Viral Video : తాగింది దిగేలా చేయాలి ఇలాంటి వాళ్లకు.. మహిళా కోచ్ లో ప్యాంట్ జిప్ తిసే ప్రయత్నం.. వీడియో వైరల్

Viral Video : ముంబై లోకల్ రైలులో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. రైలులో ప్రయాణిస్తున్న మహిళల ముందు ఒక ఆకతాయి అశ్లీలంగా ప్రవర్తించాడు. ఈ ఘటన జూన్ 14న ఉదయం 8 గంటల సమయంలో ముంబై లోకల్ రైలులోని మహిళా కోచ్‌లో చోటు చేసుకుంది. యువకుడొకడు ప్యాంట్ జిప్‌ను విప్పడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటనను ఒక మహిళ తన ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Read Also:Health Issues: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా.. తస్మాత్ జాగ్రత్త
మద్యం మత్తులో యువకుడి చేష్టలు
వైరల్ అవుతున్న వీడియోలో ఒక తాగుబోతు యువకుడు రైలులోని మహిళా కంపార్ట్మెంట్లో నిలబడి ప్యాంట్ జిప్‌ను తెరిచి, ఆ తర్వాత ప్యాంట్ తీయడానికి కూడా ప్రయత్నించాడు. అతని అశ్లీల ప్రవర్తనను చూసి తట్టుకోలేకపోయిన ఒక మహిళా ప్రయాణికురాలు, అతనికి గట్టిగా మందలించి రైలులో నుంచి దిగిపోమని చెప్పింది. రైల్వే హెల్ప్‌లైన్‌కు కాల్ చేసినా ఎటువంటి స్పందన రాలేదని సదరు మహిళ పేర్కొంది.
Another similar incident, another intoxicated man climbed up the women’s coach at around 8 AM at Chunabhatti station and was thrown out at GTB. He tried to remove his pants. Tried calling railway helpline number; no response and no police on platform. @MumbaiPolice @MinistryWCD https://t.co/zhrtpJ0Joi pic.twitter.com/i8ncXumIGx
— Manasi (@Manasisplaining) June 14, 2025
Read Also:WhatsApp : వాట్సాప్ స్పామ్ కాల్స్‌కు చెక్..మోసగాళ్ల బారిన పడకుండా ఇలా కాపాడుకోండి
ప్రయాణీకుల భద్రతపై ఆందోళన
మానసి (Manasi) అనే మహిళ ఈ వీడియోను తన X ఖాతాలో పంచుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు చాలా వేగంగా వైరల్ అవుతోంది. ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణించే మహిళల భద్రతపై ఇటువంటి అశ్లీల ప్రవర్తనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనపై విస్తృత ఆగ్రహం వ్యక్తమవుతోంది. రైలు ప్రయాణాలలో మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, ఇటువంటి ఆకతాయిల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
-
Samantha : వామ్మో.. ఫోటోగ్రాఫర్ల పై విరుచుకుపడ్డ సమంత.. ఇంత కోపం ఎన్నడూ చూడలేదు
-
Flight Journey: విమాన ప్రయాణం.. భయం భయం..
-
Apple : ముంబైలో యాపిల్ కొత్త స్టోర్ – బెంగళూరులోనూ ప్లాన్.. అద్దె ఎంతో తెలిస్తే గుండె దడేల్ అనాల్సిందే
-
Mukesh Ambani’s Antilia: రోజుకు 4 వేల రోటీలు, షెఫ్‌కు రూ. 2 లక్షల జీతం.. ఆశ్చర్యపరిచే అంబానీ ఇంటి విషయాలు
-
Drunk Owner: ఎద్దా మజాకానా.. తాగి ఉన్న యజమానిని ఏం చేసిందంటే?
-
Vodafone: VI 5జీ వచ్చేసింది.. 100 నగరాలకు విస్తరణ!