Rashmika Mandanna : ఆయనలో అన్నీ ఇష్టమే.. విజయ్ గురించి చెబుతూ సిగ్గుపడ్డ రష్మిక

Rashmika Mandanna : స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna)ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి బంధం గురించి అందరికీ తెలిసిందే. వీరు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబుతున్నారని ప్రచారం జరుగుతుంది. వీరు ఇద్దరూ కలిసి హాయిగా తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని, వీరు కలిసి ఫోటోలు పోస్ట్ చేయకపోయినా, వారి ప్రవర్తన ద్వారా అది స్పష్టమవుతోంది. ఇటీవల రష్మిక విజయ్ దేవరకొండ గురించి మాట్లాడారు. విజయ్ దేవరకొండకు సంబంధించిన అన్ని విషయాలూ తనకు ఇష్టమని ఆమె ప్రకటించారు.
విజయ్ దేవరకొండ, రష్మిక గతంలో ‘గీత గోవిందం’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాపై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. అనుకున్న దానికంటే సినిమా పెద్ద విజయం సాధించింది. విజయ్, రష్మిక జోడీ సక్సెస్ అయింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ అనే మరో సినిమా కూడా వచ్చింది. అయితే ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే వారి మధ్య ప్రేమ చిగురించిందని చెబుతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి జీవిస్తున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి.
The Auditorium Erupts! pic.twitter.com/3yL2x05uEK
— Gulte (@GulteOfficial) June 15, 2025
ఇటీవల కుబేర ఈవెంట్ వేదికపై రష్మికను పలువురు సినీ నటుల గురించి అడిగారు. ఆ హీరోలలో ఏ విషయం ఇష్టమని రష్మిక చెప్పాల్సి వచ్చింది. మొదట రష్మికను అల్లు అర్జున్ గురించి అడిగారు. ఈ సందర్భంగా ఆమె “అల్లు అర్జున్ గారి స్వ్యాగ్ నాకు ఇష్టం” అని అన్నారు. ఆ తర్వాత యాంకర్ సుమ విజయ్ దేవరకొండ పేరును ప్రస్తావించారు. “ఆయనలో నాకు అన్నీ ఇష్టమే” అని రష్మిక మందన్న చెప్పారు. ఈ సమయంలో ఆమె నవ్వుతూ, సిగ్గుపడుతూ కనిపించారు. దీంతో అభిమానులు ఒక్కసారిగాఅభిమానుల అరుపులు మరింత పెరిగాయి.
రష్మిక మందన్న, విజయ్ ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలలో కలిసి కనిపించారు. ఆ తర్వాత వారు మళ్లీ కలిసి నటించలేకపోయారు. వారు తిరిగి తెరపై కలిసి కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం రష్మిక విజయ్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also:The Raja Saab Teaser: రాజాసాబ్ ట్రైలర్ రివ్యూ: ప్రభాస్ కామెడీ చేస్తే కెవ్వు కేక అంతే..
-
Kingdom First Review: కింగ్ డమ్ ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే
-
Kingdom Pre Release Event: కింగ్ డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
-
Vijay Deverakonda Stunt: కింగ్డమ్ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఎంతలా కష్టపడ్తున్నాడో చూడండి
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్