Maha Shivaratri: ఈ నియమాలు పాటిస్తూ ఉపవాసం ఆచరిస్తే.. పుణ్యమంతా మీదే

Maha Shivaratri:
హిందూ శాస్త్రంలో మహా శివరాత్రికి ఓ ప్రత్యేకత ఉంది. శివుడిని ఆరాధించే ప్రతీ ఒక్కరూ కూడా మహా శివరాత్రి పండుగను తప్పకుండా జరుపుకుంటారు. శివుడిని భక్తితో పూజించి సరైన నియమాలు పాటిస్తూ ఉపవాసం ఆచరిస్తే తప్పకుండా కోరిన కోరికలు అన్ని నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే ప్రతీ పండగ నాడు కాకుండా కొన్ని ప్రత్యేకమైన పండుగలకు తప్పకుండా ఉపవాసం ఆచరిస్తారు. అలాంటి వాటిలో మహా శివరాత్రి కూడా ఒకటి. అయితే కొందరికి ఉపవాసం ఎలా ఆచరించాలో కూడా సరిగ్గా తెలియదు. దీంతో కొన్ని సమస్యలను ఎదుర్కొ్ంటారు. మహా శివరాత్రి నాడు కొన్ని నియమాలను పాటిస్తూ ఉపవాసం ఆచరిస్తేనే పుణ్యం లభిస్తుంది. అయితే మహా శివరాత్రి నాడు ఎలా ఉపవాసం ఆచరించాలి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మహా శివరాత్రి నాడు కొందరు పూర్తిగా వాటర్ తీసుకోకుండా ఉపవాసం ఆచరిస్తారు. అయితే మీ ఆరోగ్య పరిస్థితి బట్టి మీరు ఉపవాసం ఆచరించవచ్చు. వాటర్ తాగకుండా కూడా ఉండగలరు అనుకుంటే అలాగే ఉపవాసం ఉండండి. ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే మీరు పండ్లు, జ్యూస్‌లు వంటివి తీసుకుని కూడా ఉపవాసం ఆచరించవచ్చు. అయితే కొందరు ఒక్క పూట భోజనం చేసి ఉపవాసం ఆచరిస్తారు. ఈ ఒక్క పూట భోజనంలో కూడా ఉల్లిపాయలు, వెల్లులి, మాంసాహారం వంటివి తీసుకోకూడదు. మధ్యాహ్నం భోజనం చేసి ఉపవాసం ఆచరించాలి. అయితే కొందరు అనారోగ్య సమస్యల వల్ల తినేస్తారు. తెలియక కొన్ని పదార్థాలు తినడం వల్ల మీరు ఉపవాసం ఉన్నా కూడా ఎలాంటి ప్రతిఫలం ఉండదు. ఉపవాసం సమయంలో బియ్యం, గోధుమలు, తృణ ధాన్యాలు వంటివి తీసుకోకూడదు. అలాగే ఉప్పు కూడా ఉపవాసం సమయంలో తీసుకుంటే చేసిన దానికి ప్రతిఫలం ఉండదు.
శివరాత్రి ఉపవాసం సమయంలో పూరీలు, పిండి కుడుములు, పాల ఉత్పత్తులు వంటివి కూడా తీసుకోవచ్చు. ఉపవాసం అనేది మన మనస్సులో ఉండాలి. ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా భక్తితో శివుడిని పూజించాలి. తినకుండా ఉపవాసం ఆచరిస్తే దేవుడు కోరికలు నెరవేరుస్తాడనేది నిజం కాదు. భక్తితో ఎలాంటి కల్మషం లేకపోతేనే దేవుడు కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా నియమాలు పాటిస్తూ శివుడిని భక్తితో ఉపవాసం ఆచరిస్తే తప్పకుండా ప్రతిఫలం లభిస్తుంది. ఎలాంటి కోరికలు అయినా కూడా నెరవేరతాయి. ఉపవాసంతో పాటు భక్తితో శివుడికి అభిషేకం చేసి పూజలు నిర్వహించాలి. అప్పుడే కష్టాలు, బాధలు అన్ని కూడా తొలగిపోతాయి. ఎలాంటి కోరికలు అయినా కూడా నెరవేరతాయి.
-
Stress Relief: ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే.. ఈ టైప్ ధ్యానం తప్పనిసరి
-
Tholi Ekadasi: తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
-
Home loan refinancing: గృహ రుణ రీఫైనాన్సింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలేంటి?
-
Rain water: వర్షపు నీటితో స్నానం చేస్తే.. ఇన్ని ప్రయోజనాలా!
-
International Yoga day: డైలీ 20 నిమిషాలు యోగా చేస్తే.. మీ లైఫ్‌కి మీరే రాజు ఇక!
-
Fastag: ఫాస్టాగ్ యాన్యువల్ పాస్.. ఏడాదిలో ఎన్నిసార్లు తీసుకోవచ్చంటే?