Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Secret Wedding On Force Sets Genelia Finally Reveals The Truth After 14 Years

Genelia : షూటింగ్‌లో జాన్ అబ్రహంతో సీక్రెట్ గా పెళ్లి? 14 ఏళ్ల తర్వాత అసలు నిజం చెప్పిన జెనీలియా!

Genelia : షూటింగ్‌లో జాన్ అబ్రహంతో సీక్రెట్ గా పెళ్లి? 14 ఏళ్ల తర్వాత అసలు నిజం చెప్పిన జెనీలియా!
  • Edited By: rocky,
  • Updated on June 17, 2025 / 10:16 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Genelia : సినిమా ఇండస్ట్రీలో పుకార్లకు కొదవే ఉండదు. కొన్ని నిజమవుతాయి.. మరికొన్ని కేవలం గాసిప్‌లుగానే మిగిలిపోతాయి. అలాంటి ఓ పాత వదంతి ఇప్పుడు మళ్లీ తెరమీదకు వచ్చింది. హీరోయిన్ జెనీలియా, జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఫోర్స్’ సినిమా షూటింగ్ సమయంలో, వారిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని అప్పట్లో బలంగా వార్తలు వినిపించాయి. ఈ వదంతులపై ఇద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. కానీ ఇప్పుడు, దాదాపు 14 ఏళ్ల తర్వాత జెనీలియా ఎట్టకేలకు ఈ విషయంపై మౌనం వీడారు. తన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ పుకార్ల గురించి ఆమె బహిరంగంగా మాట్లాడారు.

2011లో విడుదలైన ‘ఫోర్స్’ చిత్రంలో జెనీలియా, జాన్ అబ్రహం మధ్య ఒక పెళ్లి సీన్ ఉంటుంది. ఆ సన్నివేశాన్ని చాలా సహజంగా, నిజంగా జరిగిన పెళ్లి లాగే చిత్రీకరించారు. పెళ్లికి సంబంధించిన అన్ని ఆచారాలు, సంప్రదాయాలను సినిమాలో వివరంగా చూపించారు. షూటింగ్ సమయంలో నిజమైన పూజారి ఒకరు వచ్చి పెళ్లి తంతును నిర్వహించడంతో సినిమా పూర్తయిన తర్వాత జెనీలియా, జాన్ నిజంగానే పెళ్లి చేసుకున్నారేమోనని వదంతులు పుట్టుకొచ్చాయి. ఇటీవల ఆర్జే సిద్ధార్థ్ కన్నన్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జెనీలియాను దీని గురించి అడిగారు.

Read Also:Jio : కస్టమర్లకు షాక్.. నిలిచిపోయిన జియో సేవలు.. మీకు ప్రాబ్లమ్ వచ్చిందా ?

ఈ ప్రశ్నకు స్పందించిన జెనీలియా, “ఈ వార్తలో ఏ మాత్రం నిజం లేదు. మేము పెళ్లి చేసుకోలేదు. ఈ కథలు వాటంతట అవే పుట్టాయి. ఎందుకు ఇలా చేశారో మీరు వాళ్లనే అడగాలి” అని స్పష్టం చేశారు. ఈ పెళ్లి వదంతులు సినిమా ప్రచారం కోసమే వ్యాప్తి చెందాయని జెనీలియా పేర్కొన్నారు. ఈ పుకార్లను సృష్టించడంలో జాన్ లేదా తన పాత్ర లేదని ఆమె స్పష్టం చేశారు.

పుకార్లు వచ్చిన ఆ టైంలోనే ‘ఫోర్స్’ చిత్ర నిర్మాత విపుల్ షా ఒక పాత ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. సినిమాలో పూజారి పాత్ర కోసం యువ కళాకారులను సెలక్ట్ చేసుకోవాలని అనుకున్నానని అయితే సీన్ మరింత నేచురల్ గా చూపించేందుకు దర్శకుడు నిశికాంత్ కామత్ ఆ పాత్రకు రియల్ పూజారిని సెలక్ట్ చేశారని ఆయన చెప్పారు. పూజారి ఆశీర్వాదాలు, విధి విధానాలతో ఆ సీన్ చాలా నేచురల్ గా కనిపించిందని, అదే పుకార్లకు దారితీసిందని ఆయన వివరించారు. కానీ అది కేవలం షూటింగ్ మాత్రమే అని ఆయన తెలిపారు.

Read Also:Citroen C3 : స్పోర్టీ లుక్‌, సరికొత్త కలర్ తో సిట్రోయెన్ C3 స్పోర్ట్ ఎడిషన్ లాంచ్

ప్రస్తుతం జెనీలియా నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుని వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు. ఈ దంపతులకు రియాన్, రాహిల్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. జెనీలియా వ్యక్తిగత జీవితంలో బిజీగా ఉన్నప్పటికీ, సినిమాలకు పూర్తిగా దూరంగా లేరు. ఆమె మరాఠీ సినిమాలో అడపాదడపా నటిస్తున్నారు. కొన్నింటికి నిర్మాతగా కూడా వ్యవహరించారు. తెలుగులో ఆమె కన్నడ నటుడు కిరీటి నటిస్తున్న ‘జూనియర్’ చిత్రంలోనూ నటించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ‘సితారే జమీన్ పర్’తో పాటు, జెనీలియా మరిన్ని చిత్రాలలో నటిస్తున్నారు.

Tag

  • Bollywood News
  • Force movie
  • Genelia D'Souza
  • John Abraham
  • marriage rumors
Related News
  • Bollywood Khans : ఒకే సినిమాలో షారుఖ్, సల్మాన్, ఆమిర్.. అభిమానులకు పండుగే

  • Viral : ఫ్యాషన్ కి పరాకాష్ట.. కారు దిగగానే గాలికి లేచిన డ్రస్సు..కవర్ చేసుకున్న ఖుషీ

  • Sikandar : సల్మాన్ ఖాన్ దెబ్బకు ఇన్సురెన్స్ చేయించుకున్న నిర్మాత.. ఆ సినిమాకు ఏకంగా రూ.91కోట్ల నష్టం

  • Salman Khan : సల్మాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పై ఫ్యాన్స్ ఆందోళన..ఇలా మారిపోయాడేంటి!

  • Bollywood Actress : పాన్ ఇండియా స్టార్ కి తల్లిగా, బాలీవుడ్ హీరో కి ప్రియురాలిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుస్తా.. ఈమె ఏజ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Latest Photo Gallery
  • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us