FASTag : ఫాస్టాగ్ కొత్త యాన్యువల్ పాస్.. రూ.3000కడితే ఏడాదంతా హైవేల్లో తిరగొచ్చు

FASTag : సాధారణంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు టోల్ గేట్లు వస్తుంటాయి. వాటి దగ్గర డబ్బులు కడితేనే దాటడానికి వీలవుతుంది. దీంతో టోల్ గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్స్ అవుతుంటాయి. వీటిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఎక్కువగా నేషనల్ హైవేల మీద ప్రయాణించే వాళ్లందరికీ ఓ శుభవార్తను అందించింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా వాహనదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రైవేటు వాహనదారుల కోసం కొత్తగా యాన్యువల్ పాస్ ఒకటి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఇది ప్రస్తుతం మనం వాడే ఫాస్టాగ్ సిస్టమ్ మీదే పనిచేస్తుంది. వచ్చే ఏడాది 2025 ఆగస్టు 15 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. దీని వల్ల ఏడాదికి కేవలం రూ.3,000 ఖర్చు పెట్టి, హైవేలపై హాయిగా, తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయొచ్చు. అయితే, ఈ పాస్ ద్వారా ఏడాదిలో గరిష్టంగా 200 సార్లు మాత్రమే టోల్ దాటడానికి పర్మీషన్ ఉంటుంది.
ఈ యాన్యువల్ పాస్ ఏడాది కాక ముందే పూర్తి అయిపోయేందుకు అవకాశం ఉంది. దీన్ని మీరు ఒక సంవత్సరం పాటు లేదా 200 ట్రిప్పుల వరకు వాడుకోవచ్చు. ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే, అప్పుడే మీ పాస్ గడువు ముగిసిపోతుంది. ఉదాహరణకు, ఆరు నెలల్లోనే 200 సార్లు టోల్‌ను దాటేస్తే అప్పుడే మీ పాస్ అయిపోయినట్లు. ఆ తర్వాత మళ్ళీ కొత్త పాస్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ కొత్త యాన్యువల్ పాస్ వెనుక ఉద్దేశం 60 కిలోమీటర్ల దూరం లోపు ఉన్న టోల్ ప్లాజాల వల్ల ప్రయాణికులకు వస్తున్న సమస్యలను పరిష్కరించడమేనని మంత్రి స్పష్టం చేశారు.
Read Also:Dusharla Satyanarayana: ప్రకృతి మీద ప్రేమతో.. 70 ఎకరాలను అడవిగా సృష్టించిన వ్యక్తి ఎవరో తెలుసా?
ఈ కొత్త సౌకర్యం కేవలం కార్, వ్యాన్, జీప్ లాంటి ప్రైవేటు వాహనాలకు మాత్రమే. బిజినెస్ కోసం వాడే వాహనాలకు ఇది వర్తించదు. ఈ పాస్ తీసుకురావడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. టోల్ చెల్లింపులు ఇంకా సులభం చేయడం, అలాగే పదే పదే ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకునే అవసరాన్ని తగ్గించడం. ఈ పాస్ వల్ల వాహనదారులకు డబ్బు ఆదా అవుతుంది. అంతేకాదు సమయం కూడా కలిసి వస్తుంది. ఎందుకంటే టోల్ ప్లాజాల దగ్గర పెద్ద పెద్ద క్యూలు తగ్గుతాయి. ఈ యాన్యువల్ పాస్ దేశంలోని అన్ని నేషనల్ హైవేల పైనా చెల్లుబాటు అవుతుంది.
ఈ పాస్‌ను తీసుకోవడం చాలా ఈజీ. దీన్ని రాజ్మార్గ యాత్ర యాప్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వెబ్సైట్, ఇంకా రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) అధికారిక వెబ్సైట్ ద్వారా తీసుకోవచ్చు. ఈ పథకం వల్ల ఎక్కువగా ఉద్యోగం, బిజినెస్ లేదా వేరే వ్యక్తిగత కారణాలతో రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వాళ్లకు లాభదాయకంగా ఉంటుంది. ప్రస్తుతం, ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకుంటూ టోల్‌ల కోసం వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. ఈ వార్షిక పాస్‌తో కేవలం రూ.3,000 ఖర్చుతో ఒక ఏడాది పాటు ప్రయాణం చేయడం వల్ల డబ్బులు ఆదా అవుతాయి.
Read Also:Garikapati Narasimha Rao: బాధలో ఉన్నప్పుడు బలం ఇచ్చేది ఏమిటి?