Ramadan 2025: ఈ సారి మన దగ్గర రంజాన్ ప్రారంభం అయ్యేది అప్పుడే.. ఇతర దేశాల్లో ఎప్పుడు అంటే?

Ramadan 2025:
పవిత్ర రంజాన్ మాసం (రంజాన్ 2025) ప్రారంభం కానుంది. ఈ నెల అనేది ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం అనుచరులకు చాలా ఆధ్యాత్మిక సమయం. ఈ సమయంలో ఉపవాసం, ప్రార్థనలతో ఉంటారు ముస్లిం సోదరులు. ఈ సంవత్సరం ఈ పవిత్ర మాసం ప్రారంభం గురించి మాట్లాడుకుంటే, 2025 సంవత్సరంలో చంద్రుడిని చూసిన తర్వాత అంటే మార్చి 1 నుంచి రంజాన్ ప్రారంభమవుతుందట. అయితే, ఇది వివిధ దేశాలలో వేర్వేరు తేదీలలో జరుపుకుంటారు. అయితే ఈ వ్యాసంలో సౌదీ అరేబియా, భారతదేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), పాకిస్తాన్, భారతదేశంలో రంజాన్ 2025 ప్రారంభమయ్యే తేదీలు, సమయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చంద్రుడిని చూడటం ప్రాముఖ్యత
ఇస్లామిక్ క్యాలెండర్ చంద్రునిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి నెల కొత్త నెలవంక దర్శనంతో ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం రంజాన్ ప్రారంభంలో కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తారు. రంజాన్ తో ముడిపడి ఉన్న ఉపవాసం, ఇతర మతపరమైన ఆచారాల ప్రారంభాన్ని సూచిస్తున్నందున చంద్రుని దర్శనం చాలా ముఖ్యమైనదిగా చెబుతుంటారు.
భారతదేశంలో రంజాన్
భారతదేశంలో, శనివారం సాయంత్రం అంటే మార్చి 1, 2025 న చంద్రుడు కనిపించనున్నాడు. ఈ రోజున చంద్రుడు కనిపిస్తే, ఉపవాసం ఆదివారం నుంచి అంటే 2025 మార్చి 2 నుంచి అంటే రేపటి నుంచి ప్రారంభమవుతుంది. అయితే, దీనిపై తుది నిర్ణయం స్థానిక చంద్ర దర్శన కమిటీలు, ఇస్లామిక్ పండితులపై ఆధారపడి ఉంటుంది. వారు చంద్రుని దర్శనం ఆధారంగా రంజాన్ అధికారిక ప్రారంభాన్ని ప్రకటిస్తారు.
పాకిస్తాన్‌లో రంజాన్
భారతదేశం లాగానే పాకిస్తాన్‌లో కూడా చంద్రుడిని చూసే పద్ధతిని అనుసరిస్తారు. ఇక్కడ కూడా మార్చి 1, 2025 సాయంత్రం చంద్రుడు కనిపించవచ్చని భావిస్తున్నారు. అర్ధ చంద్రుడు కనిపిస్తే, భారతదేశంలో లాగా, ఇక్కడ కూడా మార్చి 2 నుంచి రంజాన్ ప్రారంభం కానుంది. ఇక్కడ రూట్-ఎ-హిలాల్ కమిటీ చంద్రుని దర్శన నివేదిక ఆధారంగా రంజాన్ అధికారిక తేదీని నిర్ధారిస్తుంది.
సౌదీ అరేబియాలో రంజాన్
సౌదీ అరేబియాలో, 29 షాబాన్ 1446 హిజ్రీకి అనుగుణంగా, ఫిబ్రవరి 28, 2025 శుక్రవారం సాయంత్రం నెలవంకను గమనించాలని సుప్రీంకోర్టు పౌరులను కోరింది. ఈ సమయంలో ఇక్కడ చంద్రుడు కనిపిస్తే, రంజాన్ మార్చి 1, 2025 శనివారం ప్రారంభమవుతుంది. నెలవంక కనిపించకపోతే, పవిత్ర మాసం ఆదివారం, మార్చి 2, 2025న ప్రారంభమవుతుంది.
యుఎఇలో రంజాన్
అదేవిధంగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో, ఫిబ్రవరి 28, శుక్రవారం చంద్రుని కోసం వేచి ఉంటారు. పశ్చిమ ఆసియా, ఆఫ్రికాలోని చాలా భాగం, దక్షిణ ఐరోపాలోని టెలిస్కోపుల ద్వారా నెలవంక కనిపించనుందని అబుదాబిలోని అంతర్జాతీయ ఖగోళ కేంద్రం తెలిపింది. ఫలితంగా, చంద్రుడు కనిపిస్తే, ఉపవాసం మార్చి 1, 2025 నుంచి అంటే ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది, లేకుంటే మార్చి 2 నుంచి ప్రారంభమవుతుంది.
రంజాన్ ప్రాముఖ్యత
తెలంగాణ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, రంజాన్ ఇస్లామిక్ పవిత్ర మాసం. ఈద్-ఉల్-ఫితర్ – రంజాన్ నెల చివరిలో ఈద్ పండుగ జరుపుకుంటారు. అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలియజేయడానికి రంజాన్ జరుపుకుంటారు. ఈ రోజుల్లో ప్రజలు రోజాను పాటిస్తారు. అంటే ఉపవాసం ఉంటారు. ఆ సమయంలో వారు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంచి ప్రార్థనలో గడుపుతారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Ramadan: పవిత్రమైన రంజాన్ ఉపవాసం.. ఈ సమయంలో పాటించాల్సిన నియమాలివే
-
Ramadan: రంజాన్ ఉపవాసం ఆచరిస్తున్నారా.. అయితే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు మీకే
-
Ramadan: రంజాన్ మాసంలో రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే.. సహూర్‌లో తీసుకోవాల్సినవి ఇవే
-
Ramadan: వచ్చేస్తున్న రంజాన్.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉపవాసం ఆచరించాలంటే?