NASA: అండర్ గ్రాడ్యుయేట్స్ ఇది మీకోసమే.. నాసాలో ఇంటర్నెషిప్ ప్రోగ్రామ్.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

NASA:
డిగ్రీ చదువుతున్న చాలా మంది ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు. ఏ రంగంలో అయినా ఉద్యోగంలో జాయిన్ కావాలంటే కొన్ని కంపెనీలు ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నాయి. దీంతో డిగ్రీ పూర్తి చేసిన వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాలు కాకపోయినా కూడా ఇంటర్నెషిప్ కోసం అయినా కూడా ట్రై చేస్తున్నారు. ఇలాంటి వారికి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) గుడ్ న్యూస్ తెలిపింది. పెయిడ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. దీనికి అండర్ గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకోవచ్చు. ఈ ఇంటర్నెషిప్‌కి అమెరికా పౌరులు మాత్రమే కాకుండా విదేశీ పౌరులు కూడా అప్లై చేసుకోవచ్చు. నాసా ఆఫీస్ స్టెమ్ ఎంగేజ్మెంట్‌లో హై స్కూల్, అండర్ గ్రాడ్యయేట్లు ఈ పెయిడ్ ఇంటర్నెషిప్‌లకు అర్హులు. ఏడాదికి రెండు సార్లు దీన్ని నాసా రిలీజ్ చేస్తుంటుంది. ఈ ఇంటర్నెషిప్ ప్రోగ్రామ్‌కు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, నాన్ ఇంజనీరింగ్ రంగాల వారు అర్హులు. ఈ ఇంటర్నెషిప్ ప్రోగ్రామ్‌లో నాసా శాస్త్రవేత్తలకు విద్యార్థులు సహాయపడే అవకాశం ఉంటుంది. అయితే దీనికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నాసా ఏడాదిలో రెండు సార్లు రిలీజ్ చేస్తుంటుంది. సమ్మర్ ఇంటర్న్ షిప్, ఫాల్ ఇంటర్న్ షిప్ అని రెండు ఉంటాయి. ఈ రెండింటికి కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే వీటిలో సమ్మర ఇంటర్న్‌షిప్‌కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 28, 2025. నాసా ఫాల్ 2025 ఇంటర్న్ షిప్‌కు అప్లే చేసుకోవడానికి మే 16 చివరి తేదీ.
ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తూ చేసుకునే విద్యార్థులకు తప్పకుండా అమెరికా పౌరసత్వం ఉండాలి. నాసా ఒస్టెమ్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్‌కు అప్లై చేసుకోవాలంటే.. హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ వారు చేసుకోవచ్చు. అయితే ఈ ప్రోగ్రామ్‌కు అమెరికా వాళ్లు మాత్రమే కాకుండా విదేశీ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. నాసా అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. వీటిలో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్ చేస్తే భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుంది. విద్యార్థులు కెరీర్ విషయంలో ఇది తొలిమెట్టుగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు స్కూల్ స్టేజ్ నుంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంటే వారికి భవిష్యత్తులో కెరీర్ మీద కాస్త ఇంట్రెస్ట్ ఉంటుంది. చదువుపై కూడా ఆసక్తి పెరుగుతుంది. భవిష్యత్తులో ఏం చేయాలనే ఒక క్లారిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇంటర్నెషిప్ ప్రోగ్రామ్‌లకు పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది.
-
Trump Warns: ఇప్పుడు వదిలిపోండని.. అమెరికాలో ఉంటున్న విదేశీయులకు ట్రంప్ వార్నింగ్
-
Donald Trump : వీటిని ఎల్లప్పుడూ కూడా క్యారీ చేయాల్సిందే.. ట్రంప్ న్యూ రూల్
-
Nasa: నాసాలో చదువుకోవడానికి అర్హతలివే
-
Astronaut: మహిళలకు అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే?
-
Sunita Williams: సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలికిన డాల్ఫిన్లు.. వీడియో చూసారా?
-
Sunita Williams: సునీతా విలియమ్స్ భువిపై రావడానికి ఎన్ని కోట్లు ఖర్చు అయ్యిందంటే?