ChatGPT: చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్.. అన్ని ఫొటోలు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు
సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో జిబ్లీ ఫొటోలు ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. ఏదైనా ఫొటో చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేస్తే.. జిబ్లీ ట్రెండ్‌లో వాటిని మార్చి పంపిస్తుంది. ఈ ట్రెండ్‌ను ప్రతీ ఒక్కరూ కూడా ఫాలో అయ్యారు. సామాన్య మనుషుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది ఈ ట్రెండ్‌ను ఫాలో అయ్యారు.

ChatGPT: సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో జిబ్లీ ఫొటోలు ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. ఏదైనా ఫొటో చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేస్తే.. జిబ్లీ ట్రెండ్‌లో వాటిని మార్చి పంపిస్తుంది. ఈ ట్రెండ్‌ను ప్రతీ ఒక్కరూ కూడా ఫాలో అయ్యారు. సామాన్య మనుషుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది ఈ ట్రెండ్‌ను ఫాలో అయ్యారు. ఈ ట్రెండ్‌తో ఎక్కువగా చాట్‌జీపీటీని వాడటం మొదలు పెట్టారు. నిజానికి ప్రస్తుతం చాలా మంది చాట్ జీపీటీని వాడుతున్నారు. ఏదో ఒక అవసరానికి దీన్ని ఉపయోగిస్తు్న్నారు. అయితే వినియోగదారుల కోసం చాట్‌జీపీటీ ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. జిబ్లీ ఫొటోలను చాలా మంది చేసుకున్నారు. కానీ ఇవి రోజుకి కొంత లిమిట్ మాత్రమే. దీంతో చాలా మంది రోజుకి రెండు ఫొటోలను మాత్రమే సెట్ చేసుకునేవారు.
చాట్‌జీపీటీ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. లైబ్రరీ అనే కొత్త ఫీచర్‌ను చాట్ జీపీటీ తీసుకొచ్చింది. దీంతో మీరు ఏఐ జనరేటెడ్ చిత్రాలన్నింటినీ కూడా ఒకే చోట సేవ్ చేసుకోవచ్చు. మీరు చాట్‌జీపీటీని ఉపయోగించి ఫొటోలు చేస్తే ఆటోమేటిక్‌గా సేవ్ అవుతుంది. అయితే దీనికి ఎలాంటి ఛార్జీలు కట్టక్కర్లేదు. వినియోగదారులందరికీ కూడా ఇది ఉచితంగా వాడుకోవచ్చు. అయితే ఈ చాట్‌జీపీటీ మొబైల్ యాప్, వెబ్ వెర్షన్ రెండింటిలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ, ప్లస్, ప్రో వినియోగదారులందరికీ కూడా ఇది అందుబాటులో ఉంటుంది. అయితే ఈ చాట్‌జీపీటీ లైబ్రరీ ట్యాబ్‌ను యాక్సెస్ చేయాలి. దీని కోసం ఓపెన్ చేసి సైడ్ బార్‌లో ఎక్స్ ప్లోర్ జీపీటీ కింద లైబ్రరీ అనే ట్యాబ్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే ఆటోమెటిక్‌గా ఆన్ అవుతుంది. మీరు తీసిన ఫొటోలు అన్ని కూడా సేవ్ అవుతాయి.
Read Also: ఈస్టర్‌లో కలర్‌ఫుల్ ఎగ్స్ ఎందుకో మీకు తెలుసా?
ఏఐ చాట్ జీపీటీతో ఒరిజినల్ ఫొటోస్ పెడితే కార్టూన్‌లా చేసి మనకి ఇస్తుంది. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఇవే ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ ఇలా ఏది ఓపెన్ చేసినా కూడా జిబ్లీ ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఏదో సరదాకి వీటిని చేసినా కూడా వీటివల్ల ప్రమాదం పొంచి ఉందని సైబర్ సేఫ్టీ అధికారులు అంటున్నారు. సామాన్య మనుషులు నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా ఈ జిబ్లీ ట్రెండ్‌ను ఫాలో అయ్యి.. వారి ఫొటోలను క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ జిబ్లీ ట్రెండ్ బాగా అయ్యింది.
Read Also: కుజుడు, శని కలయిక.. ఈ రాశుల వారికి పట్టనున్న కుభేరయోగం
ఇదిలా ఉండగా.. జిబ్లీ ట్రెండ్‌ను క్రియేట్ చేయడానికి మీ ఫొటోలను ఏఐ చాట్‌జీపీటీతో చేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో మీ ఫొటోలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి సంఘటనలే జరిగాయి. గతేడాది ఆస్ట్రేలియన్ కంపెనీ ఔటాబాక్స్ డేటా లీక్ కావడంతో సమస్య తలెత్తింది. మొత్తం 1.05 మిలియన్ల మంది ఫేస్ స్కాన్ ఐడెంటిటీ, డ్రైవింగ్ లైసెన్స్‌లు, అడ్రస్ ఫ్రూఫ్‌లు లీక్ అయ్యాయి. హేవ్ ఐ బీన్ ఔటాబాక్స్డ్ అనే సైట్‌లో ఉంచడం వల్ల వారి డేటా లీక్ అయ్యింది. దానికి దీనికి లింక్ ఏంటని మీరు అనుకోవచ్చు. కానీ దీంతో సైబర్ నేరగాళ్లు డీప్ ఫేక్ క్రియేట్ చేసి మిమ్మల్ని బెదిరించవచ్చు
-
Hero Nithin : గూబ పగులుద్ది..హీరో నితిన్ కి సోషల్ మీడియా స్ట్రాంగ్ వార్నింగ్!
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Tamannaah-Vijay Varma: ఆ విషయంలో అండర్‌స్టాడింగ్ కుదరకే.. తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్‌కు కారణమిదే
-
Champions Trophy: దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్.. పాకిస్థాన్‌పై నెట్టంట విమర్శలు
-
Champions Trophy 2025: ఆదాయం రూపాయల్లో.. వ్యయం వందల్లో ఇది పాకిస్థాన్ పరిస్థితి.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
-
IND vs PAK: పాక్ మొండిపట్టు.. చివరకు టోర్నీలో ఐదు రోజులే.. నెట్టింట ట్రోల్ చేస్తున్న మీమర్స్