DSC: డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షకు వెళ్లే ముందు వీటిని మరిచిపోవద్దు

DSC: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జులై 6వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే ప్రతీ రోజు ఈ పరీక్షలు రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నారు. పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థులకు అధికారులు కొన్ని కీలక సూచనలు చేశారు. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జూన్ 6 వ తేదీ నుంచి జులై 6వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. వీటిని ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా నిర్వహిస్తారు. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలలో కలిపి మొత్తం 154 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి. ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9:30 AM నుంచి 12:00 PM వరకు, మధ్యాహ్నం 2:00 PM నుంచి 4:30 PM వరకు జరుగుతాయి. అయితే ప్రిన్సిపల్, పీజీటీ, పీడీ పోస్టులకు ఉదయం 9:00 AM నుంచి 12:00 PM వరకు 3 గంటల పాటు పరీక్ష ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నైపుణ్య పరీక్ష టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ అభ్యర్థులకు గంటన్నర సమయం కేటాయిస్తారు.
ఇది కూడా చూడండి: ENG vs IND: త్వరలోనే ఇంగ్లాండ్ సిరీస్.. ఫైనల్ జట్టు ఇదే
పరీక్షకు వెళ్లే ముందు తప్పకుండా కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. పరీక్షా కేంద్రానికి ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. కాబట్టి, ముందే చేరుకోవడానికి ప్రయత్నించండి. మీ హాల్‌టికెట్‌లో ఏవైనా తప్పులు ఉంటే ఆధార్ కార్డు తీసుకెళ్లండి. తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, కులం, ఇతర వివరాలు ఉంటే, సంబంధిత గుర్తింపు కార్డు ఆధార్, ఓటరు ఐడీ, పాన్ కార్డు వంటివి పరీక్షా కేంద్రాల దగ్గరకు తీసుకెళ్లాలి. ఒకవేళ హాల్‌టికెట్‌లో మీ ఫొటో లేకపోతే, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి. ఆధార్, ఓటరు ఐడీ, పాన్ కార్డు వంటి గుర్తింపు ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్‌డెస్క్ నంబర్లకు 6281704160, 8121947387, 8125046997, 9398810958, 7995649286, 7995789286, 9963069286, 7013837359. కాల్ చేయాలి. లేదా మెయిల్ ఐడీకి dscgrievances@apschooledu.in అయినా చేయవచ్చు. 16,347 పోస్టులను ఈ మెగా డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వివిధ పోస్టులకు కలిపి మొత్తం 5,77,417 దరఖాస్తులు వచ్చాయి. కొందరు అభ్యర్థులు తమ అర్హతలను బట్టి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.
-
Whatsapp New Feature: వాట్సాప్‌లోకి వచ్చేసిన కొత్త ఫీచర్.. యూజర్ల ప్రైవసీకి అసలు భయపడక్కర్లేదు
-
Anil Ravipudi: సుధీర్‌నే టార్గెట్ చేయమన్నారు.. సంచలన విషయాలు బయట పెట్టిన అనిల్ రావిపూడి
-
Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?
-
Zodiac Signs: త్వరలో జరగనున్న మహా అద్భుతం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం
-
Home loan refinancing: గృహ రుణ రీఫైనాన్సింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలేంటి?
-
Zodiac Signs: ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ మాయం.. ఈ రాశుల వారి పంట పండినట్లే