Vijay-Rashmika Video Viral: మళ్లీ అడ్డంగా దొరికిన విజయ్ దేవరకొండ-రష్మిక.. వైరల్ వీడియో

Vijay-Rashmika Video Viral:రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ స్నేహితులు అని చెప్పుకుంటున్నారు. కానీ వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్లడం, ఒకే దుస్తులు ధరించడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హింట్‌లు ఇచ్చారు. కానీ వీరిద్దరూ రిలేషన్‌లో లేరని కేవలం ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నారు. అయితే ‘గీత గోవిందం’ (2018) ‘డియర్ కామ్రేడ్’ (2019) వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే కేవలం తెరపై కెమిస్ట్రీకే పరిమితం కాలేదు. రష్మిక, విజయ్ తరచుగా వివిధ సందర్భాలలో కలిసి కనిపించడం ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే వీరిద్దరూ తమ సంబంధాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. కానీ వార్తల్లో ఉంటారు. అయితే ఇటీవల ముంబై విమానాశ్రయంలో వీరిద్దరూ కలిసి ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇద్దరూ ఒకే కారులో ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అయితే ముందుగా విజయ్ ఎయిర్ పోర్టుకు వెళ్లగా, ఆ తర్వాత కొంత సమయానికి రష్మిక వెళ్లడాన్ని నెటిజన్లు గమనించారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చూడండి: Samantha : వామ్మో.. ఫోటోగ్రాఫర్ల పై విరుచుకుపడ్డ సమంత.. ఇంత కోపం ఎన్నడూ చూడలేదు
గతంలో కూడా రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లో ఉన్న ఫొటోలు, అతని కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండటం వంటివి వైరల్ అయ్యాయి. వారి అభిమానులు మాత్రం వారు ఎప్పటికైనా తమ సంబంధాన్ని బహిరంగంగా ప్రకటిస్తారని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ వీడియో, ఇతర ఆధారాలు రష్మిక, విజయ్ మధ్య ఉన్న బంధం కేవలం స్నేహం కాదని, అంతకు మించి ఏదో ఉందని సూచిస్తున్నాయి. వారిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై ఎంత అద్భుతంగా ఉంటుందో, నిజ జీవితంలోనూ అంతే మధురంగా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే సెలబ్రిటీలు వారి సొంత జీవితంపై గోప్యత పాటిస్తారు. ఎందుకంటే వారి వ్యక్తిగత విషయాలు బయటకు తెలియకూడదని భావిస్తారు. రష్మిక విజయ్ ఎంత గోప్యంగా ఉండాలనుకున్నా కూడా ఏదో ఒక రూపంలో వారి ఫొటోలు, వీడియోలు బయటకు వస్తున్నాయి. ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఉంటున్నారు. ప్రస్తుతం రష్మిక, విజయ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram