Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • National News »
  • Pm Kisan Account Pm Kisana

PM Kisan: అకౌంట్‌లోకి పీఎం కిసాన్ డబ్బులు ఆరోజే.. ఇలా చేస్తేనే డబ్బులు?

PM Kisan: అకౌంట్‌లోకి పీఎం కిసాన్ డబ్బులు ఆరోజే.. ఇలా చేస్తేనే డబ్బులు?
  • Edited By: NARESH ENNAM,
  • Updated on February 22, 2025 / 11:09 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

PM Kisan:

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఇస్తుంది. ఈ డబ్బులను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24 తేదీన ప్రారంభించారు. అయితే ప్రతీ ఏడాది పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ఇదిలా ఉండగా తాజాగా 19వ విడత పీఎం కిసాన్ నిధుల జమపై ఓ కీలక అప్డేట్‌ను ప్రభుత్వం ఇచ్చింది. ఈ నెల 24వ తేదీన రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు జమ కానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పంట పెట్టుబడి సాయం కింద రైతులకు ప్రభుత్వం ఈ డబ్బులు అందిస్తుంది. ఇప్పటి వరకు మొత్తం 18 విడతల్లో పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యయి. ఇప్పుడు విడుదల చేసేది 19వ విడత డబ్బులు. అయితే బీహార్‌లోని భాగల్‌పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేయనున్నారు. ప్రతీ రైతు అకౌంట్‌లోకి రూ.2 వేలు చొప్పున డబ్బులు జమ అవుతాయి.

ఇదిలా ఉండగా పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఈ-కేవైసీ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే అకౌంట్‌లోకి డబ్బులు జమ అవుతాయి. అయితే దీనికి ఈ-కేవైసీని రైతులు డైరెక్ట్‌గా పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో చేసుకోవచ్చు. అయితే ఈ వెబ్‌సైట్‌లో ఇప్పటికే పీఎం కిసాన్ బెనిఫిషియరీ జాబితాను ఉంచారు. అర్హులైన రైతుల పేర్లు ఇందులో ఉంచారు. వీరికి మాత్రమే డబ్బులు వస్తాయి. అయితే మీరు ఇప్పటికీ చేయకపోతే.. వెంటనే దరఖాస్తు చేసుకుని ఈ-కేవైసీ కంప్లీట్ చేయండి. పీఎం కిసాన్ యోజనకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్‌ pmkisan.gov.in లోకి వెళ్లాలి. ఇందులోకి వెళ్లిన తర్వాత Former Corner పై క్లిక్ చేసి చేయండి. ఆ తర్వాత రైతు ఆధార్ నంబర్ నమోదు చేసి పీఎం కిసాన్ దరఖాస్తు ఫారమ్‌ను కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత https://pmkisan.gov.in/ లోకి వెళ్లి ఈ-కేవైసీ చేసుకోవాలి. ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీపై క్లిక్ చేసి 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. సబ్మిట్ చేస్తే ఈ-కేవైసీ పూర్తి అయినట్లే. ఈ-కేవైసీ పూర్తి కాకపోతే అకౌంట్‌లోకి డబ్బులు జమ కావు. కాబట్టి ఒకసారి మీరు అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోండి.

Tag

  • Government
  • PM Kisan
  • Pm Modi
Related News
  • PM Modi Maldives: భారత్ ను శరుణు వేడిన మాల్దీవ్స్

  • PM Kisan : పీఎం కిసాన్ 20వ విడుత డబ్బులు రావాలంటే ముందు ఈ 6పనులు చేశారా ?

  • GST: జీఎస్టీ కౌన్సిల్ 12 శాతం పన్ను శ్లాబ్‌ను తొలగిస్తుందా?

  • RBI : కేంద్రానికి భారీ బొనాంజా.. RBI నుండి రూ.3లక్షల కోట్ల చెక్కు!

  • FASTag: ఫాస్టాగ్ న్యూ రూల్.. మే 1వ తేదీ జీపీఎస్ విధానం

  • Good news: గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. నిరుద్యోగులు రెడీ అవ్వండి

Latest Photo Gallery
  • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us