AI Skills : చదువులో టాపర్.. అయినా ఉద్యోగం రాలేదు.. చదువు కంటే ఇవే ముఖ్యమంటున్న నిపుణులు

AI Skills : ఈ రోజుల్లో ఎంత చదువుకున్నా, ఎన్ని డిగ్రీలున్నా, ఎంత మంచి మార్కులు వచ్చినా ఉద్యోగం దొరకడం కష్టంగా మారిందని చాలా మంది యువత ఆందోళన పడుతున్నారు. కేవలం డిగ్రీ మార్కులతోనే కాదు, మనకు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి.. ప్రాక్టికల్‌గా ఎంత చేయగలం అనేది చాలా ముఖ్యమని ఇప్పుడు స్పష్టమవుతోంది. “చదువులో టాపర్ అయినా ఉద్యోగం కష్టం” అనే వాస్తవం ఎందరో విద్యార్థుల జీవితాల్లో ప్రస్తుతం కనిపిస్తోంది.
హన్స్‌రాజ్ కాలేజ్‌లో B.A. (Hons.) చదువుతున్న బిస్మా ఫరీద్ అనే అమ్మాయి లింక్డిన్లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె చదువులో ఎప్పుడూ టాపర్‌గా ఉన్నా, ఒక ఇంటర్న్‌షిప్ కూడా దొరకలేదని తన బాధను వ్యక్తం చేసింది. ఆమెకు ఎన్నో సర్టిఫికెట్లు, మెడల్స్, ట్రోఫీలు ఉన్నా, వాటితో ఇంటర్న్‌షిప్ సాధించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. మొదటి సంవత్సరం కూడా టాప్ మార్కులతో పాస్ అయిన ఆమె, కంపెనీలు మార్కుల కంటే నైపుణ్యాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని గ్రహించి ఆశ్చర్యపోయింది. బిస్మా లాంటి టాపర్లకు ఓవర్-క్వాలిఫికేషన్ కూడా ఒక కారణం కావచ్చు. ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలకు టాపర్లను నియమించుకోవడానికి కంపెనీలు వెనుకాడతాయి. ఎందుకంటే, వారు త్వరగానే మంచి అవకాశాల కోసం వెళ్తారని భయం ఉంటుంది.
Read Also:The Raja Saab: ‘ది రాజా సాబ్’ ప్రభాస్ మూవీ సెట్స్ చూశారా.. ఎంత అద్భుతంగా ఉన్నాయో!
గతంలో మంచి మార్కులు వస్తే చాలు, ఉద్యోగం గ్యారెంటీ అనే భావన ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. కంపెనీలు కేవలం మార్కులను మాత్రమే చూడట్లేదు. వారికి ప్రాక్టికల్ స్కిల్స్, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే కెపాసిటీ, టీంతో కలిసి పని చేసే గుణం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి కావాలి. మీరు చదివిన పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని నిజ జీవితంలో ఎలా అన్వయించగలరనేదే ఇప్పుడు కీలకం. ఉదాహరణకు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి కేవలం కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉన్నవారు కాదు, కోడింగ్‌లో నైపుణ్యం ఉన్నవారు, ప్రాజెక్టులు చేసినవారు కావాలి.
ప్రస్తుత ఉద్యోగ మార్కెట్లో టెక్నాలజీ చాలా వేగంగా మారుతోంది. కొత్త టెక్నాలజీలు, కొత్త పద్ధతులు ప్రతిరోజూ వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు AI టూల్స్ వాడడం తెలిసి ఉండాలని కోరుకుంటున్నాయి. కేవలం మార్కులు ఎక్కువ ఉన్నంత మాత్రాన, ఈ కొత్త టెక్నాలజీలను నేర్చుకోకపోతే ఉద్యోగాలు దొరకడం కష్టమవుతుంది.
Read Also:Nail Cutter Hacks : నెయిల్ కట్టర్ వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా.. ఇప్పటి వరకు తెలియదు
కొన్నిసార్లు టాపర్లకు కూడా ఉద్యోగాలు దొరకడం కష్టమవుతుంది. ఎందుకంటే, కంపెనీలు టాపర్లను ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలకు తీసుకుంటే, వారు త్వరగానే మంచి అవకాశాల కోసం వెళ్లిపోతారని భావిస్తున్నాయి. అందుకే, కొన్ని కంపెనీలు ఎక్స్ పీరియన్స్ ఉన్నవారికో లేదా క్రియేటివ్ స్కిల్స్ ఉన్నవారికో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. ఇలాంటి పరిస్థితిలో విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా, తమ స్కిల్స్ కూడా పెంచుకోవాలి.
కేవలం బుక్స్ చదవడం కాకుండా, చిన్న చిన్న ప్రాజెక్టులు చేయడం, ఇంటర్న్‌షిప్‌లు చేయడం, వర్క్‌షాప్‌లలో పాల్గొని ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. కమ్యూనికేషన్, లీడర్షిప్, సమస్యలను పరిష్కరించడం, టీంతో కలిసి పనిచేయడం వంటి నైపుణ్యాలు చాలా అవసరం. ముఖ్యంగా AI, డేటా సైన్స్ వంటివి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఆన్లైన్ కోర్సులు, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ పూర్తి చేయాలి.
-
Dangerous Video : వీడిని బొక్కలో వేసి తుక్కుతుక్కుగా కొట్టాలి.. రెండేళ్ల చిన్నారితో బంగీ జంప్ ఏంట్రా
-
Lychee Momos : లిచీ పండ్లతో మోమోస్ తయారీ.. తిన్నోడి పరిస్థితి ఎలా ఉందో మరి ?
-
Viral Video : మిస్ అయితే యముడికి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందే.. లారీ కింద పడకేంట్రా బాబు
-
Viral Video : ఎలా వస్తాయిరా ఇలాంటి ఐడియాలు.. వేడి నుంచి తప్పించుకోవాలంటే బావిలో మంచం వేసుకోవాలా ?
-
Ancient Condom: 200 ఏళ్ల నాటి పురాతన కండోమ్.. దానిని దేనితో తయారు చేశారో తెలుసా ?
-
Viral Video : సినిమా సీన్ తలపించిన ఘటన.. పెళ్లి మండపం నుంచి వధువు సోదరిని తీసుకెళ్లిన ప్రియుడు