Covid 19: మీ కారులో ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలాన్ పడకుండానే కాదు.. కరోనా నుంచి సేఫ్!
Covid 19: రోజూ కారులో ప్రయాణించే వారైతే కరోనా నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Covid 19: కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య దాదాపు 1000కి చేరింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రోజూ కారులో ప్రయాణించే వారైతే కరోనా నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం చలాన్ పడకుండా చూసుకోవడం కాదు.. మీ ఆరోగ్యం కూడా ముఖ్యమని గుర్తుంచుకోవాలి.
కారులోనూ మాస్క్ ధరించడం తప్పనిసరి
కారులో ప్రయాణించేటప్పుడు మాస్క్ ధరించడం చాలా ముఖ్యం. మీరు కారు లోపల ఉన్నప్పటికీ మాస్క్ ధరించి ఉండాలి. అలవాటు ప్రకారం.. మనలో చాలా మంది కారులో కూర్చోగానే మాస్క్‌ను తీసి డ్యాష్‌బోర్డ్‌పై పెడతారు. కానీ కరోనా వైరస్ ఉపరితలాల (సర్ఫేసెస్) నుంచి కూడా శరీరంలోకి ప్రవేశిస్తుందన్న సంగతి మర్చిపోకూడదు. కాబట్టి, కారులో ఏ సర్పేసెస్ లేదా టచ్ పాయింట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
Also Read: Organ Donation : త్యాగానికి హద్దుల్లేవ్.. 66 ఏళ్ల వయసులో కొడుకుకు రెండుసార్లు ప్రాణదానం చేసిన తల్లి
శుభ్రం చేయాల్సిన ముఖ్యమైన టచ్ పాయింట్స్
కారులో ప్రయాణించేటప్పుడు ముందుగా బయటి భాగంలోని కొన్ని టచ్ పాయింట్లను శానిటైజ్ చేయాలి. వీటిలో ముఖ్యమైనవి: డోర్ హ్యాండిల్స్, బూట్ స్పేస్ హ్యాండిల్, సైడ్ మిర్రర్లు, డోర్ ఫ్రేమ్‌లు. ఈ ప్రదేశాలను కారును బయటి నుంచి ఎక్కువగా తాకుతారు. కాబట్టి కరోనా సమయంలో ఈ ప్రాంతాలను శుభ్రం చేయడంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.
కారు లోపలి భాగంలో శానిటైజ్ చేయాల్సిన ప్రదేశాలు
కారు లోపలి భాగంలోకి ఎంట్రీ చేసేందుకు ముందే చేతులను శానిటైజ్ చేసుకుని కారులోకి ప్రవేశించాలి. కారులోకి ప్రవేశించిన వెంటనే మళ్ళీ మీ చేతులను శానిటైజ్ చేసుకోవాలి.
అంతేకాకుండా, ఈ కింది టచ్ పాయింట్లను తప్పకుండా శానిటైజ్ చేయాలి. స్టీరింగ్ వీల్, గేర్ స్టిక్, హ్యాండ్‌బ్రేక్, డోర్ హ్యాండిల్స్, మిర్రర్ బటన్స్, రేడియో,, ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్, స్టీరింగ్ కంట్రోల్ ప్యానెల్, ఎల్బో రెస్ట్, సీట్ పొజిషన్ కంట్రోల్స్, ఏసీ సెట్టింగ్స్, డోర్ ఫ్రేమ్, రియర్‌వ్యూ కెమెరా, సీట్ బెల్ట్ బకిల్స్
Also Read: Magnesium Deficiency : కండరాల బలహీనత, ఆస్తమాకు ఈ 5 ఆహారాలతో చెక్ పెట్టేయండి
కారులో తీసుకోవాల్సిన అదనపు జాగ్రత్తలు
కరోనా నుంచి రక్షించుకోవడానికి మీ కారులో ఎల్లప్పుడూ శానిటైజర్‌ను ఉంచుకోవాలి. వీలైతే, డ్యాష్‌బోర్డ్ స్పేస్‌లో ఒకటి లేదా రెండు అదనపు ఫ్రెష్ మాస్క్‌లను కూడా ఉంచుకోవాలి. అంతేకాదు, కారు లోపలి భాగాన్ని ఎప్పటికప్పుడు వ్యాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయాలి. అలాగే, వేలెట్ పార్కింగ్ సర్వీస్ (కారును వేరే వాళ్ళు పార్క్ చేయడం) తీసుకోవడం లేదా అనవసరంగా ఇతరులు మీ కారు టచ్ పాయింట్లను తాకకుండా చూసుకోవడం మంచిది. మీ ఆరోగ్యం, మీ కుటుంబ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉన్నాయి.
-
Railway Track Car Driving: తప్ప తాగి రైల్వే ట్రాక్ ఎక్కిన యువతి.. కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు!
-
Rules for Wearing Tulsi Mala: తులసి మాల ధరించే ముందే ఇవి తెలుసుకోండి. తెలియక ఈ తప్పులు చేస్తే చాలా ఇబ్బందుల్లో పడతారు?
-
Two Mistakes That Man Makes: మనిషి చేసే రెండు తప్పులు ఇవే..
-
PhonePe and Google Pay: ఫోన్ పే, గూగుల్ పేలో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా?
-
Shepherds Protest: ఇదేం నిరసనయ్యా సామీ.. మేమెప్పుడూ చూడలే..
-
Kidney Problems : రాత్రిపూట పదే పదే మూత్రానికి వెళ్తున్నారా? అయితే ఈ వ్యాధి సంకేతాలు కావొచ్చు