Microsoft : మైక్రోసాఫ్ట్‌లో AI దెబ్బ.. ఉద్యోగాలు ఎందుకు తగ్గాయి?

Microsoft : మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ సంవత్సరం దాదాపు 15,000 మంది ఉద్యోగులను తీసేసింది. ఆ తర్వాత మిగిలిన ఉద్యోగులకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే, ఇకపై AI వాడటం కంపెనీలో చాలా ముఖ్యం అని, ఉద్యోగుల పనితీరును అంచనా వేసేటప్పుడు AI నైపుణ్యాలను కూడా చూస్తామని చెప్పింది. 2025లోనే మైక్రోసాఫ్ట్ ఇలా నాలుగు సార్లు ఉద్యోగులను తగ్గించుకుంది. చివరిసారి తీసేసిన వాళ్ళలో Xbox గేమింగ్ విభాగం, సేల్స్ టీమ్‌లోని 9,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ మే నెలలో 6,000 మందిని, జూన్‌లో మరో కొన్ని వందల మందిని తీసేశారు. ఎక్కువగా పాత పద్ధతిలో పని చేసే సేల్స్ ఉద్యోగులనే మైక్రోసాఫ్ట్ తొలగించింది. ఎందుకంటే, వీళ్ళ స్థానంలో ఇప్పుడు AI టూల్స్‌ను నేరుగా కస్టమర్లకు చూపించగల టెక్నికల్ నిపుణులు కావాలని కంపెనీ అనుకుంటుంది. అంటే, మనుషులు చేసే కొన్ని పనులను AI ద్వారా చేయించేందుకు కంపెనీ రెడీ అవుతుందన్న మాట.
మైక్రోసాఫ్ట్ డెవలపర్ డివిజన్ ప్రెసిడెంట్ జూలియా లియుసన్ మాట్లాడుతూ.. “ఉద్యోగుల పనితీరులో AIని ఉపయోగించడం అనేది ఇప్పుడు తప్పనిసరిగా మారింది. ఇది ఏ ఉద్యోగానికైనా, ఏ స్థాయిలో ఉన్న వారికైనా చాలా ముఖ్యం” అని స్పష్టం చేశారు. కంపెనీ తన Copilot AI సేవలను విస్తృత పరుస్తోంది. అందుకే ఉద్యోగుల పనితీరును అంచనా వేయడానికి AI వాడకానికి సంబంధించిన లెక్కలను కూడా చేర్చాలని ఆలోచిస్తోంది. సేల్స్ చీఫ్ జాడ్సన్ ఆల్తాఫ్ కూడా “ప్రతి పరికరంలో, ప్రతి ఉద్యోగంలో Copilotను తీసుకురావాలని ప్రణాళికలు ఉన్నట్లు చెబుతున్నారు.
Read Also:Drinking Black Coffee: డైలీ బ్లాక్ కాఫీ తాగితే.. ఏమవుతుందో మీకు తెలుసా?
మైక్రోసాఫ్ట్ ఈ సంవత్సరం AI అభివృద్ధి కోసం 80 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. AIపై ఇంతగా దృష్టి పెట్టడానికి ఇదే ప్రధాన కారణం. కంపెనీ తమ ఖర్చులను తగ్గించుకోవడానికి కొన్ని విభాగాలను సరిచేస్తున్నామని చెబుతోంది. అంటే, దీర్ఘకాలంలో AI రంగంలో తామే కింగ్ లా ఉండటానికి ఈ నిర్ణయాలు తీసుకుంటోందని అర్థం చేసుకోవచ్చు.
మైక్రోసాఫ్ట్‌లో జరిగిన ఈ ఉద్యోగాల తొలగింపులకు AI ఒక పెద్ద కారణమని స్పష్టంగా తెలుస్తోంది. కంపెనీ ఇప్పుడు పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, AI ఆధారిత పనులకు ప్రాధాన్యత ఇస్తోంది. దీనివల్ల కొన్ని రకాల ఉద్యోగాలు పోతున్నా, AI నైపుణ్యాలు ఉన్నవారికి మాత్రం మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇది మైక్రోసాఫ్ట్‌కే కాదు, భవిష్యత్తులో చాలా కంపెనీల్లో ఇలాంటి మార్పులు జరగొచ్చు.
Read Also:Credit Card: క్రెడిట్ కార్డు లిమిట్ తక్కువగా ఉందా.. అయితే ఇలా పెంచుకోండి