Salman Khan : సల్మాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పై ఫ్యాన్స్ ఆందోళన..ఇలా మారిపోయాడేంటి!

Salman Khan :
బాలీవుడ్ లో టాక్ తో సంబంధం లేకుండా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టే అతి తక్కువ మంది హీరోలలో ఒకరు సల్మాన్ ఖాన్(Salman Khan). ప్రీ కోవిడ్ ముందు సల్మాన్ ఖాన్ దరిదాపుల్లో మరో హీరో ఉండేవాడు కాదు. ఓపెనింగ్స్ లో అయినా, క్లోజింగ్ లో అయినా సల్మాన్ ఖాన్ తన తోటి హీరోలకంటే పది అడుగులు ముందు ఉండేవాడు. కానీ ‘దబాంగ్ 3’ చిత్రం నుండి ఆయన మార్కెట్ బాగా పడిపోయింది. ఒక్క సినిమా కూడా వింటేజ్ సల్మాన్ ఖాన్ బాక్స్ ఆఫీస్ స్టామినా ని గుర్తు చేయలేకపోయాయి. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘టైగర్ 3’ కి పర్వాలేదు అనే రేంజ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ రేంజ్ వసూళ్లను మాత్రమే దక్కించుకుంది. ఇప్పుడు ఆయన అభిమానులంతా ‘సికిందర్'(Sikindar Movie) చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ మురగదాస్(AR Murugadoss) ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
కాసేపటి క్రితమే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయాయ్యి. ఇదంతా పక్కన పెడితే సల్మాన్ ఖాన్ లేటెస్ట్ లుక్స్ ని చూసి ఆయన అభిమానులు భయపడిపోతున్నారు. ఇన్ని రోజులు ఆయన సికిందర్ మూవీ కోసం గెడ్డం లుక్ లో కనిపించాడు. కానీ ఇప్పుడు సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అవ్వడం తో క్లీన్ షేవ్ లుక్ లో కనిపించాడు. చాలా కాలం తర్వాత సల్మాన్ ఖాన్ క్లీన్ షేవ్ లుక్ లో కనిపించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు. ఇదేంటి సల్మాన్ ఖాన్ ఇలా తయారయ్యాడు,ఆయన ఆరోగ్యం బాగానే ఉంది కదా, ముఖం గ్లో మొత్తం తగ్గిపోయింది, ముడతలు కనిపిస్తున్నాయి, అసలు ఏమైంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే అభిమానులు సల్మాన్ ఖాన్ 60 ఏళ్ళ వయస్సుకు దగ్గర పడ్డాడు అనే విషయాన్నీ గ్రహించాలి. ఈ వయస్సు లో ఏ హీరో అయినా క్లీన్ షేవ్ చేస్తే అలాగే కనిపిస్తారు.
70 ఏళ్ళ వయస్సు కు దగ్గరగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ని క్లీన్ షేవ్ లుక్ లో చూసి మనమంతా ఎన్ని సంవత్సరాలు అయ్యింది?, రీ ఎంట్రీ తర్వాత నుండి ఆయన గెడ్డం లుక్ లోనే కనిపిస్తూ వచ్చాడు. ఒక్కే ఒక్కసారి ఆయన మీసం, గెడ్డం తీసేసాడు. అప్పుడు కూడా ఆయన అభిమానుల ఇలాంటి రియాక్షన్ వచ్చింది. మెగాస్టార్ కి ఏమైంది ఆయన ఆరోగ్యం బాగానే ఉంది కదా అని. అభిమానులు తమ అభిమాన హీరోల వయస్సు గురించి ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఇకపోతే సికిందర్ చిత్రం బాలీవుడ్ లో అంచనాలు చాలానే ఉన్నాయి. అక్కడ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంటున్న రష్మిక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. టీజర్, పాటలకు కూడా రెస్పాన్స్ బాగానే వచ్చింది, చూడాలి మరి ‘చావా’ లాంటి సక్సెస్ తర్వాత మళ్ళీ అలాంటి సక్సెస్ బాలీవుడ్ కి ఈ సినిమా రూపంలో వస్తుందా లేదా అనేది.