Ramadan: రంజాన్ మాసంలో రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే.. సహూర్‌లో తీసుకోవాల్సినవి ఇవే

Ramadan:
ముస్లింల ప్రధాన పండుగ రంజాన్ మాసం వచ్చేస్తుంది. మార్చి2వ తేదీన రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. సాధారణంగా నెలవంక అనేది ముందు గల్ఫ్ దేశాల్లో కనిపిస్తుంది. ఆ తర్వాత భారత్, పాకిస్థాన్‌లో దర్శనమిస్తుంది. అయితే భారత్‌లో చంద్రుడు మార్చి1వ తేదీన దర్శనమిస్తాడు. దీంతో రంజాన్ మాసం మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. కొందరు మార్చి1వ తేదీ నుంచి ఉపవాసం ఆచరిస్తారు. ఖురాన్ ప్రకారం నెలవంక తర్వాతే రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసం ప్రారంభమయ్యాక ఉపవాస దీక్ష ఆచరిస్తారు. ముస్లింలకు ఇది చాలా పవిత్రమై మాసం. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తరువాత మాత్రమే ఏదైనా తింటారు. రోజంతా కనీసం లాలాజలం కూడా నోటిలోనికి పోనివ్వరు. అయితే సూర్యోదయానికి ముందు సహూర్ పేరుతో తప్పకుండా భోజనం చేసి.. సూర్యాస్తమయం తర్వాత ఇఫ్తార్ తింటారు. అయితే రోజులో సహూర్ చాలా ముఖ్యమైనది. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే తప్పకుండా సహూర్ తినాలి. మరి ఈ సమయంలో తీసుకోవాల్సిన ఆ ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం.
సహూర్ సమయంలో ఫైబర్, ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. వీటివల్ల మీరు ఎక్కువ ఎనర్జీటిక్‌గా ఉంటారు. బాడీ డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది. ఈ సమయంలో మసాలా, ఫాస్ట్ ఫుడ్స్ వంటివి కాకుండా.. ఓట్ మీల్, గోధుమలు, బ్రౌన్ రైస్, క్వినోవా వంటివి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని కార్బోహైడ్రేట్లు శక్తిని విడుదల చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఎక్కువ సమయం పొట్ట నిండుగా అనిపిస్తుంది. దీంతో మీరు రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. వీటితో పాటు గుడ్లు, గ్రీక్ పెరుగు, కాటేజ్ చీజ్ లేదా లీన్ మాంసం వంటివి తీసుకోవచ్చు. వీటితో పాటు ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, అరటి పండ్లు, ఆపిల్స్, పియర్స్, దోసకాయలు, ఆకుకూరలు వంటివి కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఖర్జూరం తీసుకోవాలి. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. ఆరోగ్యమైన కొవ్వులను తినే ఫుడ్‌లో యాడ్ చేసుకోవాలి. అప్పుడే మీరు రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.
ఈ నెలలో ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటుంది. వేడి వల్ల బాడీ డీ హైడ్రేట్ అవుతుంది. కాబట్టి పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోండి. దీనివల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. పుచ్చకాయ, నారింజ, దోసకాయం, పెరుగు, మజ్జిగ వంటివి కూడా తీసుకోండి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఫాస్ట్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్ కాకుండా పండ్ల రసాలు వంటివి తీసుకోండి. ఇవి బాడీని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు ఆరోగ్యంగా ఉంచుతాయి. మీరు రోజంతా చాలా యాక్టివ్‌గా ఉంటారు.
-
Ramadan 2025: ఈ సారి మన దగ్గర రంజాన్ ప్రారంభం అయ్యేది అప్పుడే.. ఇతర దేశాల్లో ఎప్పుడు అంటే?
-
Ramadan: పవిత్రమైన రంజాన్ ఉపవాసం.. ఈ సమయంలో పాటించాల్సిన నియమాలివే
-
Ramadan: రంజాన్ ఉపవాసం ఆచరిస్తున్నారా.. అయితే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు మీకే
-
Ramadan: వచ్చేస్తున్న రంజాన్.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉపవాసం ఆచరించాలంటే?
-
Maha Shivaratri: శివరాత్రికి జాగరణ ఎలా చేస్తే.. పుణ్య ఫలం లభిస్తుందంటే?
-
Maha Shivaratri: ఈ నియమాలు పాటిస్తూ ఉపవాసం ఆచరిస్తే.. పుణ్యమంతా మీదే