Balkampet Yellamma Temple : తల్లి చెప్పగానే బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయానికి రూ.కోటి విరాళం ఇచ్చిన నీతా అంబానీ

Balkampet Yellamma Temple : హైదరాబాద్‌లో ఉన్న ఫేమస్ బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి గుడికి ఒక శుభవార్త అందింది. ఆసియాలోనే అత్యంత కుబేరుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఈ గుడికి భారీ విరాళం అందజేశారు. ఏకంగా కోటి రూపాయలు ఎల్లమ్మ తల్లి గుడికి ఇచ్చారు. ఈ డబ్బును నేరుగా గుడి బ్యాంక్ అకౌంట్లో జమచేశారు.
గత ఏప్రిల్‌లో నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, వాళ్ళ అక్క మమత దలాల్ బల్కంపేట్ ఎల్లమ్మ గుడికి దర్శనానికి వచ్చారు. అప్పుడు గుడి అధికారులు వాళ్ళకు గుడి గొప్పదనం గురించి, విశిష్టత గురించి వివరించారు. గుడిని ఇంకా బాగా డెవలప్ చేయడానికి, దానికి కొంత సాయం చేయమని వాళ్ళను అడిగారట. ఆ వినతిని పూర్ణిమ దలాల్ నేరుగా నీతా అంబానీకి వివరించారు. ఆ మాట వినగానే నీతా అంబానీ వెంటనే ఒప్పుకుని, గుడి అభివృద్ధి కోసం కోటి రూపాయలు గుడి బ్యాంక్ అకౌంట్‌కి పంపించేశారు.
Read Also:Breast Cancer: ఈ లక్షణాలు మహిళల్లో ఉంటే.. రొమ్ము క్యాన్సర్ తప్పదు
గుడి కమిటీ సభ్యులు చెప్పిన దాని ప్రకారం.. ఈ కోటి రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ (FD) చేసి, దాని మీద వచ్చే వడ్డీని గుడికి రోజూ అన్నదానం కోసం వాడేలా ప్లాన్ చేసుకున్నారట. ఇంత పెద్ద దానం చేసినందుకు నీతా అంబానీ కుటుంబ సభ్యులకు గుడి అధికారులు కృతజ్నతలు చెప్పారు..
నీతా అంబానీకి ఎల్లమ్మ తల్లి అంటే చాలా భక్తి
నీతా అంబానీకి బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి అంటే చాలా భక్తి అని అందరికీ తెలిసిందే. ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటూ ఉంటారట. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ నెలలో నీతా అంబానీ తల్లి, సోదరి ఎల్లమ్మ గుడికి వచ్చినప్పుడు, గుడి అధికారులు గుడి అభివృద్ధికి సహకరించమని అడిగారు. తల్లి కోరిక మేరకు, తాను కూడా ఎల్లమ్మ భక్తురాలిని కాబట్టి, నీతా అంబానీ కోటి రూపాయలు గుడికి దానం చేశారు. అంతేకాకుండా, నీతా అంబానీ దేశంలోని చాలా ఫేమస్ గుళ్ళను కూడా సందర్శించి, భారీగా దానాలు చేసిన సంగతి తెలిసిందే.
Read Also:Whatsapp New Feature: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. సబ్స్క్రిప్షన్ చేసుకునే వారికి స్పెషల్ కంటెంట్