Fastag: ఫాస్టాగ్ యాన్యువల్ పాస్.. ఏడాదిలో ఎన్నిసార్లు తీసుకోవచ్చంటే?

Fastag: రోడ్డు ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి ఫాస్టాగ్ గురించి తెలిసే ఉంటుంది. ఎందుకంటే టోల్‌గేట్‌ల దగ్గర డబ్బులు కట్టాలి. ప్రతీ సారి డబ్బులు తీసి కట్టడం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని ఫాస్టా్గ్‌ను తీసుకొచ్చారు. అయితే ఫాస్టా్గ్ విషయంలో ఇప్పుడు మరో కొత్త రూల్ తీసుకొచ్చారు. ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. వార్షిక టోల్ పాస్ తీసుకుంటే ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదారులపై ప్రయాణించడం ఈజీ అవుతుంది. అలాగే బాగా ఉపయోగపడే విధంగా ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే దీనివల్ల సమయం, డబ్బు రెండు కూడా ఆదా అవుతాయి. అయితే కొత్త వ్యవస్థ ఆగస్టు 15 నుంచి ప్రారంభమవుతుంది. దీనికి నోటిఫికేషన్‌ను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. అయితే ఈ వార్షిక టోల్ పాస్‌తో 200 ట్రిప్పుల వరకు మాత్రమే మినహాయింపు అందుబాటులో ఉంటుంది. ఇదంతా ఒకే.. కానీ కొందరికి ఒక సందేహం వచ్చింది. డ్రైవర్ 210వ ట్రిప్ చేస్తే అతను టోల్ చెల్లించాల్సి ఉంటుందా? లేకపోతే ఏం చేయాలనే విషయం తెలియదు. యాన్యువల్ టోల్ పాస్ ధర నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం రూ.3,000 మాత్రమే. అయితే ఇది ఒక సంవత్సరం వరకు ఉంటుంది. 200 ట్రిప్పుల పరిమితితో మాత్రమే ఉంటుంది. ఈ పథకం NHAI నిర్వహించే జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలో వర్తిస్తుంది.
NHAI ప్రకారం ఈ పాస్ ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్పులకు చెల్లుతుంది. కొందరు హైవే గుండా రోజూ వెళ్లి నాలుగు నెలల్లో 200 ట్రిప్పులు పూర్తి చేస్తారు. ఇలాంటి వారు మళ్లీ వార్షిక టోల్ పాస్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఒక సంవత్సరంలో మూడు సార్లు తీసుకోవచ్చు. అయితే వార్షిక టోల్ పాస్‌పై ఎలాంటి పరిమితి లేదు. ఒక డ్రైవర్ తనకు కావలసినన్ని వార్షిక టోల్ పాస్‌లు తీసుకోవచ్చు. అలాగే ఒక డ్రైవర్ వార్షిక టోల్ పాస్‌లు తీసుకొని నేషనల్ హైవే లేదా ఎక్స్‌ప్రెస్‌వేపై తక్కువ ప్రయాణించి 200 ట్రిప్పులు పూర్తి చేయకపోతే మళ్లీ ఆ డబ్బులు తిరిగి ఇవ్వరు. మిగిలిన మొత్తం డబ్బు లాప్స్ అవుతుంది. కాబట్టి మీరు 200 ట్రిప్‌లు కంటే ఎక్కువ తిరుగుతారని అనిపిస్తే తీసుకోండి. లేకపోతే తీసుకోవద్దు. ఎందుకంటే మీరు తీసుకున్న డబ్బులు వేస్ట్ అవుతాయి. ప్రయాణాలు ఎక్కువగా ఎవరు అయితే చేస్తారో వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. కొందరు ఎక్కువగా నేషనల్ హైవేపై తిరుగుతుంటారు. అలాంటి వారికి ఈ వార్షి్క టోల్ పాస్ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు తీసుకునే ముందు కాస్త ఆలోచించండి.
ఇది కూడా చూడండి: Google pixle 10 series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్.. డిజైన్, ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే భయ్య
-
FASTag : ఫాస్టాగ్ కొత్త యాన్యువల్ పాస్.. రూ.3000కడితే ఏడాదంతా హైవేల్లో తిరగొచ్చు
-
DSC: డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షకు వెళ్లే ముందు వీటిని మరిచిపోవద్దు
-
FASTag: ఫాస్టాగ్ న్యూ రూల్.. మే 1వ తేదీ జీపీఎస్ విధానం
-
Ramadan: పవిత్రమైన రంజాన్ ఉపవాసం.. ఈ సమయంలో పాటించాల్సిన నియమాలివే
-
Maha Shivaratri: ఈ నియమాలు పాటిస్తూ ఉపవాసం ఆచరిస్తే.. పుణ్యమంతా మీదే
-
Fastag: నేటి నుంచే ఫాస్టాగ్ కొత్త రూల్స్ అమలు.. మారిన ఈ న్యూ రూల్స్ ఏంటంటే?