The Raja Saab: ‘ది రాజా సాబ్’ ప్రభాస్ మూవీ సెట్స్ చూశారా.. ఎంత అద్భుతంగా ఉన్నాయో!

The Raja Saab: ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ హారర్ జానర్‌లో రూపొందుతోంది. ది రాజా సాబ్ టీజర్ అయితే అదిరిపోయింది. ప్రభాస్ వింటేజ్ లుక్, కామెడీ టైమింగ్, ఎలివేషన్లు, సినిమాటోగ్రఫీ, వీఎఫ్‌ఎక్స్ అన్ని కూడా సూపర్ ఉన్నాయి. టీజర్‌లో విజువల్స్ అయితే అదిరిపోయాయి. ఈ సినిమా సెట్ కోసం ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నంబియార్ ఓ హవేలీ సెట్‌ను ఫీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ స్టూడియోలో వేశారు. ఇందులో ఓ అల్యూమినియం సెట్ కూడా వేశారు. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పురాతన కాలం నాటి రాజ మహల్, అందులోని వస్తువులు కూడా కనిపిస్తాయి. ఇవన్నీ చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. అలాగే ఓ చనిపోయిన వ్యక్తి కూడా ఉంటాడు. చనిపోయిన తర్వాత కూడా ఆస్తిని అనుభవించాలని అనుకుని దెయ్యంగా అక్కడే దెయ్యంగా ఉంటాడు. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఆ సెట్‌లో చూడవచ్చు. చూడటానికి ఇంత అందంగా కనిపిస్తుందంటే.. ఇంకా సినిమాలో ఎలా ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి సినిమా సెట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఓ లుక్కేసేయండి.
మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆయన గత చిత్రాలలో చూపిన కామెడీ టచ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాలో కూడా ఉంటాయని టీజర్ ద్వారా తెలుస్తోంది. హారర్ ఎలివేషన్స్‌ను కూడా పకడ్బందీగా చూపించి, ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి మారుతి ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. ప్రభాస్ నుంచి పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ‘మిర్చి’, ‘డార్లింగ్’ లాంటి సినిమాల్లో ప్రభాస్ చూపిన ఎంటర్‌టైన్‌మెంట్ ట్రాక్‌ను ఈ చిత్రం సీక్వెల్‌గా ఉంటుందని తెలుస్తోంది. ‘ది రాజా సాబ్’ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ దగ్గర నుంచీ దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ లాంటి స్టార్ హీరో, మారుతి లాంటి కామెడీ స్పెషలిస్ట్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి. టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు ఇంకా ఎక్కువగా పెరిగాయి. అయితే ఈ మూవీలో నిధి అగర్వాల్, మాలవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Samantha : వామ్మో.. ఫోటోగ్రాఫర్ల పై విరుచుకుపడ్డ సమంత.. ఇంత కోపం ఎన్నడూ చూడలేదు
-
Prabhas : ఆ సినిమా తర్వాత ఏకంగా 6 వేల పెళ్లి ప్రపోజల్స్.. 45ఏళ్లలోనూ ఇంకా ఒంటరిగానే స్టార్ హీరో
-
The Raja Saab Teaser: రాజాసాబ్ ట్రైలర్ రివ్యూ: ప్రభాస్ కామెడీ చేస్తే కెవ్వు కేక అంతే..
-
Kannappa : విడుదలకు ముందే కన్నప్ప ఓటీటీ రిలీజ్ కు డేట్ ఫీక్స్.. ఎప్పుడు వస్తుందంటే ?
-
Prabhas :’ది రాజా సాబ్’ కోసం రూ.50కోట్లు రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్ ? అసలు కారణం ఇదే!
-
Spirit Movie: ఏకంగా ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసిన లక్కీ గర్ల్ త్రిప్తి డిమ్రీ
-
Manchu Vishnu: నాన్న కోసమే ఇదంతా చేస్తున్నా.. మంచు విష్ణుసంచలన నిజాలు