Former Pakistan captain Shahid Afridi: పాక్ మాజీ కెప్టెన్ షాహిది అఫ్రిది మృతి.. ఇందులో నిజమెంత?

Former Pakistan captain Shahid Afridi: సోషల్ మీడియాలో ఎన్నో ఫేక్ వార్తలు వస్తుంటాయి. అయితే తాజాగా పాకిస్థాన్ దిగ్గజ క్రికెట్ ఆటగాడు, మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది చనిపోయాడని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లెజండరీ ప్లేయర్ కన్నుమూశాడని అంత్యక్రియలు కూడా పూర్తి అయ్యాయని ఓ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఈ వార్త అబద్ధమని ఇందులో ఎలాంటి నిజం లేదని ప్రస్తుతం షాహిద్ అఫ్రిది పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. షాహిద్ అఫ్రిది చనిపోయాడనే కరాచీలో జరిగాయని వార్త వచ్చింది. విజన్ గ్రూప్ చైర్మన్ ఇంకా పలువురు ప్రముఖులు అఫ్రిది మరణానికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. దీంతో అందరూ కూడా ఇది నిజమని నమ్మేశారు. అయితే ఇది ఒక ఫేక్ వార్త. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో పూర్తిగా నకిలీ అని తేలింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి తయారు చేసిన వీడియో. AI సహాయంతో అఫ్రిది చనిపోయినట్లుగా, అంత్యక్రియలు జరిగినట్లుగా తప్పుడు దృశ్యాలను, ఆడియోను సృష్టించారు. షాహిద్ అఫ్రిది ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ప్రాణాలతోనే ఉన్నాడు.
ఇటీవలి కాలంలో షాహిద్ అఫ్రిది ‘ఆపరేషన్ సింధూర్’ పై చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో అఫ్రిదితో పాటు షోయబ్ అక్తర్ వంటి ఇతర పాకిస్థాన్ ఆటగాళ్ల సోషల్ మీడియా అకౌంట్లను భారతదేశంలో నిషేధించారు. ఈ నిషేధం తర్వాత ఈ మరణవార్త వైరల్ అయ్యింది. షాహిద్ అఫ్రిదికి ‘బూమ్ బూమ్ అఫ్రిది’ అని పేరుంది. అతని దూకుడైన ఆటతీరుకు, భారీ సిక్సర్లకు ఈ పేరు వచ్చింది. ఇప్పటికీ వన్డే క్రికెట్లో అత్యధిక సిక్సర్ల రికార్డు షాహిద్ అఫ్రిది పేరు మీదే ఉంది. అతను తన కెరీర్లో మొత్తం 351 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ ఇప్పటివరకు 344 సిక్సర్లు బాదాడు. అఫ్రిది రికార్డును రోహిత్ శర్మ బ్రేక్ చేసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే క్రికెట్ మైదానంలోనే కాకుండా, మైదానం వెలుపల కూడా షాహిద్ అఫ్రిది తరచుగా వార్తల్లో ఉంటాడు. అవకాశం దొరికితే చాలు భారతదేశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే పాకిస్థాన్ ఆటగాళ్లలో షాహిద్ అఫ్రిది కూడా ఒకడు. అతని వ్యాఖ్యలు అప్పుడప్పుడు విమర్శలకు దారి తీస్తూ ఉంటాయి. 45 ఏళ్ల షాహిద్ అఫ్రిది 2017లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. దాదాపు 20 సంవత్సరాల పాటు సాగిన తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో అఫ్రిది మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) కలిపి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
Read Also:World Brain Tumor Day : ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్‌ను ఎలా గుర్తించాలి? – నిపుణుల సలహాలు!
-
Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ
-
Shikhar Dhawan: భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ.. ధావన్ ఏమన్నాడంటే
-
Masood Azhar: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో మసూద్
-
Hair cutting price: ప్రపంచంలోనే హెయిర్ కట్ కి అత్యధికంగా ఛార్జ్ చేస్తున్న దేశాలేవో తెలుసా?
-
Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Fake Wedding trend: తినంత తిండి.. తాగేంత మందు.. ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్. తో ఎంజాయ్ చేయండి