ChatGPT : ఏఐ మ్యాజిక్.. నెల రోజుల్లోనే రూ.10లక్షల మహిళకున్న అప్పు తీర్చిన చాట్ జీపీటీ

ChatGPT : ప్రస్తుతం ఏఐ ప్రతి రంగంలో దూసుకుపోతుంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రజల అప్పులు కూడా తీరుస్తుంది. ఎలా అని ఆశ్చర్యపోతున్నారా..ఒక అమెరికన్ మహిళ ఏకంగా ChatGPTని తన ఆర్థిక సలహాదారుగా మార్చుకుని తనకున్న 23,000డాలర్ల (రూ.10లక్షల) క్రెడిట్ కార్డు అప్పును తీర్చింది. ఈ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. అమెరికాలోని డెలావేర్‌లో నివసిస్తున్న 35 ఏళ్ల జెన్నిఫర్ అలెన్, ఒక రియల్టర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా పని చేస్తున్నారు. ఆమె తన జీవితంలో డబ్బు విషయంలో ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉన్నట్లు మీడియాతో పేర్కొంది. ఆమెకు ఆర్థిక క్షమశిక్షణ లేకపోవడం, బడ్జెట్ విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల అప్పులు పెరిగిపోయాయని తెలిపారు.
తనకు కూతురు పుట్టిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయి. దీంతో కుంగిపోయిన జెన్నిఫర్ ఫ్యామిలీని నెట్టుకురావడానికి క్రెడిట్ కార్డులపై ఆధారపడ్డారు. వారు లగ్జరీ లైఫ్ గడపలేకపోయినా కేవలం రోజులు గడవడానికే అప్పులు పేరుకుపోయాయని ఆమె వివరించారు. ఈ అప్పులు తనను తెలియకుండానే చుట్టేశాయని అన్నారు. ఆన్‌లైన్‌లో కనిపించే 30 రోజుల ఛాలెంజ్‌ల నుండి స్ఫూర్తి పొందిన జెన్నిఫర్, తన అప్పులను తీర్చడానికి ఒక నెల రోజుల పాటు రోజూ చాట్‌జీపీటీని ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. సైడ్ హజల్స్‌ను ఆలోచించడం దగ్గర నుండి, ఖర్చులకు ఒక క్రమబద్ధత తీసుకురావడం వరకు అన్నీ చాట్‌జీపీటీ సలహాలు తీసుకున్నారు.
Read Also:Pan India Star Prabhas: గొప్ప మనస్సు చాటుకున్న రెబల్ స్టార్.. ఫిష్ వెంకట్‌కు ఆర్థిక సాయం!
ప్రతిరోజు ఏఐ బాట్ జెన్నిఫర్‌కు ఒకే ఒక్క డబ్బు ఆదా చేసే లేదా సంపాదించే పనిని ఇచ్చింది. ఉదాహరణకు, ఒక సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయడం, ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌లో వస్తువులను అమ్మడం, క్లెయిమ్ చేయని నిధుల కోసం వెతకడం, లేదా పాత బ్యాగులు, సోఫాలలో చిల్లర డబ్బు కోసం వెతకడం వంటివి. ఈ చిన్న చిన్న పనులు ఆమెకు 100 డాలర్లకు పైగా సంపాదించి పెట్టాయి. ఈ ఛాలెంజ్‌లో జెన్నిఫర్ సాధించిన అతిపెద్ద విజయం 10,000 డాలర్ల కంటే ఎక్కువ మర్చిపోయిన నిధులను కనిపెట్టింది.
జూన్‌లో జెన్నిఫర్ తన టిక్‌టాక్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. అందులో ఆమె 30 రోజుల ఛాలెంజ్‌ను పూర్తి చేశానని, గత నెలలో సుమారు రూ.10లక్షలు అప్పు చెల్లించానని వెల్లడించారు. అంతేకాకుండా, చాట్‌జీపీటీ ఆమెకు నెలకు 600 డాలర్లు ఆదా చేయడంలో కూడా సహాయపడిందని పేర్కొంది. తనకు అప్పు తీర్చడానికి ముఖ్యంగా చాట్‌జీపీటీ అందించిన సపోర్ట్ కారణమని చెప్పుకొచ్చారు.
Read Also:Karakoram Highway : ప్రపంచంలోనే ఎత్తైన రహదారి.. ప్రకృతి అందాలకు, సాహస యాత్రకు అడ్డా.. ఎక్కడ ఉందంటే ?