Isn’t it the real ORS: వామ్మో.. ఇది అసలైన ఓఆర్ఎస్ కాదా? మరేం కొనాలి?
Isn't it the real ORS: కిరాణం షాపుల్లో లేదా మెడికల్ షాపుల్లో అందుబాటులో ఉన్న ఓఆర్ఎస్ ను కొనుగోలు చేస్తారు. అయితే ఇక్కడ చాలామంది గుర్తింపు లేని, నకిలీ ఓ ఆర్ ఎస్ ను కొనుగోలు చేసి విరోచనాల బారిన పడుతున్నారు. అసలు డిహైడ్రేషన్కు గురైన సమయంలో ఓఆర్ఎస్ ను తాగవచ్చా?

Isn’t it the real ORS: ప్రస్తుతం వేసవికాలం పూర్తయినట్లే తెలుస్తోంది. కానీ ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో చాలామంది డిహైడ్రేషన్కు గురవుతున్నారు. ఏదో ఒక పని కోసం బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి రాగానే అస్వస్థకు గురవుతున్నారు. శరీరంలో సరైన గ్లూకోస్ తో పాటు అవసరమైన నీరు లేకపోవడంతోనే ఈ రకంగా సమస్యలు వస్తూ ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే డిహైడ్రేషన్కు గురైన తర్వాత చాలామంది ORS తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కిరాణం షాపుల్లో లేదా మెడికల్ షాపుల్లో అందుబాటులో ఉన్న ఓఆర్ఎస్ ను కొనుగోలు చేస్తారు. అయితే ఇక్కడ చాలామంది గుర్తింపు లేని, నకిలీ ఓ ఆర్ ఎస్ ను కొనుగోలు చేసి విరోచనాల బారిన పడుతున్నారు. అసలు డిహైడ్రేషన్కు గురైన సమయంలో ఓఆర్ఎస్ ను తాగవచ్చా? ఎలాంటి ఓఆర్ఎస్ ను కొనుగోలు చేయాలి?
డిహైడ్రేషన్ కు గురైన తర్వాత చాలామంది వైద్యులు సూచించిన ప్రకారం కొబ్బరినీళ్లు లేదా మజ్జిగ వంటివి తీసుకోవాలని చెబుతూ ఉంటారు. కానీ కొందరు ఓఆర్ఎస్ ను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఓ ఆర్ ఎస్ ప్రస్తుతం మార్కెట్లో నకిలీవే అందుబాటులో ఉన్నాయి. ఓ ఆర్ ఎస్ అని పేరుతో ఉన్నవి అన్నీ అసలైన ఓఆర్ఎస్ లు కాదని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. కేవలం WHO గుర్తింపు ఉన్న వాటిని మాత్రమే కొనుగోలు చేయాలని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం యాపిల్ పండు సింబల్ తో ఉన్న ఓ కంపెనీ ఓఆర్ఎస్ ను మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తోంది. వాస్తవానికి ఇది అసలైన ఓఆర్ఎస్ కాదని ప్యాక్ చేసిన డబ్బా పైనే చిన్న అక్షరాలతో ఉంటుంది. కానీ చాలామంది దీనిని గుర్తించకుండా దానిని తాగేస్తున్నారు. అయితే డిహైడ్రేషన్కు గురైన తర్వాత వీటిని తీసుకోవడం వల్ల విరోచనాలతో పాటు అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని కొందరు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read: Periods coming late: పీరియడ్స్ లేట్ గా వస్తున్నాయా? రక్తస్రావం ఎక్కువ అవుతుందా?
వాస్తవానికి 2022లోని ఇలాంటి డ్రింక్స్ కు అనుమతి లేదని ఉత్తర్వులు వచ్చాయి. కానీ ఆ తర్వాత దీనిని మళ్లీ మార్కెట్లోకి తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. అయితే ఈ ప్యాక్ పై డిస్క్లైమేర్ పేరుతో చిన్న అక్షరాలలో హెచ్చరికలు జారీ జారీ చేస్తున్నారు. అయితే చాలామంది వినియోగదారులు దీనిని గుర్తించకుండా ఈ ఓఆర్ఎస్ ను తీసుకుంటున్నారు. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
వాస్తవానికి డిహైడ్రేషన్కు గురైన సమయంలో సహజ ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని అంటున్నారు. వీటిలో మజ్జిగతో పాటు కొబ్బరి నీళ్లు ఎక్కువగా ఉండాలని అంటున్నారు. అయితే కొబ్బరి నీళ్లు కూడా షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటేనే తీసుకోవాలని చెబుతున్నారు. డిహైడ్రేషన్కు గురైన సమయంలో షుగర్ తో కలిపిన వాటర్ను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని చెబుతున్నారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో అమ్మే ఓఆర్ఎస్ లు ఎక్కువగా షుగర్ కంటెంట్ కలిగినవేనని చెబుతున్నారు. అందువల్ల ఇప్పటికైనా ఓఆర్ఎస్ ను కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొంటున్నారు.
View this post on Instagram
-
Periods coming late: పీరియడ్స్ లేట్ గా వస్తున్నాయా? రక్తస్రావం ఎక్కువ అవుతుందా?
-
Health Tips: ఈ చింతకాయ తింటే.. నూరేళ్లు ఆరోగ్యం పక్కా
-
How Many Times Eat a Day: మూడు సార్లు కాదు.. రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తే ఆరోగ్యమంటే?
-
Covid Cover in Health Insurance: కరోనా మళ్లీ పెరిగింది.. మీ హెల్త్ ఇన్సూరెన్స్‌లో కోవిడ్ కవర్ ఉందో లేదో తెలుసుకోండి
-
Covid 19: మీ కారులో ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలాన్ పడకుండానే కాదు.. కరోనా నుంచి సేఫ్!
-
Idli and Dosa: ఇడ్లీ, దోస విషయంలో ఈ మిస్టేక్స్ చేస్తున్నారా.. అంతే సంగతులు