Walking Tips: డైలీ ఇలా వాకింగ్ చేస్తే.. ఆరోగ్యానికి లక్షలకొద్ది లాభాలు!

Walking Tips: ఆరోగ్యానికి ఉండటానికి వాకింగ్ బాగా సహాయపడుతుంది. రోజులో ఎంత బిజీగా ఉన్నా ఉదయం లేదా సాయంత్రం వేళలో నడవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్‌లో కనీసం వాకింగ్ కూడా చేయడం లేదు. నిజానికి ఇంట్లో ఏదైనా పని చేసినా కూడా కాస్త వ్యాయామం చేసినట్లు అవుతుంది. కానీ అలా చేయకుండా తినడం, నిద్రపోవడం వంటివి చేస్తున్నారు. వీటివల్ల ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నా కూడా వినరు. అయితే కొందరు ఆరోగ్యం కోసం సమయం వెచ్చించి మరి వాకింగ్ చేస్తుంటారు. ఏదైనా కూడా సరైన పద్ధతిలో చేస్తేనే ఆరోగ్యానికి మంచిది. వాకింగ్ అసలు సరిగ్గా చేయకపోతే దాని ఫలితాలు కూడా ఉండవు. కొందరు తెలియక వాకింగ్ విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. దీనివల్ల ఇంకా అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే వాకింగ్‌ను సరైన పద్ధతిలో ఎలా చేస్తే ఆరోగ్యానికి మంచిదో మీకు తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.
Also Read: RailOne : రైల్వే ప్రయాణికులకు బంపర్ న్యూస్.. టికెట్, ఫుడ్.. అన్నీ ఒకే యాప్‌లో!
కొందరు వాకింగ్ చేసేటప్పుడు ఏదో చేయాలని చేస్తుంటారు. కానీ ఇలా కాకుండా కాస్త వాకింగ్‌ను బలంగా చేయాలి. అంటే కొందరు ఏదో నడవాలని నడుస్తారు. ఇలా కాకుండా నడిచేటప్పుడు బలంగా చేతులను ముందుకు, వెనక్కు ఊపుతూ నడవాలి. అప్పుడే మీ బాడీలోని కేలరీలు అన్ని కూడా బర్న్ అవుతాయి. దీంతో మీరు ఆరోగ్యంగా ఉంటారు. మధుమేహం, గుండె పోటు వంటి సమస్యలు కూడా రావు. ఇలా నడిస్తే ముఖ్యంగా బరువు తగ్గుతారు. ఇలా రోజుకి ఒక 30 నిమిషాల పాటు నడవడం వల్ల కేవలం నెల రోజుల్లోనే ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. కొందరు వాకింగ్ చేయాలనే ఒకే రోజు ఎక్కువగా నడుస్తుంటారు. ఇలా ఒక్కసారిగా ఎప్పుడు కూడా నడవకూడదు. మొదట కొన్ని నిమిషాల పాటు కాస్త నెమ్మదిగా చేయాలి. ఆ తర్వాత స్పీడ్‌ను పెంచుకుంటూ పోవాలి. ఇలా చేయడం వల్ల మీ క్యాలరీలు అన్ని కూడా పూర్తిగా బర్న్ అవుతాయి. దీంతో మీరు ఆరోగ్యంగా ఉంటారు.
ఆరోగ్యానికి వాకింగ్ చేయాలి. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది షూలు వేసుకుని, రోడ్డు మీద వాకింగ్ చేస్తున్నారు. కానీ ఇలా కాకుండా చదునుగా ఉండే నేలపై నడటం మంచిదని నిపుణులు అంటున్నారు. నేలపై చెప్పులు లేకుండా నడవడం ఇంకా ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. అన్ని విధాలుగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. బరువు తగ్గి ఫిట్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Children Diabetes: పిల్లల్లో అధిక చక్కెరను గుర్తించడం ఎలా?
-
Health Benefits: ఇది విన్నారా.. పాలలో ఈ పదార్థాన్ని కలిపి తాగితే.. బోలెడన్నీ ప్రయోజనాలు
-
Lethargy: తీవ్ర అలసట ఇబ్బంది పెడుతుందా.. ఇవి తినడం మరిచిపోవద్దు
-
Pickles for Health: నిమ్మ, అల్లం, వెల్లుల్లి ఊరగాయ.. ఇవి తింటే బరువు తగ్గడం పక్కా!
-
Plant Based Milk: మొక్కల ఆధారిత పాలతో ఆరోగ్యానికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?
-
Pregnancy: ప్రెగ్నెన్సీ తర్వాత బరువు తగ్గడం ఎలా?