GST: జీఎస్టీ కౌన్సిల్ 12 శాతం పన్ను శ్లాబ్‌ను తొలగిస్తుందా?

GST: భారతదేశంలో వస్తువుల, సేవల పన్ను (GST) వ్యవస్థలో కీలక మార్పులు రానున్నాయి. త్వరలో జరగనున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తుతం ఉన్న 12 శాతం పన్ను స్లాబ్‌ను తొలగించడంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షత వహిస్తారు, రాష్ట్ర ఆర్థిక మంత్రులు కూడా హాజరవుతారు. ఈ మార్పు అమల్లోకి వస్తే, జీఎస్టీ పన్ను స్లాబ్ సంఖ్య నాలుగు నుంచి మూడుకు తగ్గుతుందని తెలుస్తోంది.
ఎందుకు ఈ మార్పు?
ప్రస్తుతం 12 శాతం పన్ను స్లాబ్ ఇప్పుడు పెద్దగా ఉపయోగకరంగా లేదు. రేట్లు హేతుబద్ధీకరణపై పనిచేస్తున్న మంత్రుల బృందం (GoM)కు సలహా ఇస్తున్న అధికారులు, నిపుణులు కూడా ఈ స్లాబ్‌ను తీసేయాలని భావిస్తున్నారు. దీని కింద ఉన్న వస్తువులను 5 శాతం లేదా 18 శాతం పన్ను స్లాబ్‌కు మార్చాలని సూచిస్తున్నారు. ఆదాయాన్ని సమతుల్యం చేసుకుంటూనే పన్ను రేట్లను సరళీకరిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం జీఎస్టీ కౌన్సిల్ తీసుకోనుంది. ప్రస్తుతం పన్నులు 5 శాతం, 12 శాతం,18 శాతం, 28 శాతం వరకు కేంద్రం విధిస్తుంది. అయితే 12% స్లాబ్ కింద ఉన్న కొన్ని వస్తువులు ఉన్నాయి. ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన ఆహారాలు వెన్న, నెయ్యి, జున్ను (చీజ్), పండ్ల రసాలు, జామ్‌లు, జెల్లీలు, నమ్‌కీన్‌లు, ఎండిన, నిల్వ చేసి న పండ్లు బాదం, ఖర్జూరం, ఇతర ఎండిన పండ్లు, పానీయాలు, ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్లు ఉన్నాయి.
అలాగే గొడుగులు, కొన్ని గృహోపకరణాలు, చెక్కతో చేసిన ఫర్నిచర్,స్టేషనరీ, ఉపకరణాలు, పెన్సిళ్లు, క్రేయాన్లు, జనపనార లేదా పత్తితో చేసిన హ్యాండ్ బ్యాగులు, షాపింగ్ బ్యాగులు, రూ.1,000 లోపు ఉండే పాదరక్షలు, డయాగ్నస్టిక్ కిట్లు, మిగతా వైద్య నిర్ధారణ కిట్లు, నిర్మాణ సామాగ్రి పాలరాయి గ్రానైట్ బ్లాక్స్ ఉన్నాయి. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పరిహార సెస్సు భవిష్యత్తు గురించి కూడా చర్చించనున్నారు. పరిహార సెస్సుపై ఏర్పాటైన మంత్రుల బృందం మార్చి 2026 తర్వాత ఈ సెస్సు కొనసాగింపుపై పరిశీలన చేస్తుంది. ప్రస్తుతం, లగ్జరీ వస్తువులుగా ఉన్న వాటిపైనే సెస్సు విధించారు. త్వరలోనే ఈ పన్ను స్లాబ్‌పై చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
ఇది కూడా చూడండి: Kitchen AC : చల్లగా వంట చేద్దామని కిచెన్లో ఏసీ పెట్టిస్తున్నారా.. అదెంత డేంజరో తెలుసా ?
-
Andhra Pradesh: తల్లికి వందనం రూ.13 వేలు.. మరి మిగతా రూ.2 వేల పరిస్థితి ఏంటి?
-
RBI : కేంద్రానికి భారీ బొనాంజా.. RBI నుండి రూ.3లక్షల కోట్ల చెక్కు!
-
FASTag: ఫాస్టాగ్ న్యూ రూల్.. మే 1వ తేదీ జీపీఎస్ విధానం
-
Good news: గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. నిరుద్యోగులు రెడీ అవ్వండి
-
PM Kisan: అకౌంట్‌లోకి పీఎం కిసాన్ డబ్బులు ఆరోజే.. ఇలా చేస్తేనే డబ్బులు?