Credit Card : క్రెడిట్ కార్డ్ హోల్డర్ మరణిస్తే ఆ బకాయిలు ఎవరు కట్టాలి ? అసలు రూల్ ఇదే !

Credit Card : ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులు వాడకం చాలా పెరిగింది. దాదాపు ప్రతి ఒక్కరి జేబులో ఒకటి లేదా రెండు కార్డులు ఉంటున్నాయి. ముఖ్యంగా పెద్ద సిటీల్లో యూత్ క్రెడిట్ కార్డుల కోసం ఎగబడుతున్నారు. ఇవి అవసరమైనప్పుడు బాగా ఉపయోగపడతాయి. కానీ వీటితో పాటు అప్పులు భారం కూడా పెరుగుతుంది. ఒకసారి క్రెడిట్ కార్డులకు అలవాటు పడితే వదిలించుకోవడం కష్టం. ఒకవేళ క్రెడిట్ కార్డు వాడే వ్యక్తి అనుకోకుండా చనిపోతే ఆ అప్పు ఎవరు కట్టాలి? ఈ విషయంలో చట్టం ఏం చెబుతుంది, బ్యాంకుల నియమాలు ఎలా పని చేస్తాయో ఈ వార్తలో తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డు అంటే ఒక ప్లాస్టిక్ కార్డు. ఇది చూడటానికి డెబిట్ కార్డులానే ఉంటుంది. డెబిట్ కార్డుతో మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బును వాడుకుంటారు. కానీ, క్రెడిట్ కార్డుతో మీరు బ్యాంకు నుంచి అప్పు తీసుకొని ఖర్చు చేస్తారు. ఈ అప్పును తర్వాత మీరు బ్యాంకుకు తిరిగి చెల్లించాలి. ఇప్పుడు షాపింగ్, బిల్ పేమెంట్స్, ప్రయాణాలు… ఇలా అన్నింటికీ క్రెడిట్ కార్డుతో చాలా సులువైపోయింది. కానీ, దీన్ని జాగ్రత్తగా వాడకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. అయితే, కష్టకాలంలో క్రెడిట్ కార్డు ఒక సంజీవని లాగా కూడా పని చేస్తుంది. బ్యాంకులు, క్రెడిట్ కార్డ్ కంపెనీలు బిల్లు కట్టడానికి గడువు ఇస్తాయి. ఆ చివరి తేదీలోపు మీరు మొత్తం బిల్లు కట్టేస్తే ఎలాంటి వడ్డీ పడదు. కానీ, ఒకవేళ మీరు గ్రేస్ పీరియడ్ మిస్ చేస్తే, చిన్న అప్పుపై కూడా భారీ వడ్డీ కట్టాల్సి వస్తుంది. అందుకే, క్రెడిట్ కార్డును చాలా తెలివిగా వాడుకోవాలి.
Read Also:Jobs:అదిరిపోయే నోటిఫికేషన్.. జాబ్ వస్తే లైఫ్ సెట్ ఇక
చాలావరకు క్రెడిట్ కార్డులు అన్‌సెక్యూర్డ్ లోన్ల కిందకి వస్తాయి. అంటే, బ్యాంకు మీకు ఈ కార్డును మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్, గతంలో మీరు అప్పులు కట్టిన తీరు ఆధారంగా ఇస్తుంది. దీనికి ఎలాంటి గ్యారెంటీ లేదా ఆస్తిని తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు ఉన్న వ్యక్తి చనిపోతే ఆ అప్పు సాధారణంగా రద్దైపోతుంది. అంటే, ఆ భారం కుటుంబ సభ్యులపై పడదు. క్రెడిట్ కార్డు తిరిగి చెల్లించే బాధ్యత కేవలం కార్డుదారుడిదే.
అయితే, బ్యాంకులు మొదట చనిపోయిన వ్యక్తి ఆస్తిపాస్తుల నుంచి అప్పును వసూలు చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఒకవేళ ఆ వ్యక్తి పేరు మీద ఏదైనా ఆస్తి (ఇల్లు, స్థలం), బ్యాంకు బ్యాలెన్స్, లేదా పెట్టుబడులు ఉంటే, బ్యాంకు చట్టబద్ధంగా వాటి నుంచి తమ డబ్బును తీసుకోవచ్చు. కానీ, చనిపోయిన వ్యక్తి పేరు మీద ఎలాంటి ఆస్తి లేదా డబ్బు లేకపోతే ఆ నష్టాన్ని బ్యాంకు భరిస్తుంది. ఆ సందర్భంలో కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు అప్పు వారిపై పడదు.
Read Also:Amavasya: వెరీ పవర్ ఫుల్ అమావాస్య.. తెలిసో తెలియక ఇలా చేస్తే దరిద్రమే!
సెక్యూర్డ్ క్రెడిట్ కార్డుల విషయంలో మాత్రం రూల్స్ కొంచెం వేరుగా ఉంటాయి. ఈ కార్డులు సాధారణంగా క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నవారికి లేదా స్థిరమైన ఆదాయం లేనివారికి ఇస్తారు. ఇలాంటి క్రెడిట్ కార్డు ఇచ్చే ముందు బ్యాంకు ఏదైనా గ్యారెంటీని అడుగుతుంది. ఉదాహరణకు, ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD).
ఒకవేళ క్రెడిట్ కార్డుదారుడు చనిపోతే, బ్యాంకు ముందుగా ఆ వ్యక్తి పెట్టిన FD నుంచి అప్పును వసూలు చేసుకుంటుంది. FD లో అప్పు కన్నా ఎక్కువ డబ్బు ఉంటే, మిగిలిన మొత్తాన్ని చనిపోయిన వ్యక్తి వారసులకు తిరిగి ఇచ్చేస్తుంది. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులో అప్పు రద్దు కాదు, ఎందుకంటే బ్యాంకు ఇప్పటికే తన డబ్బుకు హామీ తీసుకుని ఉంటుంది. కాబట్టి, సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు తీసుకుంటున్నట్లయితే FD నే బ్యాంకుకు సెక్యూరిటీ అని గుర్తు పెట్టుకోవాలి.
-
Credit Card: క్రెడిట్ కార్డు లిమిట్ తక్కువగా ఉందా.. అయితే ఇలా పెంచుకోండి
-
ChatGPT : ఏఐ మ్యాజిక్.. నెల రోజుల్లోనే రూ.10లక్షల మహిళకున్న అప్పు తీర్చిన చాట్ జీపీటీ
-
Cibil Score: లోన్ తీసుకోకపోయినా సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. కారణమేంటో తెలుసా?
-
Credit Card: క్రెడిట్ కార్డు బిల్‌ను ఈఎంఐగా మార్చితే.. ఏమవుతుందో మీకు తెలుసా?
-
Credit Card: క్రెడిట్ కార్డు ఇన్‌యాక్టివ్‌లో ఉందా? యాక్టివేట్ చేయడం ఎలా?