Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Spiritual News »
  • Chanakya Niti Says That One Should Not Stay In Four Places

Chanakyaniti: ఎలాంటి ప్రదేశాల్లో ఉండకూడదు.. చాణక్య నీతి ఏం చెబుతోంది?

Chanakyaniti: ఎలాంటి ప్రదేశాల్లో ఉండకూడదు.. చాణక్య నీతి ఏం చెబుతోంది?
  • Edited By: kusuma,
  • Updated on June 11, 2025 / 03:15 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Chanakyaniti: ఆచార్య చాణక్యుడు తన అద్భుతమైన జ్ఞానంతో అనేక నీతి సూత్రాలను బోధించాడు. ఆయన రచించిన ‘చాణక్య నీతి’ గ్రంథం ఇప్పటికీ ఎంతో మందికి మార్గదర్శకంగా నిలుస్తోంది. జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను అర్థం చేసుకుని వాటి నుంచి బయటపడటానికి ఈ చాణక్య నీతి బాగా సహాయపడుతుంది. అయితే జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా కొన్ని ప్రదేశాల్లో ఉండకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. మరి ఆ ప్రదేశాల్లో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

గౌరవం లేని చోట

ఒక వ్యక్తికి గౌరవం లభించని చోట ఉండకూడదని చాణక్య నీతి చెబుతోంది. ఎవరైతే గౌరవిస్తారో వారి దగ్గరే ఉండాలని అంటున్నారు. ఒక ప్రదేశంలో మీకు గౌరవం లభించకుండా నిరంతరం అవమానాలు ఎదురైతే, ఆ ప్రదేశాన్ని వెంటనే వదిలివేయాలని చాణక్య నీతి చెబుతోంది. అలాంటి చోట జీవించడం మరణంతో సమానమని అంటున్నారు. గౌరవం లేని చోట ఆత్మగౌరవం దెబ్బతింటుంది. మానసిక ప్రశాంతత ఉండదు. మనిషి గౌరవంగా జీవించగలగాలి. అప్పుడే అతనికి విలువ ఉంటుంది. నిరంతరం అవమానాలు ఉంటే అది మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుందని చాణక్య నీతి చెబుతోంది.

ఆదాయం లేని చోట

ఆదాయం లేని చోట కూడా జీవించకూడదు. సంపాదించకపోతే ఇంట్లో వాళ్లు కూడా విలువ ఇవ్వరు. మనిషి బ్రతకడానికి డబ్బు చాలా అవసరం. ఆదాయం లేకుండా జీవితం సాధ్యం కాదు. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కనీస అవసరాలు తీర్చుకోవాలంటే డబ్బు ఉండాలి. అలాంటి చోట నివసిస్తే, మీరు బ్రతకడానికి ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. ఇతరులపై ఆధారపడితే ఆత్మగౌరవాన్ని కోల్పోతారు. మాటలు పడాల్సి వస్తుందని చాణక్యుడు చెబుతున్నాడు. కాబట్టి మీకు సరైన ఉద్యోగ, వ్యాపార అవకాశాలు లేని ప్రాంతంలో ఉండకుండా, మెరుగైన ఆదాయ అవకాశాలు ఉన్న చోట ఉండటం మంచిది.

బంధువులు లేదా స్నేహితులు లేని చోట

బంధువులు లేదా స్నేహితులు లేని చోటుని వదిలి వెళ్లాలని చాణక్యుడు తన నీతి సూత్రాల్లో పేర్కొన్నాడు. మానవులకు సామాజిక సంబంధాలు చాలా అవసరం. కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచే వారు, సహాయం చేసేవారు లేకపోతే జీవితం చాలా కష్టమవుతుంది. అలాంటి చోట మీరు ఏదైనా సమస్యలో చిక్కుకుంటే సహాయం చేయడానికి ఎవరూ ఉండరు. ఇది మరణం కంటే దారుణమని చాణక్య నీతి చెబుతోంది. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వారు లేకపోతే, సమస్యల నుంచి బయటపడటం అసాధ్యమని చాణక్య నీతి చెబుతోంది. మానసికంగా సమస్యలు ఎదుర్కొ్ంటారని తెలిపాడు.

విద్య నేర్చుకునే అవకాశం లేని చోట

విద్య నేర్చుకునే అవకాశం లేని చోట కూడా జీవించకూడదు. విద్య అనేది మనిషి జీవితంలో పురోగతికి, జ్ఞానానికి ప్రాథమిక ఆధారం. పాఠశాలలు, కళాశాలలు లేదా ఇతర విద్యా సౌకర్యాలు లేని చోట నివసిస్తే మీ భవిష్యత్తు దెబ్బతింటుంది. జ్ఞానం, విద్య లేకుండా మనిషి జీవితంలో ఎదగడం కష్టం. విద్య లేని జీవితం మరణం కంటే దారుణమని చాణక్యుడు బోధించాడు. విద్య వ్యక్తికి అవగాహనను, నైపుణ్యాలను, మంచి చెడులను వివేచించే శక్తిని ఇస్తుంది. ఇది లేకుండా మనిషి అజ్ఞానంలో ఉంటాడు. తనను తాను అభివృద్ధి చేసుకోలేడు. కాబట్టి, విద్యావకాశాలు లేని ప్రాంతాలకు దూరంగా ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.

ఇది కూడా చూడండి: Vitamin B12 : విటమిన్ బి12 కేవలం నాన్ వెజ్ లోనే ఉంటుందా..ఎక్స్ పర్ట్స్ ఏం చెబుతున్నారంటే ?

 

Tag

  • Chanakyaniti
  • Earn
  • Knowledge
  • Money
  • Respect
Related News
  • Youtube new rules: యూట్యూబర్లకు షాకింగ్ న్యూస్.. ఈ రూల్స్ పాటిస్తేనే డబ్బులు లేకపోతే కట్!

  • Setting Limits: హద్దుల్లో ఉంచండి.. మొహమాటానికి పోతే ఇబ్బందులు తప్పవు

  • Ants: ఇంట్లోకి చీమలు అధికంగా వస్తుంటే.. ఇంత అదృష్టమా!

  • Mirror: ఇంట్లో ఇక్కడ అద్దం పెడితే.. ఇళ్లంతా డబ్బు మయం

  • Andhra Pradesh: తల్లికి వందనం రూ.13 వేలు.. మరి మిగతా రూ.2 వేల పరిస్థితి ఏంటి?

  • Money: రూ.5 నోట్‌తో రూ.6 లక్షలు.. ఎలా సంపాదించవచ్చు అంటే?

Latest Photo Gallery
  • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us