Dangerous Video : వీడిని బొక్కలో వేసి తుక్కుతుక్కుగా కొట్టాలి.. రెండేళ్ల చిన్నారితో బంగీ జంప్ ఏంట్రా

Dangerous Video : జీవితం అంటనే ఓ సాహసం అంటారు. కానీ కొన్ని సార్లు కొందరు చేసే సాహసాలు చూస్తే వామ్మో అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా, పసిపిల్లల ప్రాణాలను పణంగా పెట్టి సాహసాలు చేస్తే చూసే వాళ్ల గుండెలు కూడా అరచేతుల్లోకి వస్తాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటి ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ మలేషియన్ టీవీ స్టార్ తన రెండేళ్ల చిన్నారిని ఎత్తుకుని చేసిన సాహసం చూస్తే, ‘ఇదేం పని రా బాబు!’ అని తలపట్టుకుంటారు.
మలేషియాకు చెందిన ఓ టీవీ స్టార్ రెధా రోజ్లాన్ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. కానీ ఈసారి మంచి పని చేసి కాదు. ఆయన చేసిన ఓ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆయన తన రెండేళ్ల కూతురు మెక్కా మైకేలాను ఎత్తుకుని, ఏకంగా 200 అడుగుల ఎత్తైన బ్రిడ్జి మీద నుంచి బంగీ జంపింగ్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఆయన చేసిన ఈ ప్రమాదకరమైన స్టంట్ పట్ల అందరూ మండిపడుతున్నారు. నెటిజన్లు అయితే దీన్ని పిల్లలను హింసించడమే అని కామెంట్స్ పెడుతున్నారు.
Read Also:Health Benefits: ఈ టీ డైలీ తాగితే.. మీ ఆయుష్షు పెరగడం ఖాయం
వైరల్ అవుతున్న ఈ వీడియోలో రోజ్లాన్ తన చిన్నారి కూతురిని గుండెలకు హత్తుకుని, ఎత్తైన బ్రిడ్జి మీద నుంచి దూకకడం చూడవచ్చు. ఈ వీడియో వాస్తవానికి 2018లో మొదటిసారి బయటికి వచ్చింది. కానీ, ఇప్పుడు మళ్ళీ @viral.in.india_ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేయడంతో, మళ్ళీ వైరల్ అయ్యింది. ఈ వీడియోను ఇప్పటివరకు 50,000 మందికి పైగా చూశారు. కామెంట్ల సెక్షన్లో అయితే జనాలు తమ ఆగ్రహాన్ని వెల్లదీస్తున్నారు.
వీడియోలో తండ్రి కూతుర్ని గట్టిగా పట్టుకున్నాడు. కానీ ఆ చిన్నారికి మాత్రం ప్రత్యేకంగా ఎలాంటి సేఫ్టీ బెల్టు కానీ, పరికరం కానీ ఉన్నట్లు కనిపించట్లేదు. దీనివల్ల రోజ్లాన్ చేసిన ఈ స్టంట్ ఏ మాత్రం అటుఇటు అయినా చాలా ప్రమాదకరంగా మారి ఉండొచ్చు. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు ఎంత కోపంగా ఉన్నారంటే, రెధా రోజ్లాన్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని.. ఇలాంటిది ఇంకెవ్వరూ చేయకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
పలువురు నెటిజన్లు ఒక చిన్నారి ప్రాణాన్ని ఇలా రిస్క్‌లో పెట్టడం న్యాయమా? అని ప్రశ్నిస్తున్నారు. నిపుణులు కూడా బంగీ జంపింగ్ అనేది చాలా ప్రమాదకరమైన స్టంట్. దీనికి పెద్దవాళ్ళకే చాలా కఠినమైన సేఫ్టీ రూల్స్ ఉంటాయి. అలాంటిది, ఒక పసిపిల్లవాడిని సేఫ్టీ బెల్టు లేకుండా ఎత్తుకుని దూకడం అంటే ఇది రూల్స్ ఉల్లంఘించడమే కాదు బిడ్డ ప్రాణానికి చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
-
YouTube : యూట్యూబ్ రూల్స్‌లో భారీ మార్పులు.. లైవ్ స్ట్రిమింగ్ కు కొత్త నిబంధనలు
-
Viral Video : నువ్వేం తండ్రివిరా నాయనా.. ఆ పిల్లాడిని సింహానికి ఆహారంగా వేద్దాం అనుకుంటున్నావా ?
-
AI Skills : చదువులో టాపర్.. అయినా ఉద్యోగం రాలేదు.. చదువు కంటే ఇవే ముఖ్యమంటున్న నిపుణులు
-
Lychee Momos : లిచీ పండ్లతో మోమోస్ తయారీ.. తిన్నోడి పరిస్థితి ఎలా ఉందో మరి ?
-
Viral Video : మిస్ అయితే యముడికి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందే.. లారీ కింద పడకేంట్రా బాబు
-
Viral Video : ఎలా వస్తాయిరా ఇలాంటి ఐడియాలు.. వేడి నుంచి తప్పించుకోవాలంటే బావిలో మంచం వేసుకోవాలా ?