Viral Video : మిస్ అయితే యముడికి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందే.. లారీ కింద పడకేంట్రా బాబు

Viral Video : సోషల్ మీడియాలో ప్రతి రోజు వెరైటీ వీడియోలు బాగా ట్రెండ్ అవుతాయి. కొందరు రైలులో సీటు పొందడానికి వింత పద్ధతులు అనుసరిస్తుంటే, మరికొందరు ఎండ వేడిమిని తగ్గించుకోవడానికి డిఫరెంట్ మార్గాలను అన్వేషిస్తున్నారు. అయితే, ఇటీవల ఒక ‘పెద్దాయన’ చేసిన వింత పనికి సంబంధించిన వీడియో ఒకటి బయటపడింది. ఇది ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. నెటిజన్ల మైండ్‌ను బ్లాక్ చేసింది.
ట్రక్కు కింద మంచం
వైరల్ అవుతున్న వీడియోలో ఆ వ్యక్తికి బాగా నిద్ర వచ్చి, పడుకోవడానికి చోటు దొరక్కపోవడంతో ఒక ప్రమాదకరమైన పద్ధతిని అనుసరించాడు. వీడియోలో ఆ వ్యక్తి ట్రక్కు కింద, చక్రం పక్కన ఒక మంచాన్ని అమర్చి, దానిపై హాయిగా నిద్రపోతున్నాడు. అయితే, మరింత షాకింగ్ విషయం ఏమిటంటే.. ట్రక్కు రోడ్డుపై వేగంగా వెళుతోంది. ఆ వ్యక్తి తన వినూత్న మంచంపై ఏ మాత్రం భయం లేకుండా నిద్రపోతున్నాడు. ఈ పెద్దాయన చేసిన ఆవిష్కరణ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఇది చూస్తే మీరు కూడా నివ్వెరపోతారు.
Read Also:Rashmika Mandanna : ఆయనలో అన్నీ ఇష్టమే.. విజయ్ గురించి చెబుతూ సిగ్గుపడ్డ రష్మిక
ఈ దృశ్యం అత్యంత ప్రమాదకరమైనది.. అయినప్పటికీ పెద్దాయన ‘దేశీ టాలెంట్’ ఇంటర్నెట్లో సునామీలా వైరల్ అవుతుంది. @sadiq_rathvi అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి ఈ వీడియోను అప్లోడ్ చేస్తూ, నెటిజన్ “ట్రక్కు కింద ఒక మంచం” అని క్యాప్షన్‌లో రాశాడు. ఈ పోస్ట్‌పై వినియోగదారులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
ఒక నెటిజన్ “డ్రైవర్ జీవితం అంత సులువు కాదు” అని రాశారు. “మనిషిని ఎంత సంపాదిస్తున్నావ్? ఎలా సంపాదిస్తున్నావ్? ఏం చేస్తున్నావ్? అని మాత్రమే అడుగుతారు” అని మరొక నెటిజన్ కామెంట్ చేశారు. ఇంకొక నెటిజన్ “అకస్మాత్తుగా బ్రేకర్ వస్తే ఏమవుతుంది?” అని ఆందోళన వ్యక్తం చేశారు. మరొక నెటిజన్ “అదేంటో, తాతగారు మౌంటైన్ డ్యూ తాగి వచ్చినట్లున్నారు” అని చమత్కరించారు. ఈ వీడియో నెటిజన్లకు వినోదాన్ని పంచుతున్నప్పటికీ, ఇలాంటి ప్రమాదకరమైన పనులను ఎవరూ ప్రయత్నించవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Lavanya : వీడియోతో సహా అడ్డంగా బుక్కయిన లావణ్య
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం