Petrol: లీటర్ పెట్రోల్, డీజిల్ ధర రూ.50లకే.. కేంద్రం కీలక నిర్ణయం

Petrol: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉన్న సమయంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST) అమలులోకి వచ్చింది. ఇంతకు ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్స్ వేర్వేరుగా ఉండేవి. ఆ తర్వాత జీఎస్టీని తీసుకొచ్చిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్స్‌లు వేర్వేరుగా మారిపోయి.. ఒకే ట్యాక్స్ అమల్లోకి వచ్చింది. అయితే మిగతా అన్నింటికి కూడా ఒకే ట్యాక్స్ ప్రస్తు్తం దేశంలో ఉంది. పెట్రోల్, డీజిల్‌ను కూడా ఈ జీఎస్టీ పరిధిలోకే తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. ఇటీవల ముంబైలో పారిశ్రామికవేత్తలతో ఇంటరాక్షన్ సెషన్ జరిగింది. ఇందులో పాల్గొన్న నిర్మలా సీతారామన్ కొన్ని విషయాలపై చర్చించారు. కొందరు రిపోటర్లు సీతారామన్‌ను కొన్ని ప్రశ్నలు వేశారు. పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కొందరు రిపోర్టర్లు అడిగారు. దీంతో ఆమె పెట్రోల్, డిజీల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాడానికి కేంద్రానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపింది. ఇప్పటికే మేం ఈ విషయంపై చర్చించామని, రాష్ట్ర ప్రభుత్వాలే ఈ నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. అన్ని రాష్ట్రాలు కూడా వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి ఒకే చేస్తే త్వరలోనే అమలులోకి తెస్తామని తెలిపారు.
ఈ విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కూడా స్పందించారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం అనేది జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు చాలా నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నామని తెలిపారు. అయితే ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్‌పై వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ వంటి పన్నులు అమలులో ఉన్నాయి. ఈ కారణాల వల్లే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు వేర్వేరుగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కేంద్ర బడ్జెట్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్లో ఎన్నో కొత్త పథకాలు తీసుకొచ్చారు. ముఖ్యంగా వేతన విషయంలో ట్యాక్స్‌ను తగ్గించారు. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.12 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీని వల్ల తక్కువ జీతం ఉద్యోగస్తులకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ట్యాక్స్ వల్ల చాలా మంది సగం డబ్బులు కడుతున్నారు. అదే ట్యాక్స్ లేకపోతే మధ్య తరగతి వారికి కొంత సేవ్ అయినట్లే. ఈ సారి బడ్జెట్లో మధ్య తరగతి వారికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.