Health Issues: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా.. తస్మాత్ జాగ్రత్త

Health Issues: ఆరోగ్యమే మహా భాగ్యం అని అంటారు. హెల్త్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కూడా ఏదో ఒక సమస్య వస్తునే ఉంటుంది. అయితే కానీ కొన్నిసార్లు ఆరోగ్యంగానే ఉన్నామని అనుకుంటాం. కానీ శరీరంలోని కొన్ని మార్పులు మనకు అనారోగ్య సంకేతాలను ఇస్తుంది. వీటిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే పెద్ద సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే బాడీలోకి హిమోగ్లోబిన్ స్థాయిలు తప్పకుండా ఉండాలి. పొరపాటున రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గితే మాత్రం అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన రక్తంలో హిమోగ్లోబిన్ శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను మోసుకెళ్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే, శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీనివల్ల అలసట, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత (అనీమియా) అనేది చాలా సాధారణ సమస్య. గర్భం దాల్చిన స్త్రీలు, రుతుస్రావం ఎక్కువగా అయ్యే మహిళలు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు.
నడిచినా, మెట్లు ఎక్కినా ఊపిరి ఆడకపోవడం, అలసట, బలహీనత పడటం వంటి లక్షణాలు కొందరిలో కనిపిస్తాయి. ఇది రక్తహీనతకు ముఖ్యమైన లక్షణం. శరీరానికి ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల చిన్నపాటి పని చేసినా కూడా త్వరగా అలసిపోతారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. కాళ్లు, చేతులు త్వరగా నొప్పికి గురవుతాయి. అలాగే ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల సమస్యలే కాకుండా, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వల్ల కూడా రావచ్చు. ఆస్తమా లేదా ఇతర శ్వాసకోశ సమస్యలు లేనప్పటికీ ఇలా అనిపిస్తే, అది రక్తంలో ఆక్సిజన్ లోపం అని భావించవచ్చు. రక్తనాళాల్లో రక్త ప్రసరణ సరిగా జరగకపోతే చేతులు, కాళ్ల చివర వరకు రక్తం సరిగ్గా అందదు. దీనివల్ల అవి చల్లగా అయిపోతాయి. కొన్నిసార్లు తిమ్మిర్లు కూడా రావచ్చు.
చలికాలంలోనే కొందరికి తిమ్మిర్లు వస్తాయి. అయితే సాధారణ వాతావరణంలో కూడా ఇలా అనిపిస్తే జాగ్రత్త వహించాలి. అలాగే కొందరికి గుండె సాధారణం కంటే వేగంగా కొట్టుకుంటున్నట్లు అనిపిస్తుంది. రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు గుండె దానిని భర్తీ చేయడానికి వేగంగా పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది. మరికొందరికి తల తిరగడం, తలనొప్పి, మెదడుకు సరిపడా ఆక్సిజన్ అందకపోవడం, కళ్లు బైర్లు కమ్మినట్లు అనిపిస్తుంది. అలాగే రక్తహీనత వస్తే చర్మ సమస్యలు కూడా వస్తాయి. బ్లడ్ లేకపోవడం వల్ల ముఖం అంతా కూడా తెల్లగా అయిపోతుంది. ముఖం మొత్తం పాచిపోయినట్లు ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి మీలో ఈ లక్షణాలు ఏమైనా కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యుని సంప్రదించడం ఉత్తమం.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
Read Also:Mahindra : ఎలక్ట్రిక్ కార్లకు గట్టి పోటీ – కొత్త హైబ్రిడ్ మోడళ్లతో మహీంద్రా సంచలనం
-
Whatsapp New Feature: వాట్సాప్‌లోకి వచ్చేసిన కొత్త ఫీచర్.. యూజర్ల ప్రైవసీకి అసలు భయపడక్కర్లేదు
-
Anil Ravipudi: సుధీర్‌నే టార్గెట్ చేయమన్నారు.. సంచలన విషయాలు బయట పెట్టిన అనిల్ రావిపూడి
-
Biryani With Drink: బిర్యానీ విత్ డ్రింక్ తాగుతున్నారా.. అయితే ఈ ఆర్టికల్ మీకోసమే!
-
Breakfast: ప్రతీ రోజూ టిఫిన్ స్కిప్ చేస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే
-
Pani puri: ఇష్టమని పానీ పూరీ లాగించేస్తున్నారా.. ఈ సీజన్‌లో తింటే ప్రాణాలు గోవిందా!
-
Covid vaccine: కరోనా వ్యాక్సిన్‌తో గుండె పోటు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!