Virat Kohli : ‘కోహ్లీతో నా కూతురికి పెళ్లి చేస్తా’: స్టార్ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Virat Kohli : టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కొదవ లేరు. అతని ఆట శైలికి, మైదానంలో తన దూకుడు స్వభావానికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ప్రముఖ క్రికెట్ కామెంటర్ మార్క్ టేలర్ చేసి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన అడుగు ముందుకు వేసి, కోహ్లీకి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నట్లు సరదాగా కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్య ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.
ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ అలస్సా హీలీ హోస్ట్ చేస్తున్న ‘విల్లో టాక్’ అనే పాడ్‌కాస్ట్‌లో మార్క్ టేలర్ ఈ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. విరాట్ కోహ్లీని మొదటిసారి కలిసినప్పటి ఎక్స్ పీరియన్స్ ను గుర్తుచేసుకుంటూ, కోహ్లీ వ్యక్తిత్వం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని టేలర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “కొన్నేళ్ల క్రితం నేను విరాట్ కోహ్లీని మొదటిసారి కలిశాను. అప్పటికే తను క్రికెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సంపాదించుకుంటున్నాడు. నేను అతనితో మాట్లాడినప్పుడు అతని వినయం, పెద్దల పట్ల గౌరవం నన్ను చాలా ఆకట్టుకున్నాయి. ఆ సమయంలో నా కూతురికి 17 సంవత్సరాలు. నేను ఆమెను కోహ్లీకి పరిచయం చేసి, ‘ఒకవేళ నీకు నచ్చితే, నువ్వు విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకోవచ్చు’ అని సరదాగా చెప్పాను. నా మాటలకు నా కూతురు సిగ్గుపడింది” అని మార్క్ టేలర్ నవ్వుతూ చెప్పుకొచ్చారు.
Read Also:Genelia : షూటింగ్లో జాన్ అబ్రహంతో సీక్రెట్ గా పెళ్లి? 14 ఏళ్ల తర్వాత అసలు నిజం చెప్పిన జెనీలియా!
Mark Taylor about Virat Kohli, he will never forget when a young Kohli showed him the upmost respect. pic.twitter.com/JN1Smy8TA7
— aaisha (@awkaaisha) June 15, 2025
అప్పట్లో విరాట్ కోహ్లీకి ఇంకా పెళ్లి కాలేదు. అతని వ్యక్తిత్వం వల్ల ఎవరైనా అతడిని ఇష్టపడతారని మార్క్ టేలర్ అభిప్రాయపడ్డారు. మైదానంలో కోహ్లీ ఎంత దూకుడుగా ఉంటాడో.. బయట అంత ప్రశాంతంగా ఉంటాడని టేలర్ వివరించారు. ఒక గొప్ప ఆటగాడికి ఉండాల్సిన అన్ని లక్షణాలు కోహ్లీకి ఉన్నాయని, అందుకే తాను అలాంటి సరదా వ్యాఖ్య చేశానని టేలర్ చెప్పారు. ప్రత్యర్థి జట్టు మాజీ కెప్టెన్ కోహ్లీ వ్యక్తిత్వాన్ని ఇంతగా మెచ్చుకోవడం అతని గొప్పదనానికి నిదర్శనమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. విరాట్ కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం దశాబ్దాల క్రితమే కోహ్లీని ఈ విధంగా భావించడం కోహ్లీ అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also:Jio : కస్టమర్లకు షాక్.. నిలిచిపోయిన జియో సేవలు.. మీకు ప్రాబ్లమ్ వచ్చిందా ?
-
YouWeCan : సచిన్, కోహ్లీ, పీటర్సన్.. యువీ ఛారిటీ కోసం తరలివచ్చిన క్రికెట్ దిగ్గజాలు!
-
Jofra Archer : 1596 రోజుల తర్వాత టీంలోకి తిరిగొచ్చిన స్టార్ ప్లేయర్.. భారత్‌కు పొంచి ఉన్న ముప్పు
-
Pat Cummins : శుభ్‌మన్ గిల్ సేనను చూసి కమ్మిన్స్ భయపడ్డారా? ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Jasprit Bumrah : రెండో టెస్టుకు ముందు టీం ఇండియాకు గుడ్ న్యూస్.. బూమ్రా వచ్చేశాడు
-
Asia Cup 2025 : మరో క్రికెట్ సమరానికి ముహూర్తం ఫిక్స్.. క్రికెట్ అభిమానులకు పండుగే
-
India vs England : అక్కడ ఒక్క మ్యాచ్ గెలిచిన చరిత్రలేదు.. రెండో టెస్టులో టీం ఇండియా కష్టమే