Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Business News »
  • Toll Charges For Bikes Fake News

Toll Charges For Bikes: బైక్‌లకు టోల్‌ ట్యాక్స్‌.. కేంద్రం ఏం చెప్పిందంటే?

Toll Charges For Bikes: బైక్‌లకు టోల్‌ ట్యాక్స్‌.. కేంద్రం ఏం చెప్పిందంటే?
  • Edited By: kusuma,
  • Updated on June 26, 2025 / 04:58 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Toll Charges For Bikes: దేశంలో ఇప్పటి వరకు వాహనాలకు టోల్ ట్యాక్స్ ఉంది. కానీ టూ వీలర్స్‌కు మాత్రం టోల్ ఫీజు లేదు. అయితే జులై 15వ తేదీ నుంచి టీ వీలర్స్‌కు కూడా టోల్ ట్యాక్స్ ఉంటుందని తాజాగా వార్తలు వచ్చాయి. వీటితో పాటు ఆటోలకు కూడా నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా టోల్ ట్యాక్స్‌లు కట్టాలని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇవన్నీ ఫేక్ వార్తలు అని, టూ వీలర్స్‌కు ఎలాంటి టోల్ ట్యాక్స్ విధించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే అన్ని ఫేక్ వార్తలను నమ్మవద్దంటూ తెలిపింది. ఇలాంటి ఫేక్ వార్తలను పోస్ట్ చేసే వారిపై మండిపడింది. జాతీయ రహదారులపై ఫోర్‌ వీలర్స్‌, ఇతర పెద్ద వాహనాలకు మాత్రమే టోల్‌ ఫీజు ఉంటుందని, మిగతా వాటికి టోల్ ఫీజు ఉండదని స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్ వార్తలను వైరల్ చేస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.

టూ వీలర్స్‌కు టోల్ ఛార్జీలు ఉంటాయని ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అన్ని మీడియా ఛానెల్స్‌లో రావడంతో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వీటిపై తీవ్రంగా ఖండిచారు. ఇలా ఫేక్ వార్తలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని అన్నారు. ఇప్పుడు లేదు.. భవిష్యత్‌లో కూడా టూ వీలర్స్‌కు టోల్‌ ట్యాక్స్‌ విధించే అవకాశం లేదని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ద్విక్ర వాహనాలపై టోల్ పన్ను విధించడం గురించి అసలు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోదన్నారు. ఇలాంటి ఫేక్ వార్తలను ప్రచారం చేస్తే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారని, ఇలా చేయవద్దని కోరారు. ఫేక్ వార్తలతో ప్రజలను తప్పు దారి పట్టించే అవకాశం చేయవద్దన్నారు. ప్రస్తుతం, జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల నుండి ద్విచక్ర వాహనాలకు మినహాయింపు ఉందని ఇది మారదని తెలిపారు.

ఇదిలా ఉండగా ఆగస్టు 15 నుంచి వార్షిక టోల్ పాస్‌ అమలు అవుతుంది. ఈ పాస్ ద్వారా 200 ట్రిప్పుల వరకు మాత్రమే మినహాయింపు అందుబాటులో ఉంటుంది. కొందరు హైవే గుండా రోజూ వెళ్లి నాలుగు నెలల్లో 200 ట్రిప్పులు పూర్తి చేస్తారు. ఇలాంటి వారు మళ్లీ వార్షిక టోల్ పాస్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఒక సంవత్సరంలో మూడు సార్లు తీసుకోవచ్చు. అయితే వార్షిక టోల్ పాస్‌పై ఎలాంటి పరిమితి లేదు. ఒక డ్రైవర్ తనకు కావలసినన్ని వార్షిక టోల్ పాస్‌‌లు తీసుకోవచ్చు. ఒక డ్రైవర్ వార్షిక టోల్ పాస్‌‌లు తీసుకొని 200 ట్రిప్పులు పూర్తి చేయకపోతే మళ్లీ ఆ డబ్బులు తిరిగి ఇవ్వరు.

Read Also:Plant Based Milk: మొక్కల ఆధారిత పాలతో ఆరోగ్యానికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

Tag

  • Central Government
  • Fake news
  • latest update
  • Nation Highway
  • Toll Charges For Bikes
Related News
  • Covid vaccine: కరోనా వ్యాక్సిన్‌తో గుండె పోటు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

  • Bigg Boss Season 9 Promo: వచ్చేసిన ‘బిగ్ బాస్ 9’ ప్రోమో.. ఆఫీషియల్ వీడియో ఇదిగో!

  • Former Pakistan captain Shahid Afridi: పాక్ మాజీ కెప్టెన్ షాహిది అఫ్రిది మృతి.. ఇందులో నిజమెంత?

  • Mobile Settings: ఈ సెట్టింగ్స్ మారిస్తే.. పోయిన ఫోన్ మళ్లీ దొరకాల్సిందే

  • IPL: కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై ఐపీఎల్‌లో ఆ యాడ్స్ బ్యాన్

  • Petrol: లీటర్ పెట్రోల్, డీజిల్ ధర రూ.50లకే.. కేంద్రం కీలక నిర్ణయం

Latest Photo Gallery
  • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us