Ramadan: వచ్చేస్తున్న రంజాన్.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉపవాసం ఆచరించాలంటే?

Ramadan:
ముస్లింల పవిత్రమైన పండుగ రంజాన్ మాసం వచ్చేస్తుంది. నెలవంక కనిపించిన తర్వాత ఉపవాస దీక్ష అనేది ప్రారంభిస్తారు. అయితే ఈ నెలవంక ముందుగా గల్ఫ్ దేశాల్లో కనిపిస్తుంది. ఆ తర్వాత భారత్, పాకిస్థాన్‌లో దర్శనమిస్తుంది. అయితే భారత్‌లో నెలవంక మార్చి1వ తేదీన కనిపిస్తుంది. ఆ తర్వాత రోజు మార్చి 2వ తేదీ రంజాన్ మాస ఉపవాస దీక్ష ప్రారంభమవుతుంది. అయితే కొందరు మార్చి1వ తేదీ నుంచి ఉపవాసం ఆచరిస్తారు. ముస్లింలకు ఇది చాలా పవిత్రమై మాసం. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తరువాత మాత్రమే ఏదైనా తింటారు. రోజంతా కనీసం లాలాజలం కూడా నోటిలోనికి పోనివ్వరు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం.. తొమ్మిదో నెలలో నెలవంక తర్వాత రంజాన్ స్టార్ట్ అవుతుంది. అయితే దీన్ని మూడు విధాలుగా విభజిస్తారు. రంజాన్ మాసంలో మొదటి పది రోజుల ఉపవాసాన్ని రహ్మత్ అని తర్వాత వచ్చే పది రోజుల కాలాన్ని బర్కత్ అని, చివరి పది రోజుల కాలాన్ని మగ్ఫిరత్ అని అంటారు. అయితే ఈ ఏడాది రంజాన్ మాసాన్ని మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఆచరిస్తారు.
రంజాన్ మాస ఉపవాసాన్ని అరబిక్ నిఘంటువులో సౌమ్ అని అంటారు. ముస్లింలు అందరూ కూడా తప్పకుండా ఈ ఉపవాసం ఆచరిస్తారు. ఉదయం సహూర్‌తో ప్రారంభించి.. ఇఫ్తార్‌తో ఉపవాసాన్ని ఎండ్ చేస్తారు. ఈ ఉపవాస సమయంలో రోజంతా ఏం తికుండా ఉండారు. సూర్యాస్తమయం కాకుండా ఆహారం తీసుకుంటారు. మళ్లీ సాయంత్రం నమాజ్ తర్వాత ఆహారం తీసుకుంటారు. సాయంత్రం ఖర్జూర పండ్లుతో ఉపవాసాన్ని ఆపుతారు. దీన్ని మగ్రిబ్ లేదా ఇఫ్తార్ అంటారు. నెల రోజుల పాటు ముస్లింలు కఠిన దీక్షలు పాటిస్తారు. రోజుంతా నోటిలోకి ఏం పోనివ్వకుండా ఉంటారు. ఉపవాసం ఆచరించే వారు రోజులో తప్పకుండా ఐదుసార్లు ప్రార్థన చేస్తారు.
ముస్లింలు రంజాన్ మాసంలో నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేస్తారు. నిజానికి వారు నోట్లోకి కనీసం లాలాజలం కూడా పోనివ్వరు. నీరు కూడా తాగరు. అలాగే దానం కూడా చేయాలి. అంటే వారి సంపాదనలో దాదాపుగా రెండున్నర శాతం పేదలకు సాయం చేయాలి. దీనివల్ల వారి ఉపవాసానికి ప్రతిఫలం దక్కుతుందని చెబుతారు. ఈ మాసంలో చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. స్వచ్ఛమై మనస్సుతో మాత్రమే ఉపవాస దీక్ష ఆచరించి.. అల్లాహ్‌ని ప్రార్థన చేయాలి. సహూర్, ఇఫ్తార్ సమయంలో మాత్రమే తింటారు. కాబట్టి పోషకాలు ఉండే వాటిని మాత్రమే తీసుకోవాలి. అప్పుడే నీరసం వంటివి రాకుండా ఉంటాయి. నెల రోజుల పాటు ముస్లిం సోదరులు ఎంతో కఠినంగా ఉపవాస దీక్ష ఆచరిస్తారు.
-
Ramadan 2025: ఈ సారి మన దగ్గర రంజాన్ ప్రారంభం అయ్యేది అప్పుడే.. ఇతర దేశాల్లో ఎప్పుడు అంటే?
-
Ramadan: పవిత్రమైన రంజాన్ ఉపవాసం.. ఈ సమయంలో పాటించాల్సిన నియమాలివే
-
Ramadan: రంజాన్ ఉపవాసం ఆచరిస్తున్నారా.. అయితే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు మీకే
-
Ramadan: రంజాన్ మాసంలో రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే.. సహూర్‌లో తీసుకోవాల్సినవి ఇవే
-
Maha Shivaratri: శివరాత్రికి జాగరణ ఎలా చేస్తే.. పుణ్య ఫలం లభిస్తుందంటే?
-
Maha Shivaratri: ఈ నియమాలు పాటిస్తూ ఉపవాసం ఆచరిస్తే.. పుణ్యమంతా మీదే