Beauty: లైగర్ బ్యూటీ ఫిటినెస్ సీక్రెట్ ఇదే
బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతో ఫిట్‌గా ఉండటంతో పాటు అదిరిపోయే లుక్‌లో హాట్‌గా కనిపిస్తుంది. కేవలం సాంప్రదాయ దుస్తులే కాకుండా మోడ్రన్, బికినీ ఇలా అన్ని రకాల దుస్తుల్లో కూడా కనిపిస్తుంది.
Beauty: బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతో ఫిట్‌గా ఉండటంతో పాటు అదిరిపోయే లుక్‌లో హాట్‌గా కనిపిస్తుంది. కేవలం సాంప్రదాయ దుస్తులే కాకుండా మోడ్రన్, బికినీ ఇలా అన్ని రకాల దుస్తుల్లో కూడా కనిపిస్తుంది. అయితే సాధారణంగా ఏ హీరోయిన్లు అయినా కూడా ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఫిట్‌గా యంగ్ లుక్‌లో కనిపించాలని డైట్ ప్లాన్ చేస్తుంటారు. అలాగే జిమ్, యోగా వంటివి చేస్తుంటారు. అన్నింటికంటే ముఖ్యంగా వారికి ఇష్టమైన ఫుడ్‌కి కూడా చాలా దూరంగా ఉంటారు. ఒకవేళ ఏవైనా తిన్నా కూడా దానికి తగ్గట్లుగా ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటారు. అయితే అనన్య పాండే బ్యూటీ, ఫిట్‌నెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో మరి ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: జాబ్‌కి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా.. ఒక్క నిమిషం ఆగండి
అనన్య పాండే ఫిట్‌గా ఉండటానికి పేగులను శుభ్ర పరిచే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటుంది. ఈ విషయాన్ని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. గత కొన్ని రోజుల నుంచి ఆమె ప్రేగు ప్రక్షాళన (గట్ క్లీనింగ్) ఆహారాన్ని తీసుకున్నట్ల స్వయంగా వెల్లడించింది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని ఆమె తెలిపింది. అయితే అనన్య రాత్రిపూట 7 గంటలకు డిన్నర్ కంప్లీట్ చేస్తుంది. ఆ తర్వాత మళ్లీ పూర్తిగా ఏం తినదట. ఎంతగా ఆకలి వేసినా, తినాలనిపించినా కూడా అనన్య పూర్తిగా తినదు. ఇలా డైట్ పాటించడం వల్ల ఫిట్‌గా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని అనన్య భావిస్తోంది. ఈ క్రమంలోనే ఎంత కష్టమైనా కూడా ఈ డైట్‌ను పాటిస్తోంది. ఇందులో కూడా పోషకాలు ఉండే వాటిని ఎక్కువగా అనన్య తీసుకుంటుంది. అరటి పండ్లు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆస్పరాగస్, చికోరీ రూట్స్, ఓట్స్, ఆపిల్స్, లీక్స్, పెరుగు, మిస్సో, బార్లీ వంటి వాటిని అనన్య ఎక్కువగా తీసుకుంటుంది. వీటిని ఎంత ఎక్కువగా తిన్నా కూడా ఫిట్‌గా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా యంగ్ లుక్‌లో కనిపిస్తారని అనన్య అంటోంది.
Read Also: మాల్దీవులకు అర్థమైంది.. తుర్కియోకు అర్థమవుతోంది..భారత్ తో గెలుక్కుంటే అంతే సంగతులు!
అనన్య పాండే పేగు ప్రక్షాళన ఆహారం అంటే.. ఇది ఏంటని చాలా మందికి డౌట్ వచ్చింది. గట్ ఆరోగ్యంగా ఉండటానికి, ప్రీబయోటిక్స్ వంటివి తీసుకోవడాన్ని పేగు ప్రక్షాళన అంటారు. సలాడ్లు, పండ్లు, పులియబెట్టిన ఆహారాలు తినడం వల్ల ఎక్కువ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. వీటిని తీసుకోవడంతో పాటు వ్యాయామం చేస్తూ.. పుష్కలంగా ఆహారం తీసుకోవడం వల్ల ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు.
-
Coffee: కాఫీ ఆరోగ్యానికే కాదు.. తలకు కూడా మంచిదే!
-
Yellow: ఎల్లో కలర్ ఫేవరెట్.. వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే?
-
Goodbye to Your Job: జాబ్‌కి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా.. ఒక్క నిమిషం ఆగండి
-
Masala Soda: ఫస్ట్ టైమ్ మసాలా సోడా.. బ్రిటిష్ అమ్మాయి ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూస్తే నవ్వొస్తుంది
-
Joint Problems: ఉప్పుతో ఇలా చేస్తే కీళ్ల సమస్యలన్నీ పరార్
-
Weight Lose: వెయిట్ తగ్గాలని అధికంగా రన్నింగ్ చేస్తే ఎంత ప్రమాదమో మీకు తెలుసా?