FASTag: ఫాస్టాగ్ న్యూ రూల్.. మే 1వ తేదీ జీపీఎస్ విధానం
జాతీయ రహదారులపై టోల్ వసూలు విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ వ్యవస్థను పూర్తిగా తొలగించిన విషయం తెలిసిందే. దీని స్థానంలో GPS ఆధారిత టోల్ వసూలు ప్రక్రియని తీసుకు రాబోతోంది.

FASTag: జాతీయ రహదారులపై టోల్ వసూలు విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ వ్యవస్థను పూర్తిగా తొలగించిన విషయం తెలిసిందే. దీని స్థానంలో GPS ఆధారిత టోల్ వసూలు ప్రక్రియని తీసుకు రాబోతోంది. అయితే ఇది మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. రోడ్డు ప్రయాణాలు చేసే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణాల్లో వేగవంతం చేయడానికి ఈ జీపీఎస్ సిస్టమ్‌ను తీసుకురానున్నారు. ఫాస్టాగ్ వల్ల టోల్ బూత్‌ల దగ్గర ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది. దీనివల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థని తీసుకొస్తోంది. అయితే ఈ టోల్ అనేది ప్రయాణాన్ని బట్టి విధిస్తుంది. డ్రైవర్ వాహనాన్ని ఎంత దూరం నడిపితే దాని బట్టి టోల్ వసూలు చేస్తారు. అయితే దీనివల్ల బూత్‌ల వద్ద ఎక్కువ సమయం నిల్చోవలసిన అవసరం ఉండదు. అలాగే మోసాలు జరగవు. ప్రమాదాలు కూడా కాస్త తగ్గే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు.
Read Also: దంపతులు ఈ టిప్స్ పాటిస్తే.. 30 ఏళ్ల తర్వాత కూడా హ్యాపీ
కొత్త టెక్నాలజీతో ఈ జీపీఎస్ విధానాన్ని తీసుకొచ్చారు. ఇది వాహన కదలికను బట్టి ట్రాక్ చేస్తుంది. అంటే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ ఉంటుంది. అలాగే వాహనంలో అమర్చిన జీపీఎస్ ఆధారంగా టోల్ ఛార్జీలను లెక్క వేస్తారు. ఉదాహరణకు డ్రైవర్లు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారనే విషయాన్ని ఆధారంగా ఛార్జ్ చేస్తారు. అయితే టోల్ ఫీజు మొత్తం డ్రైవర్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా కట్ అవుతుంది. వాహన యాజమానులు కూడా వారి ప్రయాణం, చెల్లింపులను డిజిటల్ ట్రాక్ కూడా చేసుకోవచ్చు. ఈ జీపీఎస్ విధానం అనేది మే 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఫాస్టాగ్ విషయంలో ఈ రూల్స్‌ను అందరూ కూడా తప్పకుండా పాటించాలి. ఈ కొత్త విధానం వల్ల ప్రజలకు ఉపయోగాలు ఎక్కువగా ఉన్నాయి.
జీపీఎస్ విధానం వల్ల ఎక్కువ సమయం టోల్ గేట్ వద్ద నిల్చోని ఉండాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఫాస్టాగ్ విధానంలో టోల్ గేట్ వద్ద వాహనాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది. అదే ఈ కొత్త జీపీఎస్ విధానం వల్ల ఆ ఇబ్బంది ఉండదు. అలాగే మీరు ఎంత దూరం ప్రయాణిస్తే దాని బట్టి మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఇంతకు ముందు ఎంత దూరం ప్రయాణించినా కూడా ఉన్న ఛార్జ్ కట్టాల్సిందే. ఇకపై ఆ ప్రాబ్లమ్ ఉండదు. అలాగే కాస్త ప్రమాదాలు కూడా తగ్గుతాయి. ఒక రకంగా చూసుకుంటే.. జీపీఎస్ విధానం వల్ల నష్టాల కంటే లాభాలే ఎక్కువగా ఉన్నాయి.
-
Fastag: ఫాస్టాగ్ యాన్యువల్ పాస్.. ఏడాదిలో ఎన్నిసార్లు తీసుకోవచ్చంటే?
-
FASTag : ఫాస్టాగ్ కొత్త యాన్యువల్ పాస్.. రూ.3000కడితే ఏడాదంతా హైవేల్లో తిరగొచ్చు
-
GST: జీఎస్టీ కౌన్సిల్ 12 శాతం పన్ను శ్లాబ్‌ను తొలగిస్తుందా?
-
RBI : కేంద్రానికి భారీ బొనాంజా.. RBI నుండి రూ.3లక్షల కోట్ల చెక్కు!
-
Good news: గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. నిరుద్యోగులు రెడీ అవ్వండి
-
PM Kisan: అకౌంట్‌లోకి పీఎం కిసాన్ డబ్బులు ఆరోజే.. ఇలా చేస్తేనే డబ్బులు?