Flight Journey: విమాన ప్రయాణం.. భయం భయం..
Flight Journey: ఇటీవల జరిగిన సంఘటనల కారణంగా చాలామంది విమాన ప్రయాణం అంటేనే భయపడిపోతున్నారు. తక్కువ దూరాల్లో సైతం విమానాల్లో వెళ్లేవారు.. ఇప్పుడు ప్రత్యేకంగా వెహికల్ లేదా ఇతర సాధనాల ద్వారా ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు.

Flight Journey: ప్రయాణ సాధనలో ఫ్లైట్ జర్నీ చాలా కాస్ట్లీ. కానీ చాలామంది జీవితంలో ఒక్కసారి అయినా విమానంలో ఎక్కి ప్రయాణించాలని కోరుకుంటారు. గాల్లో తేలుతూ విమానంలో నుంచి కిందికి చూస్తూ ఎంజాయ్ చేయాలని భావిస్తారు. మరికొందరు సమయభావం వల్ల ఫ్లైట్ జర్నీ పైనే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. అయితే ఇటీవల జరిగిన సంఘటనల కారణంగా చాలామంది విమాన ప్రయాణం అంటేనే భయపడిపోతున్నారు. తక్కువ దూరాల్లో సైతం విమానాల్లో వెళ్లేవారు.. ఇప్పుడు ప్రత్యేకంగా వెహికల్ లేదా ఇతర సాధనాల ద్వారా ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు. అసలు ఇంత భయం ఉండడానికి కారణం ఏంటంటే?
ఏ ప్రయాణ సాధనం అయినా కొన్ని సమస్యలు ఉండడం సర్వసాధారణం. బస్సుల్లో వెళ్లే వారికి ప్రమాదాలు జరగడం సహజం. రైలు ప్రమాదాలు చూస్తూనే ఉన్నాం. కానీ వరుసగా విమాన ప్రమాదాలు జరగడంతో చాలామంది వణికిపోతున్నారు. అహ్మదాబాద్ లో జరిగిన ఘోర సంఘటన తర్వాత వరుసగా విమానాల్లో సాంకేతిక సమస్యలు బయటపడుతున్నాయి. అయితే గతంలో ఈ సమస్యలు లేవా అంటే.. ఉన్నవని చెప్పవచ్చు. కానీ ఒక్కసారి ఏదైనా ప్రమాదం జరిగితేనే దానికి సంబంధించిన విషయంలో అప్రమత్తం అవుతారా అనే విషయం తెలిసిందే. అహ్మదాబాద్ సంఘటన జరిగిన తర్వాత చాలా విమానాలు పరిశీలన చేసిన తర్వాత కొన్ని సమస్యలు బయటపడుతున్నాయి.
Also Read: షూటింగ్లో జాన్ అబ్రహంతో సీక్రెట్ గా పెళ్లి? 14 ఏళ్ల తర్వాత అసలు నిజం చెప్పిన జెనీలియా!
అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం కుప్పకూలింది. తాజాగా ఇదే సంస్థకు చెందిన మరో విమానంలో సాంకేతిక సమస్యలు బయటపడ్డాయి. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 180 అనే విమానం షాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతాకు బయలుదేరింది. అయితే మంగళవారం అర్ధరాత్రి 12 45 కోల్కతా కు చేరిన తర్వాత సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే సిబ్బంది వెంటనే గుర్తించి ప్రయాణికులను కిందకి దింపారు. అంతకుముందు ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీం లైనర్ అనే విమానం సోమవారం ఉదయం హాంకాంగ్ నుంచి బయలుదేరింది. అయితే ఇది మధ్యాహ్నం గంటలకు ఢిల్లీలో ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ మార్గమధ్యంలో ఈ విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. దీంతో అప్రమత్తమైనా సిబ్బంది ఈ విమానంను వెనక్కి మళ్ళించారు. అయితే హాంకాంగ్ ఎయిర్ పోర్ట్ లోనే ఇది సురక్షితంగా ల్యాండ్ అయింది.
ఇలా వరుసగా ఎయిర్ ఇండియా కు చెందిన విమానాల్లో సాంకేతిక సమస్యలు బయటపడడంతో చాలామంది ఈ సంస్థకు చెందిన విమానాల్లో ప్రయాణం చేయాలంటే భయపడి పోతున్నారు. గతంలోనూ ఎయిర్ ఇండియా పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇందులో సౌకర్యాలు సరిగ్గా లేవని గతంలో ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక్కో సమస్య బయటపడడంతో చాలామంది ఎయిర్ ఇండియా పై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. మరోవైపు మిగతా సంస్థలు కూడా ఇలాగే నిర్లక్ష్యం చేస్తే అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికైనా విమాన యాడ సిబ్బంది అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని కొందరు విశ్లేషకులు అంటున్నారు.
-
Samantha : వామ్మో.. ఫోటోగ్రాఫర్ల పై విరుచుకుపడ్డ సమంత.. ఇంత కోపం ఎన్నడూ చూడలేదు
-
Viral Video : తాగింది దిగేలా చేయాలి ఇలాంటి వాళ్లకు.. మహిళా కోచ్ లో ప్యాంట్ జిప్ తిసే ప్రయత్నం.. వీడియో వైరల్
-
Apple : ముంబైలో యాపిల్ కొత్త స్టోర్ – బెంగళూరులోనూ ప్లాన్.. అద్దె ఎంతో తెలిస్తే గుండె దడేల్ అనాల్సిందే
-
Mukesh Ambani’s Antilia: రోజుకు 4 వేల రోటీలు, షెఫ్కు రూ. 2 లక్షల జీతం.. ఆశ్చర్యపరిచే అంబానీ ఇంటి విషయాలు
-
Vodafone: VI 5జీ వచ్చేసింది.. 100 నగరాలకు విస్తరణ!