Ramadan: రంజాన్ ఉపవాసం ఆచరిస్తున్నారా.. అయితే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు మీకే

Ramadan:
ముస్లింల ప్రధాన పండుగ రంజాన్ మాసం వచ్చేస్తుంది. మార్చి2వ తేదీన రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. భారత్‌లో నెలవంక మార్చి1వ తేదీన కనిపిస్తే.. 2వ తేదీ నుంచి ఉపవాసం ఆచరిస్తారు. ఖురాన్ ప్రకారం నెలవంక తర్వాతే రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో ముస్లిం సోదరులు అందరూ కూడా ఉపవాస దీక్ష ఆచరిస్తారు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తరువాత మాత్రమే ఏదైనా తీసుకుంటారు. రోజులో నోటిలోకి లాలాజలం కూడా పోనివ్వరు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం.. తొమ్మిదో నెలలో నెలవంక తర్వాత రంజాన్ స్టార్ట్ అవుతుంది. అయితే దీన్ని మూడు విధాలుగా విభజిస్తారు. రంజాన్ మాసంలో మొదటి పది రోజుల ఉపవాసాన్ని రహ్మత్ అని తర్వాత వచ్చే పది రోజుల కాలాన్ని బర్కత్ అని, చివరి పది రోజుల కాలాన్ని మగ్ఫిరత్ అని అంటారు. అయితే ఈ ఏడాది రంజాన్ మాసాన్ని మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ముస్లింలు ఉపవాసం ఆచరిస్తారు. మరి రంజాన్ మాసంలో ముస్లింలు పాటింటే కఠిన ఉపవాసం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ క్రియ ఆరోగ్యం
రంజాన్ సమయంలో ఉపవాసం ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మీరు తీసుకునే ఆహారానికి విరామం ఉంటుంది. దీంతో మీ ప్రేగులు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ఇది శరీర ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో మీ జీర్ణ క్రియ ఆరోగ్యంగా ఉంటుంది.
బరువు తగ్గడం
ఉపవాసం ఉండటం వల్ల కేలరీలు తగ్గుతాయి. దీంతో మీరు ఈజీగా బరువు తగ్గుతారు. రంజాన్ సమయంలో చాలా మంది లిమిట్‌గా ఫుడ్ తీసుకుంటారు. దీంతో ఈజీగా బరువు తగ్గుతారు. ఎవరికైతే ఎక్కువగా కొవ్వు ఉంటుందో.. వారికి ఉపవాసం తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది.
ఇన్సులిన్ సున్నితత్వం
తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ విడుదల అవుతుంది. దీంతో శరీర ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. దీంతో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి ఈ ఉపవాసం బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
సెల్యులార్ రిపేర్
శరీరంలో పనిచేయని కణలను తొలగిస్తుంది. దీంతో మీరు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే వృద్ధాప్యాన్ని తగ్గించి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాల నుంచి కాపాడుతుంది.
మానసిక ఆరోగ్యం
ఈ ఉపవాసం వల్ల మానసిక ఆరోగ్యం కుదుట పడుతుంది. ఎందుకంటే రోజంతా మీరు ఉపవాసం ఉన్నప్పుడు మెదడు బ్రెయిన్-డిరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ (BDNF) అనే హార్మోన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు.
-
Ramadan 2025: ఈ సారి మన దగ్గర రంజాన్ ప్రారంభం అయ్యేది అప్పుడే.. ఇతర దేశాల్లో ఎప్పుడు అంటే?
-
Ramadan: పవిత్రమైన రంజాన్ ఉపవాసం.. ఈ సమయంలో పాటించాల్సిన నియమాలివే
-
Ramadan: రంజాన్ మాసంలో రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే.. సహూర్‌లో తీసుకోవాల్సినవి ఇవే
-
Ramadan: వచ్చేస్తున్న రంజాన్.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉపవాసం ఆచరించాలంటే?
-
Maha Shivaratri: శివరాత్రికి జాగరణ ఎలా చేస్తే.. పుణ్య ఫలం లభిస్తుందంటే?
-
Maha Shivaratri: ఈ నియమాలు పాటిస్తూ ఉపవాసం ఆచరిస్తే.. పుణ్యమంతా మీదే