Kidney Problems : రాత్రిపూట పదే పదే మూత్రానికి వెళ్తున్నారా? అయితే ఈ వ్యాధి సంకేతాలు కావొచ్చు

Kidney Problems : రాత్రి పూట పదే పదే మూత్రానికి వెళ్ళడం అనేది చాలామందికి ఉండే ఒక కామన్ ప్రాబ్లమ్. ఇది ముసలి వాళ్ళకే కాదు, పిల్లలు, యువకుల్లో కూడా ఉంటుంది. చాలాసార్లు మనం దీన్ని ఎక్కువ నీళ్ళు తాగాం కదా అందుకే ఇలా అవుతుందని పట్టించుకోం. కానీ, కొన్నిసార్లు ఇది మన శరీరంలో దాగి ఉన్న ఏదో ఒక వ్యాధికి సంకేతం కూడా కావచ్చు. రాత్రి పూట ఎక్కువగా మూత్రానికి వెళ్ళడానికి కొన్ని కారణాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ప్రముఖ వైద్యులు తెలిపిన ప్రకారం.. మన శరీరంలోంచి విష పదార్థాలను, ఎక్కువ నీటిని బయటికి పంపడమే కిడ్నీల ముఖ్య పని. కిడ్నీలు ఏదైనా కారణం వల్ల బలహీనపడినా లేదా జబ్బు పడినా, శరీరంలో నీరు, ఉప్పు బ్యాలెన్స్ దెబ్బతింటుంది. దీనివల్ల రాత్రిపూట పదే పదే మూత్రానికి వెళ్ళాల్సి వస్తుంది. డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం, ఎవరైనా రాత్రి పూట రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు మూత్రానికి లేస్తే, అది కిడ్నీ సంబంధిత జబ్బుకు సంకేతం కావచ్చు.
మూత్రంలో నురుగు వచ్చినా, రక్తం వచ్చినా, ఒంట్లో వాపు వచ్చినా, అలసటగా అనిపించినా, ఆకలి తగ్గినా.. ఇలాంటి లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. డయాబెటిస్ ఉన్న వాళ్ళలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు, శరీరం ఆ ఎక్కువ షుగర్‌ను మూత్రం ద్వారా బయటికి పంపించడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల పదే పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి వాళ్ళకు పదే పదే దాహం వేయడం, బరువు తగ్గిపోవడం లేదా అలసటగా అనిపించడం లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఈ లక్షణాలు ఉంటే వెంటనే బ్లడ్ షుగర్ చెక్ చేయించుకొని డాక్టర్‌ను కలవాలి.
Read Also:Recharge Plan : జియో, ఎయిర్టెల్ కొత్త ప్లాన్.. గంటల లెక్కన ఇంటర్నెట్ డేటా?
హై బీపీ ఉన్నవాళ్ళు ఆహారంలో ఎక్కువ ఉప్పు తింటే, ఆ ఉప్పు పగటిపూట శరీరం నుంచి పూర్తిగా బయటికి వెళ్ళదు. దాంతో రాత్రిపూట మూత్రం ద్వారా ఆ ఎక్కువ ఉప్పు బయటికి వెళ్తుంది. ఈ కారణం వల్ల హై బీపీ ఉన్న వాళ్ళకు రాత్రిపూట పదే పదే మూత్రానికి వెళ్ళే సమస్య రావచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళలో, వృద్ధులలో రాత్రిపూట పదే పదే మూత్రానికి వెళ్ళడానికి ఒక పెద్ద కారణం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) అంటే, మూత్ర మార్గంలో ఇన్ఫెక్షన్ రావడం. ఈ సమస్య ఉంటే మూత్రం పోసేటప్పుడు మంట, నొప్పి, లేదా దుర్వాసన కూడా రావచ్చు.
ముసలి మగవాళ్ళలో ప్రోస్టేట్ గ్రంథి పెరిగినప్పుడు కూడా రాత్రిపూట పదే పదే మూత్రానికి వెళ్ళే సమస్య రావచ్చు. ఇందులో మూత్రం ఆగి ఆగి రావడం, ఒకేసారి పూర్తిగా రాకపోవడం లేదా సన్నటి ధారగా రావడం లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. గర్భంతో ఉన్న మహిళలు రాత్రిపూట పదే పదే మూత్రానికి వెళ్లే సమస్యను ఎదుర్కోంటారు. ఇది గర్భధారణ సమయంలో శరీరంలో జరిగే మార్పుల వల్ల సాధారణంగా జరుగుతుంది.
Read Also:Phone Safety : ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..మీ ఫోన్ బాంబులా పేలొచ్చు!
కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా పదే పదే మూత్రానికి వెళ్ళే సమస్య రావచ్చు. కాబట్టి, ఏదైనా మందులు వాడేటప్పుడు డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే వాడాలి. రాత్రిపూట పదే పదే మూత్రానికి వెళ్లడంతో పాటు, కొన్ని ఇతర లక్షణాలు కూడా ఉంటే వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
-
Isn’t it the real ORS: వామ్మో.. ఇది అసలైన ఓఆర్ఎస్ కాదా? మరేం కొనాలి?
-
Periods coming late: పీరియడ్స్ లేట్ గా వస్తున్నాయా? రక్తస్రావం ఎక్కువ అవుతుందా?
-
Health Tips: ఈ చింతకాయ తింటే.. నూరేళ్లు ఆరోగ్యం పక్కా
-
How Many Times Eat a Day: మూడు సార్లు కాదు.. రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తే ఆరోగ్యమంటే?
-
Urinary Infection : మూత్రం నుంచి దుర్వాసన వస్తుందా? ఈ 7 వ్యాధులకు సంకేతం కావచ్చు!
-
Covid Cover in Health Insurance: కరోనా మళ్లీ పెరిగింది.. మీ హెల్త్ ఇన్సూరెన్స్‌లో కోవిడ్ కవర్ ఉందో లేదో తెలుసుకోండి