PM Modi Maldives: భారత్ ను శరుణు వేడిన మాల్దీవ్స్
PM Modi Maldives ఇవాళ ఉదయం మాలే చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు ఘనంగా స్వాగతం పలికారు.

PM Modi Maldives: భారత్ పై మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలో కేంద్రంలోని మోదీ సర్కార్ అనుసరించిన తీరు.. మాల్దీవులు ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టింది. చివరకూ మా దేశంలో పర్యటించండి అనే స్థాయికి మాల్దీవులు దిగజారేలా చేసింది. అయితే విదేశీ పర్యటనలో భాగంగా మోదీ మాల్దీవుల పర్యటను వెళ్లారు.
ఇవాళ ఉదయం మాలే చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాలే ఎయిర్ పోర్టులో వందేమాతంరం, భారత్ మాతాకీ జై వంటి నినాదాలు వినిపించాయి. అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు ఆహ్వానం మేరకు ప్రదాని మోదీ మాల్దీవులకు వెళ్లారు. ఆ దేశంలో మోదీ పర్యటించడం ఇది మూడోసారి. మొయిజు మాల్దీవుల్లో అధికారం చేపట్టిన తర్వాత విదేశీ దేశాధినేత తొలి పర్యటన ఇదే కావడం విశేషం. ఇండియా అవుట్ ప్రచారం ద్వారా భాతర్ మాల్దీవుల సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే మళ్లీ మొహమ్మద్ ముయిజు ఆహ్వానం మేరకు అక్కడి వెళ్లారు మోదీ.