తిగా రివర్స్ అయ్యింది. ధనుష్ సొంత రాష్ట్రంలోనే సినిమాకు తక్కువ వసూళ్లు రావడం అభిమానులకు చాలా బాధ కలిగించింది. ఇది నిజంగా సినీ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరిచే విషయం.
Read Also:Vishvambhara : చిరంజీవి అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ‘విశ్వంభర’ సినిమా మళ్లీ వాయిదా
-
Rashmika : ‘మైసా’ పోస్టర్‌తో బయటపడిన విజయ్, రష్మిక బంధం
-
Bigg Boss Season 9: బిగ్ బాస్‌లోకి వెళ్లాలని అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి
-
Kubera Movie : ‘కుబేర’కు రూ.100 కోట్లు వచ్చినా, ధనుష్‌కు షాకే!
-
Rashmika Mandanna: భయపెట్టిన నేషనల్ క్రష్ రష్మిక.. ఫ్యాన్స్ నెవర్ బిఫోర్ లుక్‌లో కొత్త ప్రాజెక్ట్!
-
Bigg Boss Season 9 Promo: వచ్చేసిన ‘బిగ్ బాస్ 9’ ప్రోమో.. ఆఫీషియల్ వీడియో ఇదిగో!
-
Kubera: 100 కోట్ల క్లబ్‌లోకి కుబేర.. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?