Dusharla Satyanarayana: ప్రకృతి మీద ప్రేమతో.. 70 ఎకరాలను అడవిగా సృష్టించిన వ్యక్తి ఎవరో తెలుసా?

Dusharla Satyanarayana: ఎకరాలు ఉంటే ఎవరైనా ఏదైనా పరిశ్రమ స్థాపించడం వంటివి చేస్తుంటారు. కానీ తనకు వారసత్వంగా వచ్చిన 70 ఎకరాల వ్యవసాయ భూమిలో అడవిని సృష్టించిన ఓ మహోన్నత వ్యక్తి కోసం అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి. తెలంగాణకి చెందిన ఓ వ్యక్తి తనకి ఉన్న 70 ఎకరాల ఆస్తిలో వివిధ రకాల పక్షులు, మొక్కలు పెంచి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? 70 ఎకరాలతో ఏం చేశాడు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవపురానికి చెందిన దుశ్చర్ల సత్యనారాయణ తనకు ఉన్న ఆస్తిని అడవిగా సృష్టించాడు. ఎనిమిదేళ్ల వయస్సు నుంచే ఇతనికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. అయితే బ్యాంక్‌లో పనిచేసిన దుశ్చర్ల సత్యనారాయణ పచ్చని ప్రకృతి మీద ఉన్న ఇష్టంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్యపై ఉద్యమించాడు. జల సాధన పేరుతో తనకి వారసత్వంగా వచ్చిన 70 ఎకరాల భూమిని ఆరు దశాబ్దాల పాటు కష్టపడి అడవిని సృష్టించాడు. ఎన్నో మూగ జీవాలకు ఒక దారి చూపించాడు. వాటికి ఆహారం, నీళ్లు అందించే విధంగా తన 70 ఎకరాలను ఒక అడవిగా మార్చాడు. మొత్తం ఐదు ఎకరాల్లో పక్షులు, జంతువులు ఉపయోగపడే విధంగా పంటలను సాగు చేస్తున్నాడు. భూగర్భ జలాలను పెంచడంతో పాటు జంతువులు, పక్షులకు తాగు నీటిని ఏర్పారిచారు. 7 ప్రాంతాల్లో కుంటలు తవ్వించారు. కొన్ని చోట్ల బోర్లు వేయించారు. అడవిల్లో మాదిరిగా ఉండే పలు రకాల పక్షులు, జంతువులకు ఆవాసంగా ఈ అడవిని మార్చి జీవ వైవిధ్యానికి జీవం పోస్తూ పర్యావరణ వేత్తగా అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
ప్రకృతి మీద ఇష్టంతో 70 ఎకరాల్లో అడవిని సృష్టించిన అతనికి ఎన్నో అవార్డులు వచ్చాయి. ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్‌లో దుశర్ల సత్యనారాయణపై “ఇండియాస్ గ్రీన్‌హార్ట్ దుశర్ల సత్యనారాయణ” అనే డాక్యుమెంటరీ కూడా ప్రదర్శించారు. అయితే వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ ఉన్న వారిని రాజ్‌భవన్ ఎంపిక చేసింది. వీరిలో సత్యనారాయణ కూడా ఉన్నారు. దుశర్ల సత్యనారాయణకు తెలంగాణ గవర్నర్-2024 అవార్డ్స్ ఫర్ ఎక్స్‌లెన్స్ అందింది. దీంతో పాటు రూ.2లక్షల నగదు కూడా అందజేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అతను చేసిన ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.
Read Also:Manjamma Jogati: ఆత్మగౌరవమే ఆయుధంగా మలిచిన.. మంజమ్మ జోగతి విజయగాథ!
-
Shepherds Protest: ఇదేం నిరసనయ్యా సామీ.. మేమెప్పుడూ చూడలే..
-
Telangana TET: తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. ఎప్పటి నుంచంటే?
-
Jawahar Navodaya Notification: జవహర్ నవోదయ నోటిఫికేషన్ రిలీజ్.. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి
-
Lawcet: లాసెట్ అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు రిలీజ్
-
Telangana: తెలంగాణ విద్యార్థులు ఇది మీకోసమే.. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి
-
AP Telangana Theaters Closed : ఏపీ, తెలంగాణలో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్