Fastag: నేటి నుంచే ఫాస్టాగ్ కొత్త రూల్స్ అమలు.. మారిన ఈ న్యూ రూల్స్ ఏంటంటే?

Fastag: జాతీయ రహదారులపై ఫాస్టాగ్ (FASTag) లావాదేవీల విషయంలో కొత్త రూల్స్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే వీటికి సంబంధించిన రూల్స్ అన్ని కూడా నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టోల్ గేట్ల వద్ద లావాదేవీలు ఈజీగా జరిగేలా కొత్త నిబంధనను తీసుకొచ్చిన రూల్ నేటి నుంచి అమలు అవుతోంది. ఈ కొత్త రూల్ వల్ల మోసాలను కొంత వరకు నివారించవచ్చు. అలాగే టోల్ బూత్‌ల వద్ద రద్దీ కూడా కొంత వరకు క్లియర్ అవుతుంది. ఆన్‌లైన్‌లో లావాదేవీలు చెల్లించడం వల్ల కొంత వరకు ఫాస్టాగ్‌ను అభివృద్ధి చేయవచ్చు. అయితే గతంలో ఫాస్టాగ్‌లో డబ్బులు లేకపోతే టోల్ బూత్ నుంచి వెంటనే రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇకపై ఇలా రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉండదు. కొత్త రూల్స్ ప్రకారం అయితే టోల్ ప్లాజా దాటడానికి గంట ముందు ఫాస్ట్ ట్యాగ్ పనిచేయకపోయినా లేదా తక్కువ బ్యాలెన్స్ ఉన్నా కూడా టోల్ ప్లాజాలో చెల్లించిన టోల్ తిరస్కరిస్తారు.
టోల్ బూత్ గుండా వెళ్లిన పది నిమిషాల తర్వాత ఫాస్టాగ్ పనిచేయకపోతే బ్లాక్‌లిస్ట్‌లో ఒకవేళ ఉంటే లావాదేవీలను తిరస్కరిస్తారు. ఇదే కనుక జరిగితే కస్టమ్స్ డబ్బు్లు కంటే రెట్టింపు జరిమానా కట్టాల్సి వస్తుందని అంటున్నారు. ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ లేకపోవడం, పెండింగ్‌లో ఉండటం, కేవైసీ పూర్తి కాకపోవడం, వాహనాల రిజిస్ట్రేషన్ వంటి వాటి కారణాల వల్ల ఒక్కోసారి బ్లాక్ లిస్టింగ్ లోకి వెళ్తుంది. ఇలాంటి సమయాల్లో మీరు డబ్బులు చెల్లించిన అది జరిమానా పడుతుంది. కాబట్టి ప్రయాణించే ముందు ఎంత బ్యాలెన్స్ ఉందనే పూర్తి వివరాలు కూడా తెలుసుకోండి. నేటి నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. వాహనదారులు ప్రయాణించేటప్పుడు తప్పకుండా చెక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
ఉదాహరణకు మీరు ఉదయం 10 గంటల సమయంలో ప్రయాణం మొదలు పెట్టారనుకోండి. ఆ సమయంలో మీ ఫాస్టాగ్ బ్లాక్ లిస్టులోకి వెళ్తే.. మీరు 11:30 గంటల సమయంలో టోల్ ప్లాజా దగ్గరకు వెళ్తారు. ఈ సమయంలో మీ ట్రాన్సాక్షన్ రిజెక్ట్ అవుతుంది. వెంటనే మీరు 70 నిమిషాల్లోగా బ్లాక్ లిస్టుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా పూర్తి చేయాలి. బ్యాలెన్స్ డబ్బులు వేయడం, పెండింగ్ కేవైసీని అప్డేట్ చేయాలి. లేకపోతే టోల్ ప్లాజా రీడర్ రీడ్ చేసిన 10 నిమిషాల తర్వాత కూడా మీ ఫాస్టాగ్ బ్లాక్ లిస్టులోకి వెళ్తుంది. దీంతో మీ ట్రాన్సాక్షన్ తిరస్కరించి డబుల్ ఛార్జ్ పడుతుంది. మీరు కొత్త రూల్ తెలుసుకోకుండా లాస్ట్‌లో రీఛార్జ్ చేసినా కూడా ఫలితం ఉండదు. కాబట్టి డబ్బులు పూర్తి అయిన వెంటనే రీఛార్జ్ చేసుకోండి.