Ramadan: పవిత్రమైన రంజాన్ ఉపవాసం.. ఈ సమయంలో పాటించాల్సిన నియమాలివే

Ramadan:
ముస్లింల పవిత్రమైన పండుగ రంజాన్ మాసం వచ్చేస్తుంది. నెలవంక కనిపించిన తర్వాత ఉపవాస దీక్ష ప్రారంభిస్తారు. భారత్‌లో నెలవంక మార్చి1వ తేదీన కనిపిస్తుంది. ఆ తర్వాత రోజు మార్చి 2వ తేదీ రంజాన్ మాస ఉపవాస దీక్ష ప్రారంభమవుతుంది. అయితే కొందరు మార్చి1వ తేదీ నుంచి ఉపవాసం ఆచరిస్తారు. ముస్లింలకు ఇది చాలా పవిత్రమై మాసం. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తరువాత మాత్రమే ఏదైనా తింటారు. రోజంతా కనీసం లాలాజలం కూడా నోటిలోనికి పోనివ్వరు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం.. తొమ్మిదో నెలలో నెలవంక తర్వాత రంజాన్ స్టార్ట్ అవుతుంది. అయితే దీన్ని మూడు విధాలుగా విభజిస్తారు. రంజాన్ మాసంలో మొదటి పది రోజుల ఉపవాసాన్ని రహ్మత్ అని తర్వాత వచ్చే పది రోజుల కాలాన్ని బర్కత్ అని, చివరి పది రోజుల కాలాన్ని మగ్ఫిరత్ అని అంటారు. అయితే ఈ ఏడాది రంజాన్ మాసాన్ని మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ముస్లింలు ఉపవాసం ఆచరిస్తారు. అయితే ఉపవాస సమయాల్లో ముస్లింలు పాటించాల్సిన నియమాలు ఏంటో చూద్దాం.
మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న ప్రతీ ముస్లిం వ్యక్తి ఉపవాస దీక్ష ఆచరించాలి. ఉపవాసం ఆచరిస్తున్నప్పుడు మధ్యలో జ్వరం లేదా ఏదైనా అనారోగ్య సమస్య ఎదురైతే మధ్యలో ఆపి మళ్లీ ప్రారంభించాలి. మధ్యలో ఎన్ని రోజులు అయితే మీరు ఉపవాసం ఆపేస్తారో.. సమస్య తగ్గిన తర్వాత మళ్లీ అన్ని రోజులు భర్తీ చేయాలి. అయితే దీర్ఘకాలికంగా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారో వారు ఉపవాసం ఆచరించలేరు. అలాంటి వారు ఫిద్యహ్ చెల్లించాలి. ఉపవాసం లేకపోయిన వాళ్లు పేదలకు ఆహారం దానం చేయాలి. అలాగే రంజాన్ మాసంలో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలు చేయాలి. ఈ ఉపవాస సమయంలో ఆహారం, నీరు, ధూమపానం, లైంగిక కార్యకలాపాలు వంటి వాటిలో పాల్గొనకూడదు. అలాగే అబద్ధం చెప్పడం, పోరాడటం, శపించడం, వాదించడం వంటివి కూడా చేయకూడదు. అయితే కొందరు వాంతులు చేసుకుంటారు. ఉపవాసంలో ఇలా వాంతులు చేసుకుంటే ఆ ఉపవాసం చెల్లదు.
ముస్లింలు ఈ ఉపవాసం తప్పకుండా ఆచరించాలి. ఇది ముస్లింలకు చాలా పవిత్రమైనది. ఈ ఉపవాసం ఆచరిస్తే.. అల్లాహ్ దగ్గర ఉన్నట్లు అతని, ఆశీస్సులు అందుతాయని నమ్ముతారు. అందుకే ఈ సమయంలో తప్పకుండా ఉపవాసం ఆచరిస్తారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రమే వీటిని ఆచరించరు. కానీ మిగతా వారంతా తప్పకుండా ఈ ఉపవాస దీక్షను పాటిస్తారు. ఈ ఉపవాసం సమయంలో నోటిలోకి లాలాజలం కూడా పోనివ్వరు. ఎలాంటి ఆలోచనలు రాకుండా రోజంతా ఉంటారు. ఎంతో నిష్టతో ముస్లిం సోదరులు అందరూ కూడా ఈ ఉపవాస దీక్షను ఆచరిస్తారు. సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి తర్వాత మాత్రమే వీరు ఏదైనా పదార్థాలు తీసుకుంటారు. రోజంతా కఠిన ఉపవాస దీక్షను ఆచరిస్తారు.
-
Ramadan 2025: ఈ సారి మన దగ్గర రంజాన్ ప్రారంభం అయ్యేది అప్పుడే.. ఇతర దేశాల్లో ఎప్పుడు అంటే?
-
Ramadan: రంజాన్ ఉపవాసం ఆచరిస్తున్నారా.. అయితే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు మీకే
-
Ramadan: రంజాన్ మాసంలో రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే.. సహూర్‌లో తీసుకోవాల్సినవి ఇవే
-
Ramadan: వచ్చేస్తున్న రంజాన్.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉపవాసం ఆచరించాలంటే?
-
Maha Shivaratri: శివరాత్రికి జాగరణ ఎలా చేస్తే.. పుణ్య ఫలం లభిస్తుందంటే?
-
Maha Shivaratri: ఈ నియమాలు పాటిస్తూ ఉపవాసం ఆచరిస్తే.. పుణ్యమంతా మీదే